సైరా అమితాబ్ లుక్ రిలీజ్- పవర్ ఫుల్ లుక్

Amitabh Bachchan First Look from Sye Raa Narasimha Reddy,Telugu Filmnagar,Tollywood Cinema Latest News,Telugu Film Updates,Latest Telugu Movies 2018,Amitabh Bachchan Role Revealed in Sye Raa on his Birthday,Amitabh Bachchan First Look in Sye Raa Movie,Amitabh Bachchan Role in Sye Raa Movie,Amitabh Bachchan Character Revealed in Sye Raa Movie,First Look of Amitabh Bachchan in Sye Raa Narasimha Reddy Movie
Amitabh Bachchan First Look from Sye Raa Narasimha Reddy

మెగాస్టార్ చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమా సైరా నరసింహా రెడ్డి. ఉయ్యాల వాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో చిరంజీవితో పాటు పలువురు ప్రముఖ హీరోలు కీలకమైన పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమానుండి ఒక్కో పాత్రను విడుదల చేస్తుండగా ఇప్పుడు తాజాగా బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ లుక్ ను రిలీజ్ చేశారు. నేడు అమితాబ్ 76వ పుట్టిన రోజు సందర్భంగా చిత్ర యూనిట్‌ మోషన్‌ టీజర్‌ ను అధికారికంగా విడుదల చేసింది. ఈ సినిమాలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గురువు గోసాయి వెంకన్నపాత్రలో అమితాబ్‌ కనిపించునున్నట్టు తెలుస్తోంది. పవర్‌ ఫుల్‌ లుక్‌ లో అమితాబ్ కనిపిస్తూ, సినిమాపై అంచనాలను మరింతగా పెంచేశారు. నిజంగా సైరా గురువు అంటే ఎలా ఉండాలో అలా ఉన్నట్టు అనిపిస్తోంది అమితాబ్ ను చూస్తుంటే.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జార్జియాలో జరుపుకుంటుంది. ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన యుద్ధ సన్నివేశాలు అక్కడ చిత్రీకరిస్తున్నారు. కాగా ఈ సినిమాలో చిరంజీవి స‌ర‌స‌న నయనతార నటిస్తోంది. ఇంకా ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, జగపతిబాబు, సుదీప్, విజయ్ సేతుపతి, తమన్నా, ప్రగ్యా జైస్వాల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అమిత్ త్రివేది ఈ హిస్టారికల్ మూవీకి మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో చిరు తనయుడు, హీరో రామ్ చరణ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా..2019 వేసవిలో ఈ సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here