ఎన్టీఆర్ బయోపిక్ – మళ్లీ తెరపైకి అలనాటి హిట్ సాంగ్!

Sr NTR Super Hit Song in Balakrishna NTR Biopic,Balakrishna as NTR in NTR Biopic Movie, Balakrishna Movie Latest News, latest telugu movies 2018, NTR biopic Movie Latest Updates, NTR Biopic Telugu Movie News, NTRs Sensational Rain Song Recreated, NTRs Sensational Rain Song Recreated by Balakrishna, telugu film updates, Telugu Filmnagar, Tollywood Cinema Latest News
Sr NTR Super Hit Song in Balakrishna NTR Biopic

క్రిష్ దర్శకత్వంలో ఎన్టీఆర్ బయోపిక్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ పాత్రలో ఆయన తనయుడు బాలకృష్ణ నటిస్తుండగా.. పలు కీలకమైన పాత్రలో పలువురు స్టార్ హీరోలు, హీరోయిన్స్ నటిస్తున్నారు. ఇక ఇన్ని రోజులు ఒకే పార్ట్ అనుకుంటుండగా… ఆయన బాల్యం నుండి సినీ ప్రస్థానం వరకూ ఒక పార్ట్… రాజకీయ ప్రస్థానం గురించి రెండో పార్ట్ పదిహేను రోజుల గ్యాప్ లో రిలీజ్ ప్లాన్ చేశారు.

ఇక ఇప్పటికే పలువురు సీన్లను తెరకెక్కించిన క్రిష్ త్వరలో ఎన్టీఆర్ సినీ కెరీర్ లోనే..టాప్ సినిమాల్లో ఒకటైన వేటగాడు సినిమాలోని సూపర్ హిట్ సాంగ్ ఆకు చాటు పిందె తడిసే పాటను చీత్రీకరిస్తున్నట్టు తెలుస్తోంది. గత రెండు రోజులుగా శ్రీదేవి పాత్రకు రకుల్ ప్రీత్ సింగ్ ఓకే అయిందని… శ్రీదేవి పాత్రలో తాను నటిస్తున్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రకుల్, బాలయ్య లతో శ్రీదేవి-ఎన్టీఆర్ కాంబో లో వచ్చిన రెయిన్ సాంగ్ ఆకు చాటు పిందె తడిసే పాటను తెరకెక్కించనున్నట్టు తెలుస్తోంది.

కీరవాణి ట్యూన్ చేసిన ఈ రీమిక్స్ పాటకు బాలకృష్ణ, రకుల్‌లు ఎన్టీఆర్, శ్రీదేవి తరహాలో స్టెప్పులు వేయబోతున్నట్టు సమాచారం. ఈ బయోపిక్‌లో ఎన్టీఆర్ నటించిన పాత సినిమా పాటల్లో రీమిక్స్ చేయబోతున్న పాట ఇదొక్కటే. మరి పాత సినిమాల నుండి ఇప్పటికే ఎన్నో పాటలు రిమిక్స్ అయ్యాయి. ఇప్పుడు ఈ బయోపిక్ కోసం ‘ఎన్టీఆర్-కథానాయకుడు’ సినిమాలో ‘ఆకుచాటు పిందే తడిసే’ రీమిక్స్ చేస్తున్నారు.. ఇది ఎలాంటి సంచలనం రేపుతుందో చూడాలి మరి.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here