చైసామ్ మొదలుపెట్టేశారు- షూటింగ్ షురూ

Chay Sam New Movie Shoot Takes Off

చైసామ్ మళ్లీ మొదలుపెట్టేశారు. ఇంతకీ ఏం మొదలుపెట్టారనుకుంటున్నారా…? ఇన్ని రోజులు హాలిడే ట్రిప్ లో ఉన్న వీళ్లిద్దరూ మళ్లీ షూటింగ్ షురూ చేశారు. సెప్టెంబర్ 13 న రిలీజైన వీళ్లిద్దరి సినిమాలు మంచి టాక్ ను సొంతం చేసుకున్నాయి. ఆ తరువాత ఇద్దరూ విదేశాలకు ట్రిప్ కు వెళ్లి దాదాపు నెల రోజుల పాటు ఎంజాయ్ చేసి తిరిగొచ్చారు. ఇక అలా తిరిగొచ్చారో లేదో అప్పుడే తమ ప్రొఫెషన్ పై దృష్టి పెట్టేశారు.

నిన్ను కోరి దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వంలో నాగ చైతన్య, సమంత జంటగా కొత్త సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో మొదలవ్వగా…చైతు, సామ్ ఇన్ని రోజులు ట్రిప్ లో ఉండటంతో.. మిగిలిన పాత్రలకు సంబంధించిన సీన్స్ తీశారు. ఇప్పుడు తాజాగా చైసామ్ కూడా షూటింగ్ పాల్గొన్నారు. వీరిద్దరి మధ్య కొన్ని ముఖ్యమైన సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాలో వీరిద్దరూ భార్య భర్తలుగానే కనిపించనున్నారు. కాగా నాగచైతన్య నటించిన సవ్యసాచి విడుదలకు సిద్ధంగా కాగా, తమిళంలో సమంత నటించిన సూపర్ డీలక్స్ త్వరలోనే రిలీజ్ కానున్నది. మొత్తానికి ఇద్దరూ మరో సినిమాతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నారు. పెళ్లైన తరువాత ఇద్దరూ కలిసి నటిస్తున్న సినిమా కావడంతో…అభిమానులు వీరిద్దరి కాంబో ను మరోసారి తెరపైన చూడాటానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here