ఎన్టీఆర్ బయోపిక్- బాబాయ్ తో మళ్లీ ఇలా!

Kalyan Ram First Look from Balakrishna NTR Biopic,Telugu Filmnagar,Tollywood Cinema Latest News,Telugu Film Updates,Latest Telugu Movies 2018,Kalyan Ram First Look in NTR Biopic Movie,Kalyan Ram in NTR Biopic Telugu Movie,Kalyan Ram Plays Father Hariskrishna in NTR Biopic Movie,Kalyan Ram Role in NTR Biopic Movie,Kalyan Ram Character in NTR Biopic Movie
Kalyan Ram First Look from Balakrishna NTR Biopic

ఎన్టీఆర్ బయోపిక్ షూటింగ్ మాత్రం నిర్విరామంగా జరుపుకుంటోంది. షూటింగ్ జరుపుకోవడమే కాదు… ఈ షూటింగ్ కు సంబంధించి అప్ డేట్స్ ఎప్పటికప్పుడు అభిమానులకు అందిస్తూ…సినిమాలో నటించే వాళ్ల ఫస్ట్ లుక్ లు, షూటింగ్ స్టిల్స్ ఎప్పటికప్పుడు విడుదల చేస్తూ అభిమానుల్లో క్యూరియాసిటీ ని పెంచుతున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ఎన్టీఆర్ పాత్రలో నటిస్తున్న బాలకృష్ణ ఫస్ట్ లుక్, చంద్రబాబు పాత్రలో నటిస్తున్న రానా ఫస్ట్ లుక్ ను, అక్కినేని నాగేశ్వర్రావు పాత్రలో నటిస్తున్న సుమంత్ ఫస్ట్ లుక్ ను, నిన్న రకుల్ ప్రీత్ సింగ్ పుట్టిన రోజు సందర్భంగా శ్రీదేవి పాత్రలో నటిస్తున్న ఆమె ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. ఇక ఈ లుక్స్ ను చూస్తే ఆ పాత్రల్లో వారు పరకాయ ప్రవేశం చేశారేమో అన్నట్టు అనిపిస్తోంది. ఒక్కోక్కరి లుక్ సినిమాపై అంచనాలు రోజు రోజుకూ పెంచేస్తున్నాయి.

ఇక ఇప్పుడు తాజాగా ఈ సినిమా నుండి మరో ఫొటోను తన ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేసి తన పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నాడు.. నందమూరి హరికృష్ణ కొడుకు కళ్యాణ్ రామ్. ఈ బయోపిక్ లో హరికృష్ణ పాత్రలో కళ్యాణ్ రామ్ నటిస్తున్నాడు. ఈ నేపథ్యంలో బాలకృష్ణతో కలిసి తాను ఉన్న ఫొటోను ట్విట్టర్లో పోస్ట్ చేసి.. ముప్పై ఏళ్ల క్రితం నేను బాబాయ్ తో కలిసి బాల గోపాలుడు సినిమాలో బాలుడిలా నటించాను…ఇప్పుడు మళ్లీ బాబాయ్, వాళ్ల నాన్నగారిలా, నేను మానాన్న గారిలా నటిస్తున్నాను అంటూ పోస్ట్ పెట్టి తన ఆనందాన్ని పంచుకున్నాడు. అయితే ఫేస్ మాత్రం చూపించలేదు. మరి ఏదో ఒక మూహూర్తంలో ఆ లుక్ ను కూడా చూపిస్తారేమో.

 

కాగా క్రిష్ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలకృష్ణ తో పాటు, రానా, సుమంత్, రకుల్ ప్రీత్ సింగ్, విద్యాబాలన్ ఇంకా పలువురు స్టార్ హీరోస్, హీరోయిన్స్ నటిస్తున్నారు. ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకడు టైటిల్స్ తో రెండు పార్ట్ లుగా వస్తున్న ఈ సినిమా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. జనవరి 9న కథానాయకుడు రిలీజ్ చేస్తుండగా.. జనవరి 24న మహానాయకడు సినిమాను రిలీజ్ చేస్తున్నారు.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here