కత్తులతో కాదు…కత్తుల్లాంటి డైలాగ్స్, ఎమోషన్స్ తో చంపేసిన ఎన్టీఆర్, త్రివిక్రమ్

Aravindha Sametha Movie Highlights,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2018,Tollywood Cinema Updates,Aravindha Sametha Movie Updates,Aravindha Sametha Telugu Movie Latest News,Aravindha Sametha Telugu Movie Highlights,Aravindha Sametha Movie Plus Points,Aravindha Sametha Telugu Movie Plus Points
Aravindha Sametha Movie Highlights

క్లాస్ రెటర్ త్రివిక్రమ్, మాస్ హీరో ఎన్టీఆర్ కాంబినేషన్ లో సినిమా అంటే ఎలా ఉంటుందబ్బా అని ఆసక్తిగా ఎదురుచూసిన అభిమానుల అనుమానాలకు బ్రేక్ పడింది. ఎన్నో రోజుల నుండి ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానుల ముందుకు అరవింద సమేత సినిమా వచ్చేసింది. ఇక ఈరోజు రిలీజ్ అయిన ఈ సినిమా మంచి టాక్ ను సంపాదించుకుంది. ఎన్టీఆర్ ఖాతాలో మరో హిట్ చేరింది. మరి త్రివిక్రమ్-ఎన్టీఆర్ కాంబోలో వచ్చిన ఈసినిమాలో హైలైట్స్ ఏంటో మనం ఒకసారి చూద్దాం..

ఓపెనింగ్ ఫైట్

 

 

అసలు సినిమా ప్రారంభమైన అరగంట సేపు అభిమానుల చేత ఈలలు వేయించాడు త్రివిక్రమ్. సినిమాలో ఫస్ట్ ఫైటింగ్ సినిమాకు హైలైట్ అని చెప్పొచ్చు. రామ్ లక్ష్మణ్ లు తీసిన ఆ ఫైట్ చూసి తీరాల్సిందే.

ఎన్టీఆర్-పూజాహెగ్డే మధ్య సన్నివేశం

 

 

ఇక సినిమాలో హీరోయిన్ పాత్రకు కూడా చాలా ప్రాధాన్యత ఉంది. టైటిల్ లోనే హీరోయిన్ పేరు ఉంది కాబట్టి సినిమాలో హీరోయిన్ కు ఎక్కువ ఇంపార్టెన్స్ ఉందన్న విషయం అర్దమైపోయింది. హీరోయిన్ అంటే ఏదో నాలుగు ముద్దు మాటలు, పాటలే అన్నట్టు కాకుండా…పూజాహెగ్డే పాత్రకు చాలా ప్రాధాన్యత ఇచ్చాడు త్రివిక్రమ్. అసలు ఈ సినిమాలో ఎన్టీఆర్ మార్పుకు కారణమే అరవింద. గొడవ ఎవడైన పడతాడు.. కానీ ఆ గొడవను ఆపేవాడే అసలైన మగాడు అని పూజా హెగ్డే చెప్పే పాయింటే ఎన్టీఆర్ మార్పుకు కారణమవుతుంది. ఎన్టీఆర్ లో మార్పుకు కారణమైన ఈ సీన్ సినిమాకు మరో హైలైట్.

ఎన్టీఆర్ – సుప్రియ పాఠక్ మధ్య సన్నివేశం

 

 

ఈ సినిమాలో ఇదొక హైలైట్ సీన్ అని ట్రైలర్ చూసినప్పుడే అర్ధమైపోయింది. మీ తాత కత్తిపడితే అది అవసరం.. మీ నాన్న కత్తి పడితే అది వారసత్వం.. నువ్వు కత్తి పడితే అది లక్షణం..నీ కొడుకు కత్తి పడితే అది లోపం అని ఎన్టీఆర్ నానమ్మ సుప్రియకు- ఎన్టీఆర్ కు మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్ కట్టిపడేస్తాయి. ఈ సీనే ఎన్టీఆర్ ఆలోచనా విధానంలో మార్పుకు కూడా కారణమవుతుంది. ఈ సీనే సినిమాకు కూడా లీడ్ అవుతుంది.

