మీటూ ఉద్యమంపై కాజల్- అలాంటి కార్యక్రమాలు మానుకోండి

Kajal Aggarwal Responds on Metoo

తనూ శ్రీ దత్తా ఎప్పుడైతే నానా పటేకర్ పై కామెంట్స్ చేసిందో అప్పటి నుండి ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే చాలా మంది సెలబ్రిటీలు, హీరోయిన్స్ కూడా నోరు తెరచి తమకు ఇలాంటి వేధింపులు ఎదురయ్యాయని.. ధైర్యంగా ముందుకొచ్చి చెబుతున్నారు. మరికొంత మంది వారికి మద్దతు తెలుపుతున్నారు. దాంతో ఇప్పుడు ఈ వ్యవహారం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. మీటూ మీటూ అంటూ రోజుకొకరు తెరపైకి రావడంతో ఇంకెంత దూరం వెళుతుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

తాజాగా ఈ వ్యవహారంపై టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ట్విట్టర్ ద్వారా స్పందించి మీటూకు తన మద్దతు తెలుపగా…ఇప్పుడు మరో స్టార్ హీరోయిన్ కాజల్ కూడా స్పందించి బాధితులకు తన మద్దతు ఇవ్వడంతో పాటు దీనిని విమర్శించే వాళ్లకు స్ట్రాంగ్ కౌంటర్ కూడా ఇచ్చింది.

మీ టూ ఉద్యమం సందర్భంగా మహిళలు ఒకరికొకరు అండగా నిలవాల్సిన అవసరం ఉందని.. ఇలాంటి లైంగిక వేధింపులు ఎదుర్కొని ధైర్యంగా మాట్లాడాలంటే చాాలా ధైర్యం కావాలని…తమ హక్కులు, న్యాయం కోసం పోరాడుతున్న ప్రతి ఒక్కరికి నేను మద్దతు తెలుపుతున్నానని తెలిపింది. లైంగిక వేధింపులకు గురైన నటీమణుల బాధను నేను అర్థం చేసుకోగలనని పేర్కొంది. అంతేకాదు.. ఈ సందర్భంగా ఈ వ్యాఖ్యలను కొట్టిపడేసే వారిపై కూడా కాజల్ ఆగ్రహం వ్యక్తం చేసింది. కేవలం ప్రచారం కోసమే మహిళలు ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని చెప్పడం సరికాదు… ఇలాంటి బురద చల్లే కార్యక్రమాలు మానుకోండి’ అంటూ కౌంటర్ ఇచ్చింది. మరి దీనిపై ఇంకెంత మంది హీరోయిన్స్ స్పందిస్తారో చూద్దాం..

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here