45 వసంతాలు పూర్తిచేసుకున్న దర్శకధీరుడికి జన్మదిన శుభాభినందనలు.

Star Director SS Rajamouli Celebrating 45th Birthday,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2018,Tollywood Cinema Updates,Star Director SS Rajamouli Latest Updates,Bahubali Director SS Rajamouli Birthday Special,#HappyBirthdayRajamouli,SS Rajamouli Celebrating 45th Birthday,SS Rajamouli Celebrates his 45th Birthday Today,SS Rajamouli Upcoming Movies News
Star Director SS Rajamouli Celebrating 45th Birthday

ఇండియన్ సినిమా అంటే ఉత్తరాది వారు తీసే హిందీ సినిమాలే అనుకునే “రెస్ట్ ఆఫ్ ద వరల్డ్” కు ఇండియన్ సినిమా అంటే హిందీ సినిమా మాత్రమే కాదు…ఇక్కడ సౌత్ ఇండియా అనేది ఒకటి ఉందనీ… ఇక్కడ నాలుగు ప్రధాన భాషలలో సినిమాలు నిర్మితమౌతాయనీ .. వాటిలో “తెలుగు సినిమా” అనేదానికి ఒక గొప్ప అస్తిత్వం ఉందనీ నిరూపించారు మన దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి.ఆయన దర్శకత్వంలో రూపొందిన “బాహుబలి” ఇండియన్ సినిమా ముఖచిత్రం అంటే హిందీ సినిమా మాత్రమే కాదు అని నిరూపించింది. ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా ఇండియన్ సినిమా కు ప్రాతినిధ్య చిత్రంగా సగర్వంగా నిలిచింది మన బాహుబలి. ఇండియన్ సినిమా బాక్స్ ఆఫీస్ చరిత్రలో కనీవినీ ఎరుగని కలెక్షన్ల సునామిని సృష్టించిన “బాహుబలి ” సృష్టికర్త ఎస్ ఎస్ రాజమౌళి బర్త్ డే ఈ రోజు.

1973 అక్టోబర్ 10 న వెస్ట్ గోదావరి జిల్లా కొవ్వూరులో జన్మించిన “ కోడూరి శ్రీశైల శ్రీ రాజమౌళి ”ని పరిశ్రమలో అందరూ ఎస్.ఎస్.రాజమౌళి అనీ , ఆత్మీయులు ‘జక్కన్న’ అనీ పిలుస్తుంటారు. దర్శకుడిగా కెరీర్ ప్రారంభించినది మొదలు అపజయమెరుగని దర్శక ధీరుడు గా విజయ ప్రస్థానాన్ని కొనసాగిస్తున్న రాజమౌళి విజయ విహార ప్రస్థాన విశేషాలను ఒక్కసారి సింహావలోకనం చేసుకుందాం.

మూడు వరుస విజయాలను సాధిస్తే హ్యాట్రిక్ అంటారు.. మరి వరుసగా మూడు హ్యాట్రిక్ విజయాలకు చేరువవుతున్న రాజమౌళి విజయ ప్రస్థానం నిజంగా స్ఫూర్తిదాయకం. దర్శకుడిగా 17 ఏళ్ల ప్రయాణంలో రాజమౌళి సంఖ్యాపరంగా కేవలం 11 చిత్రాలు మాత్రమే ఇచ్చినప్పటికీ అవి సాధించిన ఘన విజయాలు బాక్సాఫీస్ చరిత్ర లో సువర్ణ అక్షర లిఖితమయ్యాయి.

