లక్ష్మీస్ ఎన్టీఆర్ పై వర్మ ఇంట్రెస్టింగ్ అప్ డేట్ – నా కెరీర్ లో మొదటిసారి

RGV Gives An Interesting Update on Lakshmis NTR,Telugu Filmnagar,Tollywood Cinema Latest News,Telugu Film Updates,Latest Telugu Movies 2018,Interesting Update on Lakshmis NTR Movie,Ram Gopal Varma on Lakshmis NTR Movie,Ram Gopal Varma Lakshmis NTR Movie Release Date Locked,Ram Gopal Varma Latest Updates on Lakshmis NTR
RGV Gives An Interesting Update on Lakshmis NTR

క్రిష్ దర్శకత్వంలో నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు బయోపిక్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. బాలకృష్ణ తన తండ్రి పాత్రలో నటిస్తుండగా.. పలువురు లెజెండరీ యాక్ట్రస్ పాత్రల్లో ఈనాటి యంగ్ హీరోలు, హీరోయిన్స్ నటిస్తున్న సంగతి కూడా విదితమే. వారి వారి పాత్రల్లో పరకాయ ప్రవేశం చేసి మరి నటిస్తున్నారేమో అనిపిస్తుంది ఆ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్స్ చేస్తుంటే.

ఇదిలా ఉండగా ఇప్పుడు మరో ఇంట్రస్టింగ్ అప్ డేట్ ఒకటి బయటకు వచ్చింది. అదేంటంటే. రామ్ గోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ గురించి. నిజానికి ఈ బయోపిక్ పై కొద్ది నెలల క్రిందటే చర్చలు జరిగాయి. అయితే తాజాగా ఇప్పుడు రామ్ గోపాల్ వర్మే స్వయంగా తన ట్విట్టర్ ద్వారా ఈ సినిమా గురించి అప్ డేట్ ఇచ్చాడు. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను విజయదశమి సందర్బంగా అక్టోబర్ 18న తిరుపతిలో ప్రారంభిస్తున్నామని… చాలా థ్రిల్లింగ్ గా ఉందని ట్వీట్ చేశాడు.

 

 

అంతేకాదు..క్రిష్ తీస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ లక్ష్మీపార్వతి ఎన్టీఆర్ లైఫ్ లోకి వచ్చే ముందు వరకూ ఉంటుందని..కానీ మా బయోపిక్ మాత్రం లక్ష్మీపార్వతి ఎన్టీఆర్ లైఫ్ లోకి వచ్చిన తరువాత నుండి ఉంటుందని…జీవి ఫిలింస్ పతాకంపై వైసీపీ నేత రాకేష్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారని తెలిపాడు. అంతేకాదు జనవరి చివరిలో ఈ సినిమాను రిలీజే చేయనున్నట్టు ఇప్పుడే చెప్పేశాడు. ఓ సినిమాకు ముహూర్తం పెట్టడం..అది కూడా బాలాజీ సన్నిదిలో ముహూర్త పెట్టడం నా కెరీర్ లోనే ఇంతకు ముందు ఎన్నడూ చేయలేదు..ఇప్పుడు చేస్తున్నాను..ఎందుకంటే ఎన్టీఆర్ పై నాకున్న గౌరవం అది అని పేర్కొన్నాడు. మరి క్రిష్ ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు అంటూ రెండు భాగాల్లో ఎన్టీఆర్ లైఫ్ ను చూపిస్తుండగా.. వర్మ తరువాత స్టోరీ ని తీసుకున్నాడు. మరి చూద్దాం లక్ష్మీస్ ఎన్టీఆర్ ఎలా ఉంటుందో.

 

 

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here