పడి పడి లేచె మనసు టీజర్ రిలీజ్

Padi Padi Leche Manasu Teaser Out Now,Telugu Filmnagar,Tollywood Cinema Latest News,Telugu Film Updates,Latest Telugu Movies 2018,Padi Padi Leche Manasu Movie Teaser,Padi Padi Leche Manasu Teaser,Padi Padi Leche Manasu Movie Official Teaser,Padi Padi Leche Manasu Telugu Movie Teaser,Padi Padi Leche Manasu Movie Updates,Padi Padi Leche Manasu Teaser Latest News
Padi Padi Leche Manasu Teaser Out Now

హను రాఘవపూడి దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా పడి పడి లేచె మనసు తెరకెక్కుతున్నసంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. కోల్ కతా, నేపాల్ లోకెషన్లలో ఇన్ని రోజులు షూటింగ్ జరుపుకుంది. ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటుంది. ప్రధానమైన పాత్రలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను, హీరో .. హీరోయిన్ కాంబినేషన్లో రొమాంటిక్ సీన్స్ ను చిత్రీకరిస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్‌ లుక్స్‌, పోస్టర్స్‌ వైరల్‌ అవుతుండగా.. ఇప్పుడు తాజాాగా ఇప్పుడు ఈ సినిమా టీజర్ ను విడుదల చేశారు.

ఇక టీజర్ విషయానికొస్తే.. సినిమాలో మెడికోగా సాయిపల్లవి కనిపిస్తోంది. శర్వానంద్ ఆమెను ఫాలో చేయడం .. అది గమనించి ఆమె నిలదీయడం ఈ టీజర్ లో చూపించారు. యూత్ ఆశించే ఫీల్ కంటెంట్ లో కనిపిస్తోంది. సినిమాను హను రాఘవపూడి మార్క్‌ అందమైన ప్రేమకథగా తెరకెక్కుతున్నట్టుగా తెలుస్తోంది. అంతేకాదు ఈ సినిమాతో మరోసారి సాయి పల్లవి ఫిదా చేసేందుకు రెడీ అవుతోంది.

కాగా ఈ సినిమాలో శర్వానంద్ సరసన ఫిదా ఫేమ్ సాయి పల్లవి నటిస్తోంది. ఇక ఫిదా సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న సాయి పల్లవి హీరోయిన్ అవ్వడంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. ఇంకా ఈ సినిమాలో ముర‌ళీ శ‌ర్మ‌, సునీల్, వెన్నెల కిషోర్ కీల‌క‌పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఈ సినిమాలో ఫుట్ బాల్ ప్లేయర్ గా శర్వానంద్ .. డాక్టర్ పాత్రలో సాయిపల్లవి కనిపించనున్నారు. త్వరలోనే షూటింగ్ పూర్తి చేసి… డిసెంబర్ 21వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రానికి విశాల్‌ చంద్ర శేఖర్ సంగీతం అందిస్తున్నారు.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here