వరుసగా “స్టూడెంట్ నెంబర్ 1, .,సింహాద్రి, సై, చత్రపతి, విక్రమార్కుడు, యమదొంగ, మగధీర, మర్యాద రామన్న, ఈగ, బాహుబలి ద బిగినింగ్, బాహుబలి ది కన్ క్లూజన్”- ఇవీ- రాజమౌళి నుండి వచ్చిన 11 అద్భుత విజయాలు. ఇన్ని వరుస విజయాలతో శిఖరాగ్ర దర్శకుడిగా ఎదిగినప్పటికీ వ్యక్తిగా నిరాడంబర, పారదర్శక వ్యక్తిత్వాన్ని అలవరచుకున్న రాజమౌళి లోని సంస్కార సంపద వెలకట్టలేనిది. ఆయనతో పాటు ఆ కుటుంబంలోని ప్రతి ఒక్కరిలో సినిమా పట్ల ఎనలేని ఆసక్తి, అధ్యయనం, అంకిత భావం, శ్రమ, పట్టుదల , సంఘటిత శ్రమ జీవన సౌందర్యం కనిపిస్తాయి.

స్వాతంత్ర్యానంతర చరిత్రలో తెలుగు జాతి ఉనికికి గుర్తింపు వచ్చి తెలుగు వారి ప్రస్తావనతో, ప్రశంసలతో, అభినందనలతో జాతీయ, అంతర్జాతీయ వేదికలు మారుమ్రోగిన సందర్భాలు నాలుగు ఉన్నాయి.

విశ్వవిఖ్యాత నటసార్వభౌమ ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించి తొమ్మిది నెలల్లో అధికారాన్ని కైవసం చేసుకొని ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించిన సందర్భంలో తొలిసారి తెలుగువాడి వాడి వేడి జాతీయంగా అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది.

ఆ తరువాత బహుముఖ ప్రజ్ఞాశాలి, బహుభాషా కోవిదులు పీవీ నరసింహారావు భారత ప్రధాని పదవిని అలంకరించిన తరుణంలో తెలుగు జాతి యావత్తు పులకించి పోయింది… తెలుగు జాతి బావుటా మరోమారు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రెపరెపలాడింది..

ఇవి రెండూ రాజకీయ రంగానికి చెందిన విజయ విశేషాలు కాగా…. సినిమా పరంగా తెలుగు ఖ్యాతి విశ్వవ్యాప్తమైన సందర్భాలు రెండున్నాయి…ఒకటి కళాతపస్వి కె.విశ్వనాధ్ దర్శకత్వంలో “శంకరాభరణం” సినిమా విడుదలైనప్పుడు అది సాధించిన ఘన విజయ విశేషాలతో తెలుగు సినిమా ఖ్యాతి విశ్వవ్యాప్తమైంది.

ఆ తరువాత తెలుగు సినిమా జాతీయస్థాయిలో ప్రభావాన్ని చూపిన సందర్భం దాదాపు లేదనే చెప్పాలి. ఇన్నేళ్ల తరువాత తెలుగు సినిమాకు ప్రపంచ స్థాయి గుర్తింపును , గౌరవాన్ని , ప్రతిష్టను తెచ్చిన ఘనత మన దర్శక ధీరుడు రాజమౌళికి దక్కింది.

అయితే బాహుబలి ద్వారా రాజమౌళి తెలుగు సినిమాకు తెచ్చిన గౌరవ ప్రతిష్టలను మరి ఏ ఇతర సందర్భం తోను ,విజయంతోనూ పోల్చటానికి వీలు లేదు. ఎందుకంటే బాహుబలి విజయం ఒక సాధారణ కమర్షియల్ సినిమాకు వచ్చే రెగ్యులర్ సక్సస్ లాంటిది కాదు. ఈ రోజున జాతీయస్థాయిలో ఏ భాషలో ఏ సినిమా విజయాన్ని తీసుకున్నా”non Baahubali” అంటున్నారే తప్ప బాహుబలి విజయంతో పోల్చదగిన సినిమా ఇప్పట్లో వస్తుందన్న ఆశ, అంచనా ఎవరికీ లేదు. ఇప్పుడు ఇండియన్ సినిమా అంటే ” బాహుబలి” అని ఇండియన్ డైరెక్టర్ అంటే “రాజమౌళి” అనే స్ప్రుహ అంతర్జాతీయ సినిమా వేదికలపై వినిపిస్తుంది… కనిపిస్తుంది.

