రాజమౌళి మల్టీస్టారర్-ఎన్టీఆర్, రామ్ చరణ్ ఆ పాత్రల్లో..!

Jr NTR and Ram Charan Characters in SS Rajamouli Multistarrer,Telugu Filmnagar,Tollywood Cinema Latest News,Telugu Film Updates,Latest Telugu Movies 2018,SS Rajamouli Confirms Jr NTR and Ram Charan in His Next Film,Director SS Rajamouli Movie Latest News,SS Rajamouli Upcoming Multistarrer Movie Updates,SS Rajamouli New Multistarrer Movie Updates,SS Rajamouli Next Flim With Multistarrer,SS Rajamouli Upcoming Film With Ram Charan and Jr NTR
Jr NTR and Ram Charan Characters in SS Rajamouli Multistarrer

బాహుబలి సినిమా తరువాత రాజమౌళి భారీ మల్టీ స్టారర్ పై దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోలతో జక్కన్న మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ పనిలో రాజమౌళి బిజీగా ఉండగా.. రామ్ చరణ్ బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాతో.. మరోపక్క ఎన్టీఆర్ అరవింద సమేత సినిమాతో బిజీగా ఉన్నాడు. ఇక రెండు రోజుల్లో అరవింద సమేత సినిమా ప్రేక్షకుల ముందుకు రానుండగా… చెర్రీ సినిమా మాత్రం… వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయనున్నారు.

అయితే ఈ లోపే రాజమౌళి మల్టీ స్టారర్ సినిమా సెట్స్ పైకి వెళ్లనున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్ర షూటింగ్‌ను డిసెంబర్‌లో మొదలుపెట్టి చకాచకా తెరకెక్కించాలని జక్కన్న భావిస్తున్నారు. దీనిలో భాగంగానే… ప్రస్తుతం ఎన్టీఆర్, రామ్ చరణ్ స్పెషల్ వర్క్ షాప్ లో పాల్గొననున్నట్టు తెలుస్తోంది. వారితో పాటు రాజమౌళి మరియు సాంకేతిక బృందం అంతా ఈ వర్క్ షాప్ లో పాల్గొనబోతున్నట్టు.. సినిమా షూటింగ్ ప్రారంభమయ్యే ముందు నవంబర్ మధ్యలో ఈ వర్క్ షాప్ స్టార్ట్ అవ్వబోతన్నట్టు తెలుస్తోంది. మరో ఆసక్తికరమైన విషయం ఏటంటే.. ఈ సినిమా బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతుందని… ఈ చిత్రంలో చెర్రీ, ఎన్టీఆర్‌లు సోదరులుగా కనిపించనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈవార్తల్లో ఎంత నిజముందో తెలియాలంటే.. దీనిపై రాజమౌళి క్లారిటీ ఇచ్చేంతవరకూ ఆగాల్సిందే.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here