మా డిస్ట్రిబ్యూషన్ కు అరవింద సమేత వీర రాఘవ తో హ్యట్రిక్ వచ్చింది -దిల్ రాజు

Dil Raju About Aravindha Sametha Collections,Telugu Filmnagar,Tollywood Cinema Latest News,Telugu Film Updates,Latest Telugu Movies 2018,Aravindha Sametha Telugu Collections Latest News,Dil Raju About Aravindha Sametha Movie Collections,Aravindha Sametha Movie Collections Updates,Dil Raju Speaks About Aravindha Sametha Collections,Aravindha Sametha First Day Collections by Dil Raju
Dil Raju About Aravindha Sametha Collections

” ఈరోజు విడుదలైన అరవింద సమేత వీర రాఘవ తో మా డిస్ట్రిబ్యూషన్ కు హ్యాట్రిక్ వచ్చింది. జనతా గ్యారేజ్, జై లవకుశ తరువాత ఇప్పుడు అరవింద సమేత వీర రాఘవ తో మా డిస్ట్రిబ్యూషన్ కు హ్యాట్రిక్ సక్సెస్ రావటం చాలా ఆనందంగా ఉంది అన్నారు ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు.
ఈ రోజు విడుదలైన అరవింద సమేత వీర రాఘవ అన్ని ఏరియాల నుండి రికార్డు బ్రేకింగ్ కలెక్షన్స్, మంచి పాజిటివ్ టాక్ తో హైదరాబాద్ పార్క్ హైయత్ హోటల్లో ఏర్పాటుచేసిన మీడియా మీట్ లో దిల్ రాజు, చిత్ర దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్, సునీల్, సంగీత దర్శకుడు తమన్, నటులు నవీన్ చంద్ర, శత్రు, ఎడిటర్ నవీన్ పాల్గొన్నారు.

ముందుగా దిల్ రాజు మాట్లాడుతూ:

రాత్రి ఎన్టీఆర్ గారితో కలిసి ఈ సినిమా చూశాను. ఒక గొప్ప సినిమా చూసిన అనుభూతి కలిగింది. ఎన్టీఆర్ ఫిలిమ్స్ లో ఫస్ట్ డే కలెక్షన్స్ లో అరవింద సమేత.. ఆల్టైమ్ రికార్డు సృష్టించింది. ఇది మా డిస్ట్రిబ్యూషన్ లో ఎన్టీఆర్ కు వరుసగా మూడవ హిట్. ఇక పెర్ఫార్మెన్స్ పరంగా ఎన్టీఆర్ లో గొప్ప నటుడిని చూస్తాము. చాలా గొప్పగా చేశారు…వన్ మ్యాన్ షో అనిపించింది. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు సినిమాను చాలా గొప్పగా తీశారు.

ఇంత మంచి సినిమా మా డిస్టిబ్యూషన్ లో చేయటం చాలా ఆనందంగా ఉంది అన్నారు.సునీల్ మాట్లాడుతూ “ ఈ సినిమాను థియేటర్ లో ప్రేక్షకుల మధ్య కూర్చుని చూసాను.చాలా రోజుల తరువాత నా తరహా పాత్రలో నన్ను చూసుకోవటం చాలా హ్యాపీ గా అనిపించింది.కొంత మంది ఇందులో యంటర్టైన్మెంట్ మిస్ అయింది అన్నారు..డైరెక్టర్ శ్రీనివాస్ గారు వండింది బిర్యానీ…బిర్యానీమీద జీడిపప్పు చల్లితే చూడటానికి బాగుంటుంది..ఫ్రూట్ సలాడ్ చేస్తే అరటిపండు వెయ్యాలి.అలాగే తీసుకున్న సబ్జెక్టు ను బట్టి కెమెడీ ,యాక్షన్ అనేవి ఉంటాయి.మొత్తానికి చాలా కాలం తరువాత ఒక మంచి సినిమా చేసాను అన్న తృప్తిని ఇచ్చింది ” అన్నారు.

దర్శకుడు త్రివిక్రమ్ మాట్లాడుతూ “మొదట ఏ కథ అయితే నేను చెప్పానో దానినే తీయండి..ఎలాంటి మార్పులూ వద్దు…ఇమేజ్ కోసమో ఇంక దేనికోసమో మార్పులు చెయ్యద్దు అని ఎన్టీఆర్ అనటం వల్లనే ఈ సినిమా సాధ్యపడింది.దీనికి మొదట్లో యాక్షన్ క్లైమాక్స్ అనుకున్నాం.కానీ దీన్ని వెర్బల్ క్లయిమ్యాక్స్ గా చేస్తే బాగుంటుందని చెప్పింది ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ ..ఇక ఎన్టీఆర్ రాయల సీమ యాస మాట్లాడటం బాగా క్లిక్ అయింది.ఆ యాస కథలో భాగం.. ఆ నేచరాలిటీ , ఒరిజనాలిటీ అలాగే ఉండాలని కోరుకుంది ఎన్టీఆర్. అందరూ చాలా మంచి సినిమా ఇచ్చానని అభినందించారు.. ఒక ప్రయత్నానికి మంచి రెస్పాన్స్ రావటం నిజమైన ఆనందాన్ని ఇస్తుంది” అన్నారు.

ఈ కార్యక్రమంలో ఇంకా థమన్,నవీన్ చంద్ర,శత్రు పాల్గొన్నారో.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here