పదహారేళ్ల 9 చిత్రాల త్రివిక్రముడి ఆహ్లాదకర విజయ ప్రస్థానం

16 Years Film Journey of Trivikram,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2018,Tollywood Cinema Updates,Trivikram Srinivas Journey in Tollywood,Film Journey of Trivikram,Trivikram Latest Movie Updates,Trivikram Journey in Telugu Film Industry,Trivikram Latest UPdates on His Film Journey
16 Years Film Journey of Trivikram

అభిమానులు స్టార్స్ కేనా ? స్టార్ డైరెక్టర్స్ కు ఉండరా..? స్టార్ డైరెక్టర్స్ కు కూడా స్టార్స్ కు చేసినట్లు పాలాభిషేకాలు, పూలాభిషేకాలు, కటౌట్లు, బ్యానర్లు, సన్మానాలు, సన్మాన పత్రాలు ఎందుకుండవు…? ఇలా ఆలోచించిన త్రివిక్రమ్ శ్రీనివాస్ వీరాభిమాని ఒకరు ఆయనకు సన్మానం చేసేందుకు ఒక సన్మాన పత్రాన్ని తయారు చేసాడు. అభిమాన సంఘాల భాషలో త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా పేర్లు అన్నింటిని కలిపి కొడుతూ ఆ అభిమాని రాసిన సన్మాన పత్రం ఇలా సాగింది:

“మాటల రచనకే కాదు… దర్శకత్వానికి కూడా ” నువ్వే నువ్వే” కరెక్ట్ అని హీరోలు, నిర్మాతలు ప్రోత్సహిస్తే ” అత్తారింటికి దారేది” అని తప్పించుకోవటానికి దార్లు వెతుక్కోకుండా ఆత్మవిశ్వాసంతో ఆలోచించి… అవును నేను” జులాయి” ని కాదు అని నిరూపిస్తూ తన “ఖలేజా” చూపిస్తూ సూటిగా “జల్సా”గా “సన్నాఫ్ సత్యమూర్తి” గా ఆహ్లాదకర విజయాలను సాధిస్తూ అందరూ ఆశ్చర్యంతో నోరు వెళ్ళబెట్టి “అ ఆ ” అనేలా అభినందనలు అందుకుంటున్నప్పటికీ ప్రచార ఆర్భాటాలకు దూరంగా “అజ్ఞాతవాసి” గా ఉండటానికి ఇష్టపడే “అతడు” నిజంగా తెలుగు సినిమాకు దొరికిన “అరవింద సమేత వీర రాఘవ” త్రివిక్రముడు”…ఇలా అభిమాన సంఘాల ఒరవడిలో సాగుతుంది ఆ సన్మానపత్రం .

ఇలా సరదాగా రాసినా, సీరియస్ గా ఆలోచించినా త్రివిక్రమ్ శ్రీనివాస్ అంటే నిజంగా ఒక” బ్రాండ్” అన్నది ఎవరూ కాదనలేని వాస్తవం. తెలుగు చిత్ర పరిశ్రమలో ఆయన ఒక ఆహ్లాదకర సంచలనం. స్టోరీ టెల్లింగ్ లో ఒక్కో దర్శకుడిది ఒక్కో స్టయిల్. చలోక్తులతో, సున్నితమైన డైలాగ్ పంచ్ లతో , ఎవరికీ తట్టని రివర్స్ వే ఆఫ్ థింకింగ్ తో తెలుగు సినిమా నఱేటివ్ స్టైల్ ను నెక్స్ట్ లెవెల్ కు తీసుకువెళ్లి సినీ రచనలో సరికొత్త ఒరవడిని సృష్టించిన ట్రెండ్ సెట్టింగ్ రైటర్ కం డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్.

ఈ న్యూవేవ్ క్రియేటర్ దర్శకుడిగా మెగా ఫోన్ పట్టుకుని నేటికి 16 ఏళ్లు పూర్తయ్యాయి. ఈయన దర్శకత్వం వహించిన తొలి చిత్రం” నువ్వే నువ్వే” 2002 అక్టోబర్ 10 న విడుదలైంది. అంటే ఈరోజుతో దర్శకుడిగా పదహారేళ్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో 9 చిత్రాలు వచ్చాయి. రేపు విడుదల కానున్న” అరవింద సమేత వీర రాఘవ” తో 10 చిత్రాల మైలురాయిని చేరుకుంటారు త్రివిక్రమ్ శ్రీనివాస్.

ఈ నేపథ్యంలో ఇప్పటివరకూ విడుదలైన త్రివిక్రమ్ శ్రీనివాస్ 9 చిత్రాలలో “ది బెస్ట్” ఏది అని ఒక పోల్ గేమ్ నిర్వహిస్తూ మీ పార్టిసిపేషన్ ను ఆహ్వానిస్తుంది “ద తెలుగు ఫిలిం నగర్ డాట్ కాం“.

“ద బెస్ట్ ఆఫ్ త్రివిక్రమ్” అనే ఈ పోల్ గేమ్ లో పాల్గొంటే రేపు విడుదల అవుతున్న” అరవింద సమేత వీర రాఘవ” కు ‘ఆల్ ద బెస్ట్’ చెప్పినట్లే…So vote and greet Trivikram Srinivas “The wizard of words “.

పదహారేళ్ల 9 చిత్రాల త్రివిక్రముడి ఆహ్లాదకర విజయ ప్రస్థానం

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here