సైరా షూటింగ్- అదిరిపోయే జార్జియా లోకేషన్స్

Sye Raa Shoot Happening In The Best Locations in Georgia,Telugu Filmnagar,Tollywood Cinema Latest News,Telugu Film Updates,Latest Telugu Movies 2018,Sye Raa Starts Shooting in Georgia,Sye Raa Team Shoot in Georgia Location,Sye Raa Movie Shooting Latest Updates,Chiranjeevi Movie Sye Raa Shooting in Georgia
Sye Raa Shoot Happening In The Best Locations in Georgia

స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా చిరంజీవి కథానాయకుడిగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ‘సైరా’ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. చిరంజీవి తనయుడు రామ్ చరణే స్వయంగా దాదాపు 200 కోట్ల రూపాయలతో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జార్జియాలో జరుపుకుంటుంది. దాదాపు 40 రోజుల పాటు అక్కడే షూటింగ్ జరుపుకోనున్నారు చిత్రయూనిట్. ఈ సినిమాలో కీలకమైన యుద్ద సన్నివేశాలను అక్కడే చిత్రీకరించనున్నారు.

ఇప్పటికే ఇక్కడి నుండి చిత్ర సిబ్బంది అక్కడికి వెళ్లి యుద్దానికి సన్నివేశానికి సంబంధించి అక్కడ సెట్ చేశారు. విజ‌య్ సేతుప‌తి, అమితాబ్ బ‌చ్చ‌న్, న‌య‌న‌తార కూడా ఈ షెడ్యూల్లో పాల్గొననున్నారు. అయితే ఇన్ని రోజులు చిరంజీవి షెడ్యూల్ లేకపోవడంతో చిరంజీవి ఇక్కడే ఉన్నారు. ఇప్పుడు చిరు కూడా జార్జియాకు వెళ్లిపోయాడు. చిరుపై యాక్ష‌న్ సీన్స్ చిత్రీక‌ర‌ణ చేయ‌నున్నాడు సురేంద‌ర్ రెడ్డి. అంతేకాదు బ్రిటీష్ కాలం నాటి కథ కావడం వలన విదేశీ ఆర్టిస్టులు పెద్దసంఖ్యలో అవసరం కావడంతో అక్కడ ఈ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

ఇదిలా ఉండగా జార్జియాలోని సువిశాలమైన ప్రాంతంలో తీస్తున్న యుద్ద సన్నివేశాలు సినిమాకే హైలైట్ గా నిలుస్తాయని అంటున్నారు. నిజానికి మన దేశంలో చాలా మంచి ప్రదేశాలు ఉన్నాయి. పలు విదేశాల్లో కూడా మంచి లొకేషన్లు ఉన్నాయి. మరి అక్కడే షూటింగ్ ఎందుకు చేస్తున్నారో అన్న డౌట్ వచ్చింది కానీ… నిజంగా అక్కడ లొకేషన్లు చూస్తే మాత్రం నిజంగా ఆశ్చర్యపోవాల్సిందే. సువిశాల ప్రదేశం..అహ్లాదకరమైన వాతావరణం… సూర్యోదయం, సూర్యాస్తమయం రెండూ కళ్లకు కొట్టొచ్చినట్టు కనిపించే అందమైన లొకేషన్ అది. ఇలాంటి సినిమాకు ఎలాంటి లొకేషన్ కావాలో అలాంటిదే దొరికింది అని చెప్పొచ్చు. ఇదే కాదు ఇంకా అందమైన ఎన్నో లొకేషన్స్ జార్జియాకు సొంతం. కింద వీడియో ద్వారా ఆ లొకేషన్ అందాన్ని మీరు కూడా చూడొచ్చు.

కాగా ఈ సినిమాలో చిరంజీవి స‌ర‌స‌న నయనతార నటిస్తోంది. ఇంకా ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, జగపతిబాబు, సుదీప్, విజయ్ సేతుపతి, తమన్నా, ప్రగ్యా జైస్వాల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అమిత్ త్రివేది ఈ హిస్టారికల్ మూవీకి మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. వచ్చే ఏడాది ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

 

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here