వికీపీడియాకు దబిడిదిబిడే అంటున్న బాలకృష్ణ ఫ్యాన్స్

Balakrishna Fans Aggressive on Wikipedia,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2018,Tollywood Cinema Updates,Balakrishna Latest News,Nandamuri Balakrishna Fans Aggressive on Wikipedia,Balakrishna Fans Latest Updates,Balakrishna Movies Latest News,Bala Krishna Fans Fire on Wikipedia For Showing Fake Details
Balakrishna Fans Aggressive on Wikipedia

ఒకప్పుడంటే మనకు ఏదైనా తెలియకపోతే ఆ విషయం గురించి బాగా తెలిసిన వ్యక్తినో.. లేదా పెద్ద వాళ్లనో అడిగి తెలుసుకునే వాళ్లం. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. టెక్నాలజీ పెరుగుతున్న కొద్ది…ప్రపంచం మొత్తం మన అరచేతిలోకి వచ్చేస్తుంది. ఏ చిన్న విషయం కావాలన్నా…తెలుసుకోవాలన్నా కాస్త కూడా బుర్రకు పని చెప్పకుండా గూగుల్ చేయడం.. వికీపీడియాలు చూడటం అలవాటుగా మారిపోయింది అందరికీ. గూగుల్ తల్లి అని ముద్దు పేరు కూడా పెట్టుకొని మరీ వాడేసుకుంటున్నారు. ఎదైనా అడిగితే గూగుల్ తల్లి ఉండగా టెన్షన్ ఎందుకు అనే రేంజ్ కు మారిపోయాం.

కానీ అన్ని తెలిసిన వికీపీడియా కూడా అప్పుడప్పుడు కొన్ని తప్పులు చేసి విమర్శలపాలవుతుంది. రీసెంట్ బాలకృష్ణ సమాచారంలో తప్పులో కాలేసింది. రీసెంట్‌గా నందమూరి బాలకృష్ణకు సంబంధించిన సమాచారాన్ని వికీపీడియాలో తప్పుగా చూపిస్తోంది. బాలయ్య 1913 నవంబర్‌ 2న జన్మించి, 1995 జూలై 19న మరణించినట్లు చూపిస్తోంది. ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయి..దీనిపై బాలకృష్ణ అభిమానులకు చేరడంతో వారు గూగుల్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే స్పందించి యాక్షన్ తీసుకోకపోతే తగిన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని మండిపడుతున్నారు. ఇక ఈ వార్త కాస్త గూగుల్ వరకూ వెళ్లడంతో వారు వెంటనే స్పందించి ఆ తప్పుడు సమాచారాన్ని తొలగించారు.

నిజానికి గూగుల్ లో ఇలాంటి తప్పులు రావడం ఇదేం కొత్తకాదు. గతంలో కూడా ఇలాంటి పొరపాట్లు చాలానే చేసింది. ప్రస్తుత ప్రధానినరేంద్ర మోడీని భారత మొదటి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ అని చూపించడం…మహేష్ బాబు గురించి సెర్చ్ చేస్తే హాలీవుడ్ హీరోను చూపించడం… అలాగే రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ ఫొటోను తప్పుగా చూపెట్టడం.. ఇలా పలు సందర్భాల్లో తప్పుడు సమాచారం అందించిన సందర్బాలు చాలా ఉన్నాయి. అయితే మోడీ గురించి కానీ, మహేష్ బాబు గురించి కానీ… ఇంకా రవీంద్రనాథ్ ఠాగూర్ రీసెంట్ గా బాలకృష్ణ విషయంలో వారి గురించి మనకు తెలుసు కాబట్టి తప్పు సమాచారం అందిస్తుందని తెలుస్తుంది. మరి మనకు అసలు తెలియని విషయంలో ఇలానే పొరపాటున సమాచారం తప్పుగా ఉంటే…అది నిజమో..కాదో తెలియని పరిస్థితన్నమాట మనది. దీన్ని బట్టి ఏ విషయాన్నైనా ఎవరో ఒకర్ని అడిగో..లేదా బుక్స్ చదివో తెలుసుకుని ఆ తరువాత గూగుల్ లో చూసుకుంటే సరిపోతుంది. అలా కాకుండా గుడ్డిగా నమ్మేస్తేనే అసలు ప్రాబ్లమ్.

 


Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here