ఇది ప్రదీప్ కు స్వయంవరం కాదు…భస్మాసురం

Anchor Pradeep Machiraju About Pelli Choopulu Show, Anchor Pradeep Machiraju Latest News, Latest News on Pelli Choopulu Show, Latest Telugu Movies 2018, Pelli Choopulu Telugu Show Fails to Impress, Pradeep Machiraju Pelli Choopulu Show Fails to Impress, Pradeep Machiraju Pelli Choopulu Show Latest Updates, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema Latest News
Pradeep Machiraju Pelli Choopulu Show Fails to Impress

టీవీ షో అంటే విజ్ఞాన – వినోదాల మేళవింపుగా ఉండాలి… కౌన్ బనేగా కరోడ్ పతి , సత్యమేవ జయతే , ద కపిల్ శర్మ షో ,తెలుగులో యాహూ,వాఁవ్ వంటి టీవీ షోలు అటు విజ్ఞానానికి ఇటు వినోదానికి సోపానాలుగా ప్రేక్షకులను అలరించాయి. ఇంటిల్లిపాది కూర్చుని చూడవలసిన కార్యక్రమాలు ఇలా ఉభయతారకంగా ఉంటే ఎవరికీ అభ్యంతరం ఉండదు. కొన్ని సందర్భాలలో కొంచెం హద్దు మీరిన ట్లుగా అనిపించినప్పటికీ “జబర్దస్త్ ” లాంటి కామెడీ షో ని కూడా కొంతవరకు యాక్సెప్ట్ చెయ్యొచ్చు. కానీ ప్రస్తుతం మాటీవీలో ప్రసారమవుతున్న ప్రదీప్” పెళ్లి చూపులు” అనే రియాల్టీ షో ని చూస్తుంటే దిగజారుడుతనానికి పరాకాష్టగా అనిపిస్తుంది.

మొన్నటి దాకా “బిగ్ బాస్ – 2” షో తో మంచి రేటింగ్ సాధించి ఒక తరహా ప్రేక్షకులను ఒక రేంజ్ లో అలరించిన మా టీవీ “పెళ్లి చూపులు” షో తో ప్రతిష్టను దిగజార్చుకుంది.

టీవీ ఛానల్స్ ప్రేక్షకులను ఆకర్షించటం కోసం రకరకాల కార్యక్రమాలు చేస్తుంటాయి. వాటిలో కొన్ని విజయవంతం కావచ్చు…. కొన్ని ఫెయిల్ కావచ్చు… అయితే వాల్యూస్ పరంగా దిగజారుడుతనం కనిపిస్తే అది ఆ కార్యక్రమానికే కాకుండా మొత్తం ఛానల్ ప్రతిష్టకు తీవ్ర నష్టం కలిగిస్తుంది. ప్రస్తుతం పెళ్లి చూపులు షో ద్వారా “మా టీవీ”అలాంటి అప్రతిష్టను మూటగట్టుకోబోతుంది.

ఇప్పటికీ రెండు వారాల పాటు ప్రసారం అయిన ఈ షో ఆడవాళ్లకు ఆగ్రహాన్ని, మగవాళ్లకు అసహ్యాన్ని కలిగిస్తుంది.
పద ముగ్గురు అమ్మాయిలు ఒక అబ్బాయిని ఆకర్షించడం కోసం రకరకాల విన్యాసాలు చేస్తూ, వగలు పోతూ, వయ్యారాలు పోతూ ఆబగా, ఆశగా ఎగబడటం చూస్తుంటే కంపరం పుడుతుంది. ఈ 13 మందిలో చివరికి విన్నర్ గా నిలిచిన అమ్మాయిని ఏంకర్ ప్రదీప్ నిజంగా పెళ్లి చేసుకుంటాడు అన్నది ఈ షో కాన్సెప్ట్. యాంకర్ గా ఒక household నేమ్ గా ఎదిగిన ప్రదీప్ నిజంగానే ఈ షోలో గెలిచిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు అన్న నమ్మకంతో ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారు మహిళా ప్రేక్షకులు. కానీ ఈ షో నడుస్తున్న తీరు చూస్తుంటే ఇది కేవలం రేటింగ్ ల చీటింగ్ అనే అభిప్రాయం బలపడుతుంది.

ఇంతకూ ఈ షోలో పాల్గొంటున్న 13 మంది అమ్మాయిలు ఎవరు? వాళ్ల కుటుంబ నేపథ్యం ఏమిటి? నిజంగా గౌరవప్రథమైన కుటుంబాలకు చెందిన అమ్మాయిలైతే ఇలాంటి పిచ్చి షోలో చేసినందుకు రేపటి రోజున ఆ పిల్లలకు పెళ్లి అవుతుందా?. ప్రదీప్ ను ఆకర్షించడం కోసం, పోటీలో నెగ్గటం కోసం రకరకాల వగలుపోతున్న ఆ అమ్మాయిల పాట్లు-ఫీట్లు చూస్తుంటే జాలేస్తుంది.

అయితే ఆ 13 మంది నిజంగా ప్రదీప్ ను పెళ్లి చేసుకోవటం కోసం వచ్చిన “స్వయంవర వధువులు”కాదు…
they are just paid artists.. అన్నది ఒక బహిరంగ రహస్యం. వాళ్లు ఎక్కడ ఎక్కడ ఏ సినిమాల్లో, ఏ మోడలింగ్ కార్యక్రమాల్లో ఏలాంటి పాత్రలు పోషించారో ఆ వివరాలు మొత్తం మీడియా దగ్గర ఉన్నాయి. అయితే పెయిడ్ ఆర్టిస్టులతో ఒక ప్రోగ్రాం చేయటం తప్పేమీ కాదు…

కానీ అసలు తప్పంతా ఈ చీటింగ్ వ్యవహారమే… ప్రదీప్ నిజంగా ఈ షోలో విన్నర్ అయిన అమ్మాయిని పెళ్లి చేసుకోకుండా ఇదంతా ఉత్తుత్తినే… తూచ్… అన్నాడంటే మాత్రం ప్రదీప్ కు, మా టీవీ కి మహిళా సంఘాల చేతిలో ‘జింతాక్ తా జితాక్ జితాక్’ తప్పదు. అయినా 13 మంది అమ్మాయిలు పెళ్లి కోసం ఒకడి మీదకు ఇలా ఎగబడటం ఆడవాళ్ళ ఆత్మగౌరవానికి, ఆత్మాభిమానానికి పెద్ద భంగపాటు అనే అభిప్రాయం చూసిన వాళ్ళు ఎవరికైనా కలుగుతుంది.
ఈ పిచ్చి షోలో మరో బాధాకరమైన విషయం ఏమిటంటే… మనందరం తెలుగువారి “ఓప్రా విన్ ఫ్రే ” గా అభిమానించే “సుమ” ఈ కార్యక్రమంలో ప్రదీప్ కు- 13 మంది అమ్మాయిలకు మధ్య ” సంధానకర్త” గా వ్యవహరించటం….!? what a fall Suma ?

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here