ఎన్టీఆర్ కు ప్రతి 7వ సినిమా ఒక మైల్ స్టోన్… సో… అరవింద…

Jr NTR Aravinda Sametha Gets Another Luck Factor, Jr NTR Gets Another Blockbuster Movie, Jr NTR Gets Another Hit Movie Aravinda Sametha, Jr NTR Gets Another Luck Factor, Jr Ntr Latest Movie Updates, Jr NTR Talks About Aravinda Sametha Movie, Latest Telugu Movies News, Telugu Film News 2018, Telugu Filmnagar, Tollywood Cinema Updates
Jr NTR Aravinda Sametha Gets Another Luck Factor

సెంటిమెంట్స్ ను నమ్మటం నమ్మకపోవటం వాళ్ల వాళ్ల వ్యక్తిగత నమ్మకాల మీద ఆధారపడి ఉంటుంది. అన్ని సెంటిమెంట్స్ అన్ని సందర్భాలలో నిజం కాకపోవచ్చు… కానీ కొన్ని సెంటిమెంట్స్ మాత్రం చాలా సందర్భాలలో నిజం అవుతుంటాయి. ఎన్టీఆర్ కెరీర్ లో చూసుకుంటే ఒక విషయంలో ఒక సెంటిమెంట్ నిజమే అనిపిస్తుంది.
అదే “7th ఫిలిం సెంటిమెంట్”.

ఇప్పటివరకు విడుదలైన ఎన్టీఆర్ సినిమాల జాబితాను పరిశీలిస్తే మధ్యమధ్యలో విజయాలు- అపజయాలు దోబూచులు ఆడినప్పటికీ ప్రతి ఏడవ సినిమా హిట్ అవుతూవస్తుంది. ఇది ఎంతవరకు నిజమో మీరే చూడండి.
“నిన్ను చూడాలి ” చిత్రంతో హీరోగా కెరీర్ ప్రారంభించారు ఎన్టీఆర్. ఆపై వరుసగా స్టూడెంట్ నెంబర్ 1, సుబ్బు, ఆది, అల్లరి రాముడు, నాగ, చిత్రాలు వచ్చాయి. ఏడవ సినిమాగా వచ్చిన “సింహాద్రి” ఎన్టీఆర్ ను శిఖరాగ్రాల పై కూర్చోబెట్టిన విషయం సర్వజన విధితమే.

ఇది ఫస్ట్ సెవెంత్ వండర్.

ఇక ఇక్కడి నుండి ఎన్టీఆర్ ను వరుస ప్లాపులు వెంటాడాయి. ఆంధ్రావాలా, సాంబ, నా అల్లుడు, నరసింహుడు చిత్రాల పరాజయం తరువాత అశోక్, రాఖీ చిత్రాలు ఒక స్థాయిలో విజయవంతమయ్యాయి. అప్పుడు 14 సినిమాగా వచ్చిన “యమదొంగ” ఎన్టీఆర్ లు మరో శిఖరాగ్రంపై కూర్చోబెట్టింది.

ఇది రెండవ 7th వండర్.

ఇక ఇక్కడి నుండి ప్రారంభమైన థర్డ్ ఫేజ్ లో కంత్రీ, అదుర్స్, బృందావనం, శక్తి ,ఊసరవెల్లి, దమ్ము చిత్రాల తరువాత 21వ చిత్రంగా వచ్చింది”బాద్షా”. సింహాద్రి, యమదొంగ చిత్రాల స్థాయిలో కాకపోయినా బాద్షా కూడా మంచి విజయం గా నిలిచింది.

ఇది మూడవ 7 th వండర్.

ఇక ఇక్కడి నుండి ప్రారంభమైన ఫోర్త్ ఫేజ్ లో రెండు చిత్రాలు రామయ్య వస్తావయ్య, రభస చిత్రాలు బాగా డిసప్పాయింట్ చేయగా ఇక అక్కడనుండి అందుకున్న ఎన్టీఆర్ విజయ పరంపర అద్భుతంగా సాగుతోంది. టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్ చిత్రాలు ఒకదాన్ని మించి ఒకటి ఘన విజయాలు సాధించడంతో హ్యాట్రిక్ కొట్టేసిన ఎన్టీఆర్ కు 26వ చిత్రమైన ” జై లవకుశ” కమర్షియల్ గా ఒక మోస్తరు విజయాన్ని అందిస్తే ఒక కళాకారుడిగా “7th Heaven” లాంటి ఆనందాన్ని ఆస్వాదించారు ఎన్టీఆర్.

సో… ఇక చెప్పాల్సిందేముంది..? రేపు ఎన్టీఆర్ 28వ సినిమాగా విడుదల కానున్న” అరవింద సమేత వీర రాఘవ’ నాలుగవ 7th వండర్ అవుతుందనటంలో any doubts to anybody.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here