చిరు పాత్రల నుండి శ్రీదేవి పాత్ర వరకు ఎదిగిన రకుల్ కు హ్యాపీ బర్త్ డే

#HappyBirthdayRakulPreet, Actress Rakul Preet Singh Latest News, Heroine Rakul Preet Singh Upcoming Movie News, Latest Telugu Movies News, NTR Movie Updates, NTR Telugu Movie Latest News, Rakul Preet Latest Look From NTR Biopic Movie, Rakul Preet Singh Receives Birthday Wishes in a Special Way, Special Story on Rakul Preet on this Birthday, Telugu Film News 2018, Telugu Filmnagar, Tollywood Cinema Updates
Special Story on Rakul Preet on this Birthday

ఒకటి రెండు అపజయాలతో విజయం మీద ఆశ వదులుకుంటే కెరీర్ ఆరంభంలోనే అంతమవుతుంది. అలా కాకుండా అపజయాలను విజయానికి సోపానాలుగా మార్చుకుంటే కొంచెం లేటుగా వచ్చినా లేటెస్ట్ గా, గ్రేటెస్ట్ గా ఉంటుంది సక్సస్. ఇందుకు ఉదాహరణగా నిలుస్తుంది హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కెరీర్. తెలుగు తమిళ కన్నడ హిందీ భాషలలో నటిస్తూ బహుభాషా నటి గా పేరు తెచ్చుకున్నప్పటికీ ఆమె ఎక్కువగా సక్సెస్ ను చూసింది తెలుగులోనే. తెలుగులో కూడా తొలిరోజుల్లో ఆమెకు రెడ్ కార్పెట్ వెల్కమ్ ఏమి దక్కలేదు. తెలుగులో ఆమె చేసిన మొదటి చిత్రం “కెరటం” ఫ్లాప్ అయింది. రెండవ చిత్రం “వెంకటాద్రి ఎక్స్ప్రెస్” సక్సెస్ అయినప్పటికీ మూడవ చిత్రం “రఫ్” ఫెయిలైంది. నాలుగో చిత్రం “లౌక్యం” హిట్ అవటంతో రకుల్ కెరీర్ ఫోర్త్ గేర్ లో పడింది.

ఇక అక్కడి నుండి స్పీడ్ అందుకున్న రకుల్ కెరీర్లో కరెంట్ తీగ, పండగ చేసుకో, కిక్ 2, బ్రూస్ లీ, నాన్నకు ప్రేమతో, సరైనోడు, ధ్రువ, విన్నర్, రారండోయ్ వేడుక చూద్దాం, జయ జానకి నాయక , స్పైడర్ వంటి భారీ చిత్రాలు ఉన్నాయి. వీటిలో అధిక శాతం విజయాలు ఉన్నాయి. ఇప్పటికి తెలుగులో రకుల్ ప్రీత్ సింగ్ 15 చిత్రాలలో నటించగా పదికి పైగా చిత్రాలు విజయవంతమయ్యాయి. ఒకవైపు నటిగా బిజీగా ఉన్నప్పటికీ హెల్త్ అండ్ ఫిట్ నెస్ పట్ల మంచి అవగాహన కలిగిన రకుల్ “ఎఫ్-45 ” పేరుతో హైదరాబాదులో ఫిట్నెస్ సెంటర్స్ ప్రారంభించారు. అంతేకాకుండా తెలంగాణ గవర్నమెంట్ ఆమెను “బేటి బచావో- బేటి పడావో” అనే మహిళా సాధికారిక కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్ గా నియమించింది. అన్నింటినీ మించి విశ్వవిఖ్యాత నటసార్వభౌమ ఎన్టీ రామారావు జీవిత కథ ఆధారంగా నిర్మితమవుతున్న” ఎన్టీఆర్” బయోపిక్ లో ఆలిండియా గ్లామర్ క్వీన్ స్వర్గీయ శ్రీదేవి పాత్రకు ఎంపిక కావడం రకుల్ జీవితంలో ఓ గొప్ప అచీవ్మెంట్. ఇంత చక్కని ప్రాస్పరస్ కెరీర్ ను ఎంజాయ్ చేస్తున్న రకుల్ ప్రీత్ సింగ్ బర్త్ డే ఈరోజు.
ఈ సందర్భంగా ఈ టాల్ బ్యూటీ నటించిన 10 విజయవంతమైన చిత్రాల నుండి “ద బెస్ట్ ఆఫ్ రకుల్” ను ఎంపిక చేయటం కోసం ఒక పోల్ గేమ్ నిర్వహిస్తూ మీ పార్టిసిపేషన్ ను ఆహ్వానిస్తుంది “ద తెలుగు ఫిలిం నగర్ డాట్ కం“.
voting the beauty is greeting the beauty …so vote and select the best from Rakul’s retrospective.

ఈ10 లో బెస్ట్ ఆఫ్ రకుల్ ఏది?

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here