సినీ సెంటిమెంట్- ఎన్టీఆర్ తో కూడా కంటిన్యూ అయిన త్రివిక్రమ్ సెంటిమెంట్!

Trivikram Continues his Sentiment with Jr NTR Aravindha Sametha,Major Production House Holds a Sentiment When Working with Star Director,Telugu Filmnagar,Tollywood Cinema Latest News,Telugu Film Updates,Latest Telugu Movies 2018,Trivikram Movie Latest News,Tollywood Star Directors Movies Latest News,Trivikram Upcoming Movie Details,Star Director Trivikram Srinivas Latest Updates,Trivikram Sentiment Work With Jr NTR Aravindha Sametha Movie
Trivikram Continues his Sentiment with Jr NTR Aravindha Sametha

సాధారణంగా మనం ఏదైనా పని చేసేప్పుడు కొన్ని విషయాల్లో సెంటి మెంట్లు ఖచ్చితంగా పాటిస్తాం. అదొక అలవాటుగా మారుతుంది. అలాగే సినీ పరిశ్రమలో కూడా ఇలాంటి సెంటి మెంట్స్ ను పాటించే వాళ్లు చాలా మందే ఉంటారు. ప్రతి ఒక్కరికీ ఒక్కో సెంటి మెంట్ ఉంటుంది. ఆ సెంటిమెంట్స్ లో ఒక భాగమే శుక్రవారాల్లో సినిమాలు రిలీజ్ చేయడం. ఉదాహరణకు పవన్ కళ్యాణ్ సినిమాలో అలీ ఖచ్చితంగా ఉండేలా చూసుకుంటాడు..ఇదో రకం సెంటిమెంట్..ఒకప్పుడు మహేష్ బాబు సినిమా టైటిల్స్ మూడు అక్షరాలు మాత్రమే ఉండేవి..అప్పుడు అదో సెంటిమెంట్… గోపిచంద్ కు యజ్ఞం సినిమా నుండి దాదాపు అన్ని సినిమాల చివర్లో జీరో ఉండేలా చూసుకోవడం..ఒక్కో హీరోకి ఒక్కో సెంటిమెంట్.

ఇక డైరెక్టర్స్ విషయానికొస్తే కృష్ణ వంశీ అంటే వెంటనే ఆయన సినిమాల్లో ఎక్కువ జనాలు, బంధాలు బంధుత్వాలతో కళకళలాడుతుంటుంది. పూరీ జగన్నాథ్ సినిమాలో గన్ లు, శ్రీను వైట్ల కామెడీ.. ఇలా ఒక్కొక్కరికీ ఒక్కో సెంటిమెంట్. మరి ఈ నేపథ్యంలో త్రివిక్రమ్ అంటే మనకు వెంటనే ఏం గుర్తొస్తుంది పంచులు, ప్రాసలు. కానీ ఈ మధ్య క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే ఓ ఇంట్రెస్టింగ్ విషయం కనిపిస్తుంది. అది కూడా హారిక అండ్ హాసిని బ్యానర్ పై చేసిన సినిమాల్లో మాత్రం హీరో చేతిలో ఇది ఖచ్చితంగా ఉండి తీరాల్సిందే. ఇంతకీ ఏంటది.. హీరో చేతిలో ఉండేది ఏంటీ అనుకుంటున్నారా..? అదే ట్రావెల్ బ్యాగ్. హారిక అండ్ హాసిని బ్యానర్ పై త్రివిక్రమ్ బన్నీతో సన్ ఆఫ్ సత్యమూర్తి, నితిని తో అఆ, పవన్ కళ్యాణ్ తో అజ్ఞాతవాసి, రీసెంట్ గా ఎన్టీఆర్ తో అరవింద సమేత సినిమాలు తెరకెక్కించాడు.

త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా వారిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సినిమా సన్ ఆఫ్ సత్యమూర్తి. ఈ సినిమాలో అల్లు అర్జున్ ఉపేంద్ర దగ్గరకు వెళ్లేప్పుడు ఈ బ్యాగ్ ఉంటుంది. ఇక అఆ సినిమాలో కూడా నితిన్ హీరోయిన్ సమంతను తన ఇంటికి తీసుకెళ్లేప్పుడు ఇలాంటి బ్యాగ్ తగలించుకొనే ఉంటాడు. అజ్ఞాతవాసి సినిమాలో కూడా అంతే ఏబీ అనే సంస్థను కాపాడటానికి అసోం నుండి వచ్చే క్రమంలో పవన్ కళ్యాణ్ కూడా ఇలాంటి బ్యాక్ పాక్ తో కనిపిస్తాడు. ఇప్పుడు తాజాగా అరవింద సమేత సినిమాలో కూడా ఎన్టీఆర్ ట్రావెల్ బ్యాగ్ తో కనిపిస్తున్నాడు. సిచ్యుయేషన్ ఏంటో..ఎక్కడో తెలియదు కానీ.. ట్రావెల్ బ్యాగ్ మాత్రం ఉంది. మొత్తానికి త్రివిక్రమ్ కు తెలుసో?లేదో? అసలు అంత గమనించాడో లేదో కానీ…ఏదైనా ఇట్టే కనిపెట్టే ప్రేక్షకులు ఉంటారు కదా. అలా త్రివిక్రమ్ సినిమాల్లో నోటీస్ చేసిన విషయం ట్రావెల్ బ్యాగ్. అది కూడా హారికా అండ్ హాసిని బ్యానర్ పై వచ్చిన సినిమాల్లో. what a coincidence కదా.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here