త్రివిక్రమ్ గారు అలా అనడం చాలా గర్వంగా ఉంది

Hero Karthikeya Movie Latest Updates, Hero Karthikeya Recent Hits Movies, Hero Kartikeya about Trivikram Response on RX 100, Karthikeya Feels Elated as Star Director Talks About Recent Hits, Latest Telugu Movies 2018, Rx100 hero Kartikeya about Trivikram, RX100 Movie Hero Karthikeya Exclusive Interview, RX100 Movie Hero Karthikeya Feels Elated as Star Director Talks About Recent Hits, RX100 Movie Hero Karthikeya Latest News, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema Latest News
Rx100 hero Kartikeya about Trivikram

ఈ ఏడాది ఇప్పటివరకూ వచ్చిన ఎన్నో సినిమాలు థియోటర్లో సందడి చేశాయి. వాటిలో కొన్ని భారీ బడ్జెట్ సినిమాలు ఉన్నాయి..కొన్ని తక్కువ బడ్జెట్ సినిమాలూ ఉన్నాయి. వాటిలో కొన్ని సినిమాలు హిట్టయ్యాయి. కొన్ని సినిమాలు ఫట్టయ్యాయి. కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తే..కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద కుప్పకూలాయి. వాటిలో రంగస్థలం, ఆర్ఎక్స్ 100, గూఢచారి, కేరాఫ్ కంచరపాలెం సినిమాలు మంచి ప్రేక్షకాదరణ పొందాయి.

ఇప్పుడు ఈ సినిమాలపైనే త్రివిక్రమ్ స్పందించారు. అరవింద సమేత ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన ఈ సినిమాలపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఆర్ఎక్స్ 100, గూఢచారి, కేరాఫ్ కంచరపాలెం, అర్జున్ రెడ్డి, పెళ్లి చూపులు సినిమాలను చూస్తే నాకు చాలా జెలసీగా ఉంది…అలాంటి సినిమాలు నేనెందుకు తీయలేకపోతున్నా అని చెప్పారు. ఇక త్రివిక్రమ్ చేసిన వ్యాఖ్యలపై కార్తికేయ తన ట్విట్టర్ ద్వారా స్పందించాడు. త్రివిక్రమ్ గారు ఆర్ఎక్స్ 100 గురించి చెప్పడం నిజంగా గ్రేట్ అని.. చాలా గర్వంగా ఉందని తన ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు.

మరి అజయ్ భూపతి దర్శకత్వంలో కార్తికేయ హీరోగా పరిచయం అవుతూ తెరకెక్కిన ఆర్ఎక్స్ 100 సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో తెలిసిందే కదా. ఈ ఏడాది విడుదలైన సినిమాల్లో భారీగా కలెక్షన్లు సాధించిన సినిమా లిస్ట్ లో ఈ సినిమా కూడా ఉంటుందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బోల్డ్ కంటెంట్ తో, రియల్ స్టోరీ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం యూత్ కి బాగా వచ్చడంతో బ్రహ్మరధం పట్టారు. దీంతో కంటెంట్ ఉండాలే కానీ… చిన్న సినిమా..పెద్ద సినిమా అన్నది మ్యాటర్ కాదని మరోసారి నిరూపించారు ప్రేక్షకులు.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here