ఇంతటి ఘన కీర్తిని, ప్రతిష్టను తెలుగు సినిమాకు తెచ్చిపెట్టిన ఎస్ ఎస్ రాజమౌళి సినీ ప్రస్థానం పదిహేడు వసంతాలను పూర్తిచేసుకుని పద్దెనిమిదవ వసంతంలోకి అడుగుపెట్టగా వ్యక్తిగా 45 వసంతాలను పూర్తి చేసుకున్నారు ఈ సంచలన దర్శకధీరుడు .

ఏ వ్యక్తి అయినా వృత్తిపరంగా ఘన విజయాలను సాధిస్తే అవి అతని వ్యక్తిగత విజయాలు గానే పరిగణించబడతాయి. కానీ బాహుబలి సిరీస్ ద్వారా రాజమౌళి సాధించిన విజయాలు భారత చలన చిత్ర చరిత్రలోనే అపూర్వ విజయాలుగా నిలిచిపోవటం తెలుగు వారందరికీ గర్వకారణం. ఇంతటి ఘన విజయాలతో తెలుగు సినిమా ఉనికిని అంతర్జాతీయ స్థాయిలో సగర్వంగా ఆవిష్కరించిన రాజమౌళికి కేవలం జన్మదిన శుభాకాంక్షలు చెబితే చాలదు. ఇది తెలుగు జాతి మొత్తం ఆ దర్శకధీరుడికి హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్పవలసిన సందర్భం. సో… ఈ సందర్భంగా రాజమౌళికి జన్మదిన శుభాకాంక్షలతో పాటు హృదయపూర్వక కృతజ్ఞతాభివందనాలు పలుకుతోంది “ద తెలుగు ఫిలిం నగర్ డాట్ కాం“.

ఇక ఆ దర్శకధీరుడు అందించిన 11 అఖండ విజయాలలో ప్రతి చిత్రమూ ఒక అద్భుతమే. అయితే ఆ 11 చిత్రాలలో “ది బెస్ట్” ఏది అని అడిగితే సమాధానం చెప్పటం కష్టమే అవుతుంది. ఎవరైనా ప్రపంచ చలన చిత్ర చరిత్రలోనే వన్ అఫ్ ద బ్లాక్ బస్టర్స్ గా నిలిచిన “బాహుబలి” నే” ది బెస్ట్ “అంటారు. అయితే హీరోను తెరమీద నమ్మశక్యం కానంత గొప్పగా ఆవిష్కరించడంలో రాజమౌళి చిత్రాల్లో దేనికి ఏదీ తగ్గదు. సో… సినిమా పరంగా కాకుండా హీరో ఆవిష్కరణ అనే కోణంలో “ ద బెస్ట్ హీరోయిజం ఆఫ్ రాజమౌళి ఏది?” అనే పోల్ గేమ్ నిర్వహిస్తూ మీ పార్టిసిపేషన్ ను ఆహ్వానిస్తోంది ” ద తెలుగు ఫిలిం నగర్ డాట్ కాం” . అయితే ఆ 11లో సై,మర్యాద రామన్న, ఈగ చిత్రాలు స్టార్ ఓరియెంటెడ్ కాదు. మిగిలిన ఎనిమిది చిత్రాలలో స్టార్స్ ను ఒక రేంజ్ లో ఆవిష్కరించారు రాజమౌళి.

సో… కింద ఇచ్చిన రాజమౌళి 8 చిత్రాల జాబితా నుండి “ది బెస్ట్ హీరోయిజం ఆఫ్ రాజమౌళి” ని సెలెక్ట్ చేస్తే …Your voting stands as your Greeting to The Darshka Dheera SS Rajamouli .

So…you are most welcome and thanked for your valuable participation.

 

45 వసంతాలు పూర్తిచేసుకున్న దర్శకధీరుడికి జన్మదిన శుభాభినందనలు

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here