ఎన్టీఆర్ బయోపిక్ మూవీ అప్ డేట్

#HappyBirthdayRakulPreet, Actress Rakul Preet Singh Latest News, Heroine Rakul Preet Singh Upcoming Movie News, Latest Telugu Movies News, Nandamuri Balakrishna NTR Biopic Latest Update, NTR Movie Updates, NTR Telugu Movie Latest News, Rakul Preet Latest Look From NTR Biopic Movie, Rakul Preet Singh Receives Birthday Wishes in a Special Way, Telugu Film News 2018, Telugu Filmnagar, Tollywood Cinema Updates
Nandamuri Balakrishna NTR Biopic Latest Update

సక్సెస్ ఫుల్ దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో నందమూరి నట సింహం బాల కృష్ణ హీరో గా మహా నటుడు,రాజకీయ నాయకుడు నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహా నాయకుడు సినిమాలు రూపొందుతున్న విషయం తెలిసిందే. రెండు పార్ట్ లుగా రూపొందుతున్న ఎన్టీఆర్ బయోపిక్ లో ప్రముఖ తారాగణం ముఖ్య పాత్రలలో నటిస్తుండగా,అతిధి పాత్రలలో ప్రముఖ టాలీవుడ్ నటీనటులు నటిస్తున్నారు. ఎన్ బికె ఫిల్మ్స్, విబ్రి మీడియా, వారాహి చలన చిత్రం బ్యానర్స్ పై రూపొందుతున్న ఎన్టీఆర్ బయోపిక్ సినిమాకు కీరవాణి స్వర కర్త.ఎన్టీఆర్ కథానాయకుడు సినిమాలో అతిలోక సుందరి శ్రీదేవి పాత్రకు రకుల్ ప్రీత్ సింగ్ ను సెలెక్ట్ చేశారు.

నందమూరి తారక రామారావు, శ్రీదేవి జంటగా నటించిన వేటగాడు, కొండవీటి సింహం, గజదొంగ, బొబ్బిలి పులి, జస్టిస్ చౌదరి సినిమాలు బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. ఆయా సినిమాలలోని సాంగ్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. వేటగాడు సినిమాలోని ఆకు చాటు పిందె తడిసె క్లాసిక్ సాంగ్ ఎవర్ గ్రీన్ హిట్. ప్రస్తుతం హైదరాబాద్ లో ప్రత్యేక సెట్ లో ఎన్టీఆర్ కధానాయకుడు సినిమా కై ఆ సాంగ్ ను బాలకృష్ణ, రకుల్ ప్రీత్ సింగ్ పై చిత్రీకరిస్తున్నారు. అక్టోబర్ 10 వ తేదీ రకుల్ ప్రీత్ బర్త్ డే సందర్భంగా శ్రీదేవి గెటప్ లో ఉన్న రకుల్ ప్రీత్ ఫస్ట్ లుక్ చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. డిజైనర్ వైట్ డ్రెస్ లో ఆ సాంగ్ లో పాల్గొన్న హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్, శ్రీదేవి ని తలపిస్తుంది. ఎన్టీఆర్ బయోపిక్ మూవీ కై నందమూరి అభిమానులతోపాటు ప్రేక్షకులు కూడా ఆసక్తి తో ఎదురు చూస్తున్నారు.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here