అరవింద సమేత విజయంపై ఎన్టీఆర్

Jr NTR Responds on Aravindha Sametha Success,Telugu Filmnagar,Tollywood Cinema Latest News,Telugu Film Updates,Latest Telugu Movies 2018,Jr NTR Responds on Aravindha Sametha Movie,Jr NTR About Aravindha Sametha Movie,Jr NTR Tweet on Aravindha Sametha Success,Jr NTR Talks on Aravindha Sametha Movie Success,Jr NTR Latest Updates
Jr NTR Responds on Aravindha Sametha Success

ఎన్నో అంచనాల మధ్య విడుదలైన అరవింద సమేత సినిమా ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దసరా కానుకగా విడుదలైన ఈ సినిమా సూపర్ టాక్ తో దూసుకుపోతుంది. త్రివిక్రమ్ డైలాగ్స్ కు ఎన్టీఆర్ యాక్షన్ తోడైతే ఎలా ఉంటుందో ఈ సినిమా ఓ ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. ఫ్యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కిన సినిమా అయినా కూడా కత్తులతో కాకుండా డైలాగ్స్ తోనే అందరినీ మెప్పించారు. ఎన్టీఆర్ మరోసారి తన నటవిశ్వరూపం చూపించాడు. ఎన్టీఆర్ తో పాటు మిగిలిన పాత్రలు కూడా చాలా ప్రాధాన్యత ఉన్న పాత్రలు. పూజాహెగ్డే, జగపతి బాబు, సునీల్, సుప్రియ పాఠక్, రావు రమేష్, శుభలేఖ సుధాకర్, నవీన్ చంద్ర ఇలా ఏ పాత్ర తక్కువ కాదు. అన్ని రోల్స్ కు అంత ప్రాధాన్యత ఇచ్చాడు కాబట్టే ఈసినిమా హిట్ టాక్ సొంతం చేసుకుంది.

ఇక సినిమా విజయం పై స్పందించిన ఎన్టీఆర్ తన సంతోషాన్ని ట్విట్టర్ ద్వారా పంచుకున్నాడు. ఈ సినిమాను ఇంత ఘన విజయం చేసినందుకు అభిమానులకు కృతజ్ఞతలు తెలిపాడు. ఇంకా ఈ సినిమాలో తనతో పాటు పనిచేసిన ప్రతి ఒక్కరి పేరు ప్రస్తావిస్తూ అందరికీ ధ్యాంక్స్ చెప్పాడు. ఇక త్రివిక్రమ్ లేకుంటే ఈ సినిమానే లేదని.. అది పాజిబుల్ అయ్యేది కాదని ట్విట్టర్లో పేర్కొన్నాడు. మొత్తానికి దసరా బరిలో దిగే సినిమాలకు అరవింద సమేత సినిమా మాంచి ఆరంభమైంది.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here