గేమ్ ఓవర్ అంటున్న తాప్సీ

Taapsee Latest Tamil Movie Game Over,Telugu Filmnagar,Tollywood Cinema Latest News,Telugu Film Updates,Latest Telugu Movies 2018,Taapsee Latest Tamil Movie,Taapsee Upcoming Movie Details,Taapsee New Movie Updates,Taapsee New Tamil Movie Game Over,Taapsee Latest Movie Updates,Taapsee New Film Title Game Over
Taapsee Latest Tamil Movie Game Over

ఝుమ్మందినాదం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన తాప్సీ ఆ తరువాత ఎన్నో మంచి సినిమాల్లో నటించి మంచి పేరు సంపాదించుకుంది. ఆ తరువాత తెలుగులో కాస్త అవకాశలు తగ్గిన నేపథ్యంలో బాలీవడ్ లో అడుగుపెట్టి అక్కడ తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. అయితే అక్కడ కూడా ఈ అమ్మడు తన సత్తా చాటింది. పింక్, నామ్ షబానా..జుడ్వా 2 ఇలా హిట్లు కొడుతూ అక్కడ కూడా తనకు తిరుగులేదనిపించుకుంది. ఆ తరువాత మళ్లీ తెలుగులో ఆనందో బ్రహ్మా సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చి ఆ సినిమాతో కూడా హిట్ కొట్టి మళ్లీ ఫామ్ లోకి వచ్చింది. తాజాగా నీవెవరో సినిమాలో కూడా డిఫరెంట్ రోల్ లో అందర్నీ ఆకట్టుకుంది. ఇలా వైవిధ్యమైన కథనాలు ఎంచుకుంటూ…డిఫరెంట్ రోల్స్ చేస్తూ బిజీ బిజీగా గడుపుతోంది.

ఇప్పుడు తాజాగా మరో ఢిపరెంట్ స్టోరీతో వస్తున్నట్టు తెలుస్తోంది తాప్సీ. గేమ్ ఓవర్ అనే టైటిల్ తో వస్తున్న ఈ సినిమాలో తాప్సీ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు. నిజంగా పోస్టర్ చూస్తుంటేనే ఇదో వెరైటీ కాన్సెప్ట్ అన్న విషయం అర్ధమైపోతుంది. ఓ వీల్ చైర్ లో కూర్చోన్న తాప్సీ కాళ్లకు కట్లు కట్టి ఉంటాయి.. తాను తదేకంగా ఆలోచిస్తుంటుంది. మరి పోస్టర్ తోనే సినిమాపై క్యూరియాసిటీ పెంచేశారు.

అశ్విన్ శరవణన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ అక్టోబర్ 11 నుండి ప్రారంభించనున్నారు. వై నాట్ స్టూడియోస్ మరియు రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ సమర్పణలో ఎస్ శశికాంత్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here