యుద్దానికి రెడీ అయిన సుదీప్, విజయసేతుపతి- లుక్స్ పీక్స్

Sudeep & Vijay Sethupathi Join Sye Raa shoot,Telugu Filmnagar,Tollywood Cinema Latest News,Telugu Film Updates,Latest Telugu Movies 2018,Sye Raa Narasimha Reddy Telugu Movie Latest Updates,Vijay Sethupathi Joins Sye Raa Movie Shoot,Sye Raa Team Shoot in Georgia,Sudeep Joins Sye Raa Movie Shooting in Georgia,Sye Raa Movie shooting Latest News,Sye Raa Movie Shoot Location Latest Updates
Sudeep & Vijay Sethupathi Join Sye Raa shoot

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చిరంజీవి ప్రధాన పాత్రలో స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితచరిత్ర ఆధారంగా సైరా సినిమా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జార్జియాలో జరుపుకుంటుంది. సువిశాల ప్రదేశంలో ఈ సినిమాకు కీలకమైన యుద్ద సన్నివేశాలు తీస్తున్నారు సురేందర్ రెడ్డి. ఈ సినిమా బడ్జెట్ దాదాపు 250 కోట్లు కాగా.. కేవలం ఈ ఒక్క యుద్ద సన్నివేశానికే దాదాపు 55 కోట్లు దాకా ఖర్చు చేస్తున్నారంటేనే అర్ధం చేసుకోవచ్చు…ఈ యుద్ద సన్నివేశం సినిమాకు ఎంత కీలకమో.

ఇక గత కొద్దికాలంగా అక్కడే చిత్ర యూనిట్ షూటింగ్ జరుపకుంటుండగా..ఇప్పటికే జగపతిబాబు, విజయ్ సేతుపతి, సుదీప్ షూటింగ్ లో పాల్గొన్నారు. చిరు కూడా ఇటీవలే షూటింగ్ లో పాల్గొన్నారు. ఇదిలా ఉండగా..ఇప్పుడు ఈ షూటింగ్ కు సంబంధించి ఓ ఫొటో బయటకు వచ్చింది. ఇప్పుడు ఆఫొటో సోషల్ మీడియాలో వైరగా మారింది అదేంటంటే.. ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్న సుదీప్, విజయ్ సేతుపతి ఇద్దరూ కలిసున్న ఫొటో. నిజానికి ఇప్పటికే సుదీప్ ఫస్ట్ లుక్ విడుదల చేయగా..దానికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. కానీ..ఈ ఫొటోలో విజయ్ సేతుపతిని, సుదీప్ ను ఒకేసారి..ఒకో ఫొటోలో చూస్తుంటే నిజంగా అల్లు అర్జున్ డైలాగ్ మాటల్లేవ్ అన్న డైలాగ్ గుర్తుకురాక మానదు. మరి ఫొటో కే ఇలాంటి ఫీలింగ్ వస్తే సినిమా చూస్తే ఇంకేలా ఉంటుందో. సుదీప్ లుక్ అయితే బాబోయ్ పీక్స్ అనేలా ఉంది. ఈ సినిమాలో అవుకు రాజుగా సుదీప్ కనిపించనున్నాడు. ఇక చిరు, అమితాబ్, జగపతిబాబు, విజయ్ సేతుపతి, సుదీప్ వీరందరినీ ఒకే ఫ్రేమ్ లో చూస్తే తలుచుకుంటేనే రోమాలు నిక్కపోడుచుకోక తప్పదు.

దాదాపు 2000 మందికి పైగా స్టాఫ్ తో నిర్విరామంగా జరుపుకుంటున్న షూటింగ్ ను చూస్తుంటే అనుకున్నదానికంటే ముందుగానే షూటింగ్ పూర్తయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇక్కడి నుండి వెళ్లిన సిబ్బందితో పాటు అక్కడ ఫారెన్ సిబ్బంది దాదాపు 500 కు పైగా అంతా కలిసి ఈ సినిమా కోసం పనిచేస్తున్నారు. ఇక సన్నివేశాలు కూడా అనుకున్నదానికంటే అద్భుతంగా వస్తున్నాయట. మరి వీరందరినీ ఒకే స్క్రీన్ పై చూసి ఎంజాయ్ చేయాలంటే ఈ సినిమా వచ్చేంతవరకూ ఆగాల్సిందే.

కాగా ఈ సినిమాలో చిరంజీవి స‌ర‌స‌న నయనతార నటిస్తోంది. ఇంకా ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, జగపతిబాబు, సుదీప్, విజయ్ సేతుపతి, తమన్నా, ప్రగ్యా జైస్వాల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అమిత్ త్రివేది ఈ హిస్టారికల్ మూవీకి మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో చిరు తనయుడు, హీరో రామ్ చరణ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా..2019 వేసవిలో ఈ సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here