డిఫరెంట్ రోల్ లో ఆదర్శ్ బాలకృష్ణ

Adarsh Balakrishna Playing a Different Role in a New Webseries,Telugu Filmnagar,Tollywood Cinema Latest News,Telugu Film Updates,Latest Telugu Movies 2018,Adarsh Balakrishna Movie Latest News,Adarsh Balakrishna Upcoming Project Details,Adarsh Upcoming Movie Updates,Adarsh Upcoming Film With a Different Concept,Adarsh to work an New Webseries
Adarsh Balakrishna Playing a Different Role in a New Webseries

ఆదర్శ్ బాలకృష్ణ అంటే వెంటనే గుర్తొచ్చేది బిగ్ బాస్ తెలుగు సీజన్ 1. బిగ్ బాస్ షో ద్వారానే ఆదర్శ్ చాలామందికి సుపరిచితుడయ్యాడు. నిజానికి తాను హ్యాపీడేస్ సినిమాలో నటించినా పెద్దగా ఎవరూ గుర్తించలేదు కానీ.. బిగ్ బాస్ షో ద్వారా మాత్రం అందరి దగ్గరయ్యాడు. ఇక బిగ్ బాస్ షో లో రన్నరప్ గా నిలిచినా ఆయనకు ఒకటి రెండు సినిమా ఆఫర్లు వచ్చాయే తప్పా పెద్దగా రాలేదనే చెప్పొచ్చు.

అయితే ఇప్పుడు మరో డిఫరెంట్ రోల్ లో నటించడానికి రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. అయితే సినిమాలో కాదులెండి…వెబ్ సిరీస్ లో… అది కూడా హిందీ వెబ్ సిరీస్ లో నటించనున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా ఆదర్శే చెప్పాడు. సర్జికల్ స్ట్రైక్స్ నేపథ్యంలో తెరకెక్కుతున్న వెబ్ సిరీస్ లో తాను నటిస్తున్నట్టు.. ఆర్మీ ఆఫీసర్ పాత్రలో తాను నటిస్తున్నట్టు చెప్పాడు. ఇంకా 13 సంవత్సరాల క్రితం ఇక్బాల్ అనే హిందీ సినిమాలో నటించాను..ఇన్నేళ్ల తరువాత మళ్లీ హిందీలో నటిస్తున్నాను… నా ఫ్రెండ్ రికమెండేషన్ ద్వారా దీనిలో నటించే ఆవకాశం వచ్చింది…దర్శకత్వం వహిస్తున్నాడు అని తెలియజేశాడు. ముంబైలో మొదటి షెడ్యూల్ పూర్తవ్వగా.. జమ్మూ కాశ్మీర్ లో మిగిలిన షూటింగ్ పూర్తిచేయనున్నట్టు తెలిపారు. ఇంకా డిజిటల్ మీడియా గురించి మాట్లాడుతూ… డిజిటల్ మీడియా ద్వారా కొత్త వాళ్లకి మంచి అవకాశాలు లభిస్తున్నాయని…డిజిటల్ మీడియానే ఫ్యూచర్ అని తెలిపాడు. కాగా ప్రస్తుతం ఆదర్శ్ శర్వానంద్, సుధీర్ వర్మ సినిమాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here