పవన్ కళ్యాణ్… ఈ పేరు వింటే పరవశించిపోయే అభిమానులు కోట్ల సంఖ్యలో ఉన్నారు. ఎల్లలు లేని అభిమానం, కల్మషం ఎరుగని ప్రేమ, హద్దులు ఎరుగని ఆవేశం, ఆత్మాహుతి కైనా పాల్పడే తెగింపు, ఎవరినైనా ఎదుర్కొనే ధైర్యం… ఇవన్నీ పవన్ కళ్యాణ్ అభిమానుల సహజ లక్షణాలు. ఇంతటి అభిమాన సంపదను పవన్ కళ్యాణ్ ఎలా సాధించుకున్నారు?
శతాధిక చిత్రాల్లో నటించలేదు… దశాబ్దాల చరిత్ర లేదు… చేసిన కొద్ది చిత్రాలలో అధిక శాతం హిట్స్ లేవు… అయినా సరే పవన్ కళ్యాణ్ పేరు చెప్తే చాలు అభిమానులు ఉర్రూతలూగిపోతారు… ఉవ్వెత్తున ఎగిసిపడతారు. జయాపజయాలకు అతీతమైన అభిమానాన్ని సొంతం చేసుకున్న పవన్ కళ్యాణ్ “ఫ్యాన్ ఫాలోయింగ్ సీక్రెట్ ” ఏమిటో ఎవరికీ అర్థం కాదు..
ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ ఓ ప్రభంజనం… పవన్ కళ్యాణ్ ఓ సమ్మోహన శక్తి.
అలాంటి పవన్ కళ్యాణ్ హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చి నేటికి 22 సంవత్సరాలు పూర్తయింది. 1996 అక్టోబర్11న పవన్ కళ్యాణ్ నటించిన తొలి చిత్రం “అక్కడ అమ్మాయి – ఇక్కడ అబ్బాయి” విడుదలైంది. ఈ ఇరవై రెండు సంవత్సరాలలో పవన్ కళ్యాణ్ ఇరవై మూడు చిత్రాలలో నటించారు. ఈ ఇరవై మూడు చిత్రాలలో అద్భుత విజయాలు ఉన్నాయి.. అనూహ్య పరాజయాలు ఉన్నాయి. సాధారణంగా వరుస పరాజయాలు ఎదుర్కొన్న స్టార్ కు అభిమానుల సంఖ్య తగ్గుతూ వస్తోంది.. కానీ జయాపజయాలతో సంబంధం లేకుండా పవన్ కళ్యాణ్ అభిమానుల సంఖ్య మాత్రం పెరుగుతూనే ఉంటుంది.
విశ్లేషణాత్మక దృష్టితో చూస్తే దీనికి కారణం పవన్ కళ్యాణ్ నటనలోనూ, ఆయన పోషించిన పాత్రల్లోనూ ఒక డిఫరెంట్ స్టైల్ అండ్ అప్రోచ్ కనిపించటమే.నిజానికి తన 7 వ చిత్రమైన “ఖుషి” తరువాత 17వ చిత్రమైన “గబ్బర్ సింగ్” వరకు పవన్ కళ్యాణ్ కు తన స్టామినా కు తగిన హిట్ లేదనే చెప్పాలి. కానీ పవన్ కళ్యాణ్ తన ఇమేజ్ కి, డిమాండ్ కి ఇసుమంత డామేజ్ కూడా జరక్కుండా నెగ్గుకురావటం చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.
పవన్ కళ్యాణ్ కు ఇలాంటి జయాపజయాతీతమైన స్ట్రాంగెస్ట్ ఇమేజ్ ఏర్పడటానికి తొలి రోజులలో తను పోషించిన డిఫరెంట్ అండ్ స్టైలిష్ క్యారెక్టర్స్ తాలూకు బలమైన పునాది కారణం అనుకోవచ్చు. ముఖ్యంగా గోకులంలో సీత,సుస్వాగతం, తొలిప్రేమ, తమ్ముడు, బద్రి,ఖుషీ చిత్రాల పాత్రలలోని స్టయిల్, చిలిపితనం, అల్లరి, ధైర్యం వంటి లక్షణాలు యూత్ కు బాగా కనెక్ట్ అయ్యాయి. జానీ ప్లాప్ తరువాత వచ్చిన గుడుంబా శంకర్, బాలు, బంగారం, అన్నవరం వంటి చిత్రాలు ఆశించిన స్థాయిలో విజయవంతం కాకపోయినప్పటికీ పవన్ స్టామినా ఏ మాత్రం తగ్గలేదు. బద్రీ లో “బద్రీ… బద్రీనాథ్”- ఖుషీ లో “సిద్దూ… సిద్దార్ధ రాయ్” అంటూ పవన్ కళ్యాణ్ స్టైలిష్ గా అనటం అభిమానుల గుండెల్లో అలా నాటుకు పోయింది. ఆ విధంగా పవన్ కళ్యాణ్ పోషించిన పాత్రలు యూత్ కు బాగా కనెక్ట్ అయిన నేపథ్యంలో ఆయన పోషించిన ” 10 బెస్ట్ క్యారెక్టర్స్” లో మీకు బాగా నచ్చిన క్యారెక్టర్ ఏది అని ఒక పోల్ గేమ్ నిర్వహిస్తూ మీ పార్టిసిపేషన్ ను ఆహ్వానిస్తోంది “ద తెలుగు ఫిలిం నగర్ డాట్ కాం“. ఇక్కడ పవన్ కళ్యాణ్ నటించిన 10 హిట్ చిత్రాల పేర్లు వాటిలో ఆయన పోషించిన పాత్రల పేర్లు ఇస్తున్నాం.
ఈరోజుతో పవన్ కళ్యాణ్ 22 సంవత్సరాల పవర్ ఫుల్ జర్నీ ని పూర్తిచేసుకున్న సందర్భంగా నిర్వహిస్తున్న ఈ క్యూరియస్ పోల్ గేమ్ లో పాల్గొని select the Best Charector of Pavan Kalyaan.
Thank You All.
