నోటా పై రౌడి స్పందన- నేను మారను… నా యాటిట్యూడ్ మారదు

Vijay Deverakonda Opens Up on NOTA Failure,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2018,Tollywood Cinema Updates,Vijay Deverakonda About NOTA Movie,Vijay Deverakonda Up on Negative Reviews For NOTA Movie,Vijay Deverakonda Latest Interview For NOTA Movie,Vijay Deverakonda Opens Up on NOTA Telugu Movie Failure,Vijay Deverakonda Interview About NOTA Movie
Vijay Deverakonda Opens Up on NOTA Failure

ఒక్క సినిమా ఫ్లాప్ అయితే చాలు ఇక ఆ హీరో ఎలాంటి విమర్శలు ఎదుర్కుంటాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మాములుగా బద్నాం చేయరుగా. ఇక ఫ్యాన్స్ అయితే మళ్లీ తమ అభిమాన హీరో ఎప్పుడు హిట్ ఇస్తాడా అని కళ్లు కాయలు కాచేలా చూస్తారు. ఇక హీరోలు కూడా ఈసారి తీయబోయే సినిమా ఎలాగైనా హిట్ కొట్టాలని…అభిమానులను సంతోషపరచాలని ఓ పక్క జాగ్రత్తగా..మరో పక్క భయపడుతూనే సినిమాలు చేస్తుంటారు. అయితే ప్రస్తుతం టాలీవుడ్ ను ఏలుతున్న స్టార్ హీరోలకైతే ఇక్కడ పరిస్థితులు తెలుసు. కానీ ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో నిలదొక్కుకుంటున్న హీరోలకు ఆదిలోనే ఫ్లాప్స్ వస్తే వాళ్ల పరిస్థితులు ఎలా ఉంటాయో మనం కొంతమంది హీరోలను చూస్తూనే ఉన్నాం.

కానీ ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే మోస్ట్ వాంటెండ్ హీరోగా పేరుతెచ్చుకున్న విజయ్ దేవరకొండ మాత్రం ఫ్లాప్స్ ను అస్సలు కేర్ చేయనట్టే కనిపిస్తోంది. పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి, గీత గోవిందం సినిమాలతో విజయ్ దేవరకొండ ఇండస్ట్రీ మోస్ట్ వాంటెడ్ హీరో అయిపోయాడు. యూత్ లో మాంచి క్రేజ్ సొంతం చేసుకున్న విజయ్ సినిమా అంటే భారీ అంచనాలు పెట్టేసుకుంటున్నారు. అలా అంచనాల మధ్య విడుదలైన నోటా సినిమా అంచనాలు అందుకోలేదనే చెప్పుకోవాలి. కానీ విజయ్ నటనకు మాత్రం ఫుల్ మార్స్క్ పడ్డాయి. కేవలం విజయ్ దేవరకొండ కోసం సినిమా చూసిన వాళ్లు ఉన్నారు.

అయితే నోటా సినిమాపై వస్తున్న కామెంట్లపై విజయ్ స్పందించి మరోసారి తాను డిఫరెంట్ అని నిరూపించాడు. కొద్ది రోజుల క్రితం ట్రోల్స్ పై స్పందించిన విజయ్ తన అభిమానులకు ఎలాగైతే ఓ లెటర్ రాస్తూ…సందేశం ఇచ్చాడో తాజాగా నోటా కామెంట్స్ పై కూడా స్పందించి ఓ పోస్ట్ పెట్టాడు. ఎవరైతే నాకోసం సినిమా చూడటానికి వెళుతున్నారో… ఇంకా ఎవరైతే ఫెయిల్యూర్ ను సెలబ్రేట్ చేసుకుంటున్నారో అంటూ స్టార్టింగ్ స్టార్టింగే సెటైరిక్ వే లో స్టార్ట్ చేసిన విజయ్..

ఈ సినిమా విషయంలో నేను ఎక్స్ క్యూజెస్ చెప్పాలనుకోవడంలేదు.. రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలనుకుంటున్నాను. ‘నోటా’ సినిమా చేసినందుకు గర్వంగా ఉంది. ఈ సినిమా ద్వారా మేము చెప్పాలనుకున్న స్టోరీ చెప్పాము, అందుకు తగిన పెర్ఫార్మెన్స్ ఇచ్చాము అని విజయ్ తెలిపారు. ఇంకా…తమిళనాడు, నేషనల్ మీడియాతో పాటు నా సినిమాను ఇష్టపడిన వారి ప్రేమను స్వీకరిస్తాను…ఎవరికైతే ‘నోటా’ సినిమా నచ్చలేదో? ఎవరైతే విమర్శలు చేశారో…. వాటిని సీరియస్‌గా తీసుకుంటాను. ఎందుకు ఇలా జరిగిందనే విషయం స్టడీ చేస్తాను. నా వైపు ఏమైనా తప్పులు ఉంటే సరిద్దుకుంటాను.. అయితే నా యాటిట్యూడ్ మాత్రం మారదు..ఓ విజయమో, అపజయమో ఓ రౌడీని తయారు చేయలేవు, మార్చలేవు…రౌడీ అనేది కేవలం విజయం కోసం కాదు..రౌడీలు అయినందుకు గర్వపడదాం. ఫైట్‌ చేస్తూ ఉందాం. గెలుస్తే గెలుస్తాం లేదా నేర్చుకుంటాం… నా సినిమా ను చూసి ఎంజాయ్ చేస్తున్న వాళ్లకిదే టైమ్.. ఇప్పుడే పండగ చేసుకోండి..త్వరలోనే వస్తా.. అంటూ మరోసారి తన యాటిట్యూడ్ తో పోస్ట్ పెట్టాడు. ఇప్పుడా పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి ఒక్క ఫ్లాప్ కే ఫీలయితే…ముందు ముందు ఎన్నో సినిమాలు తీయాలి.. వాటిలో ఎన్నిహిట్ అవుతాయో తెలియదు… ఫట్ అవుతాయో తెలీదు. సో ఇలాంటి యాటిట్యూడ్ కూడా ఉండటం మంచిదే..

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here