దసరా బరిలోకి దిగనున్న పందెంకోడి 2

Pandem Kodi 2 Release Date Locked,Telugu Filmnagar,Tollywood Cinema Latest News,Telugu Film Updates,Latest Telugu Movies 2018,Pandem Kodi 2 Release Date Confirmed,Pandem Kodi 2 Release Date Fixed,Pandem Kodi 2 Release Date Announced,Pandem Kodi 2 Movie Latest News,Pandem Kodi 2 Telugu Movie updates,Pandem Kodi 2 Release Date Revealed
Pandem Kodi 2 Release Date Locked

2006 సంవత్సరం లో ఎన్ . లింగుసామి దర్శకత్వంలో విశాల్ హీరోగా వచ్చిన పందెం కోడి సినిమా ఎంత ఘన విజయం సాధించిందో అందరికీ తెలుసు. ఇప్పుడు 12 సంవత్సరాల తరువాత మళ్లీ ఈ సినిమా పందెంకోడి 2 సీక్వెల్ తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్దమవుతోంది. ఇప్పటికే ఈ సినిమా టీజర్, ట్రైలర్ లు రిలీజ్ చేయగా వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ట్రైలర్ లో ప్రతి ఒక్క డైలాగ్ మాస్ ప్రేక్షకులకు విపరీతంగా నచ్చేస్తుంది. ఇక ఈ సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించారు చిత్రయూనిట్. ఇప్పటివరకూ ఈసినిమా అక్టోబర్ 18న వస్తున్నట్టు తెలిసినా…ఇప్పుడు మరోసారి అఫీషియల్ గా ప్రకటించారు. దీంతో దసరా బరిలో ఈ సినిమా కూడా చేరిపోయింది.

కాగా విశాల్ హీరోగా కీర్తి సురేష్,వరలక్ష్మి శరత్ కుమార్ హీరోయిన్స్ గా లింగుసామి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను ఠాగూర్ మధు నిర్మిస్తున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. తమిళ, తెలుగు భాషల్లో ఈసినిమాను రిలీజ్ చేయనున్నారు. మరి పందెంకోడి సినిమాతోనే విశాల్ తమిళ ప్రేక్షకులతో పాటు తెలుగు ప్రేక్షకులలో అభిమానులను సొంత చేసుకున్నాడు. మరి ఈ పందెంకోడి సినిమా సూపర్ హిట్టయ్యింది…మరి పందెంకోడి2 సినిమా ఎలా ఉంటుందో చూడాలంటే రిలీజ్ వరకూ ఆగాల్సిందే.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here