పూజాహెగ్డే, ఆమె తమ్ముడు కిడ్నాప్ సీన్

పూజా హెగ్డే, ఆమె తమ్ముడును కిడ్నాప్ చేసినప్పుడు.. ఈ సీన్ దగ్గర ఎన్టీఆర్ డిక్టేట్ చేసిన విధానం సింప్లీ సూపర్బ్. ఫోన్లోనే విలన్లకు వార్నింగ్ ఇచ్చే సీన్ ను ఎన్టీఆర్ చెప్పే విధానం..విలన్ను కూడా వాళ్లను అక్కడే వదిలేసి వెళ్లిపోవడం ఇవన్నీ థియేటర్లో చూస్తే రోమాలు నిక్కపొడుచుకోవాల్సిందే.

పెనివిటి సాంగ్

 

 

ఈ పాట గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. సాంగ్ రిలీజ్ అయినప్పుడే ఈ పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. సీమ లాంటి ఊరిలో తన భర్తకోసం ఓ భార్య ఎదురుచూసే థీమ్ తో ఈపాట ఉంటుంది. తన భర్త ఎప్పుడొస్తాడో…అసలు వస్తాడో?రాడో? ఎలాంటి పరిస్థితిల్లో వస్తాడో అని తన భర్త రాకకోసం ఎదురుచూసే భార్య ఫీలింగ్ ను ఎన్టీఆర్ ప్రొజెక్ట్ చేసిన విధానం చాలా బావుంటుంది. ఇక బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా సినిమాకు ప్లస్ పాయింట్.

ప్రీ క్లైమాక్స్ సీన్

ప్రీ క్లైమాక్స్ సీన్ లో ఎన్టీఆర్, పూజాహెగ్డే, సునీల్ కు, జగపతిబాబు, బ్రహ్మాజీ బ్యాచ్ కు ఊరిబయట మధ్య జరిగే సంభాషణ మరో హైలైట్. ఇక క్లైమాక్స్ కూడా సినిమాకు మరో హైలైట్. నిజానికి యాక్షన్ సినిమా కాబట్టి క్లైమాక్స్ కూడా కొట్టుకోవడాలు, నరుక్కోవడాలు ఉంటాయేమో అని అందరూ అనుకుంటారు. కానీ త్రివిక్రమ్ ఆ సంప్రదాయానికి నిజంగా బ్రేక్ వేశాడు. యాక్షన్ క్లైమాక్స్ కాకుండా… వెర్బల్ క్లైమాక్స్ తో సినిమాను ముగిస్తాడు. ఇక డైలాగ్స్ చెప్పడంలో ఎన్టీఆర్ తోపు కాబట్టి క్లైమాక్స్ చెప్పే డైలాగ్స్ సూపరో సూపర్. కత్తులతో కాదు కత్తుల్లాంటి మాటలతో అందరిలో మార్పు తెస్తాడు.

ఇలా చెప్పుకుంటూ పోతే సినిమాలో చాలానే హైలైట్స్ ఉన్నాయి. ఎన్టీఆర్ ఈ సినిమాను తన భుజాలపై మోసాడు. తన డైలాగ్స్ తో అటు యాక్షన్ సీన్స్ లోనూ, అటు తాను మారి వేరేవాళ్లను కాంప్రమైజ్ చేసేప్పుడు సెటిల్డ్ యాక్టింగ్ లోనూ నటనకు కేరాఫ్ అడ్రస్ తానే అని మరోసారి నిరూపించాడు. ఇక త్రివిక్రమ్ డైలాగ్స్ ఈ సినిమాకు ప్రాణం పోశాయి. త్రివిక్రమ్ కలం నుండి జాలువారిన అక్షరాలకు ఎన్టీఆర్ ప్రాణం పోశాడు. మొత్తానికి ఈ దసరాకు ప్రేక్షకుల ముందుకు వచ్చిన అరవింద సమేత సినిమా ఘన విజయం సాధించి ఎన్టీఆర్ ఖాతాలో మరో హిట్ పడింది. అజ్ఞాతవాసి ఫెయిల్యూర్ తో కసిగా ఉన్న త్రివిక్రమ్ మరోసారి తన పెన్నుకు ఉన్న పదును పోలేదని నిరూపించింది.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here