సోషల్ మీడియా కింగ్ బన్నీ, క్వీన్ స్నేహారెడ్డి- ఆమె తరవాత స్నేహరెడ్డినే

Allu Arjun and Sneha Reddy The King and Queen of Social Media,Telugu Filmnagar,Tollywood Cinema Latest News,Telugu film Updates,Latest Telugu Movies 2018,Sneha Reddy the Queen of Social Media,Allu Arjun Latest News,Stylish Star Actor Wife Crowned Queen of Social Media,#AlluArjun,Stylish Star Allu Arjun is the King of Social Media
Allu Arjun and Sneha Reddy The King and Queen of Social Media

సినిమా హీరోలకు కానీ… హీరోయిన్స్ కానీ సాధారణంగా సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే తీరిక ఉండదనే చెప్పొచ్చు. రోజూ షూటింగ్ లు, జర్నీలూ, జిమ్ లు, ఫిట్ నెస్ లు వీటితోనే సరిపోతుంటుంది. కానీ వాళ్ల సినిమాలకు సంబంధించిన అప్ డేట్ లు ఇస్తూ… అభిమానులకు మాత్రం ఎప్పుడూ దగ్గరగా ఉంటారు. అయితే వాళ్లలో కూడా ఎప్పుడూ యాక్టింగ్ ఉంటూ.. సోషల్ మీడియా కింగ్ అనిపించుకున్నాడు ఓ హీరో.

ఇంతకీ ఆ హీరో ఎవరనుకుంటున్నారా…? ఆ యంగ్ హీరో ఎవరో కాదు…స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. తన నటనతో.. తన స్టైయిల్ తో అల్లు అర్జున్ చాలా మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. కేవలం ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. పక్క రాష్ట్రాల్లో కూడా బన్నీ కి మంచి ఫాలోయింగ్ ఉంది. అంతేకాదు కేరళలో మల్లు అర్జున్ అనే ఫ్యాన్ గ్రూప్ తో అల్లు అర్జున్ ఫ్యాన్స్ గ్రూప్ కూడా ఉంది. దీంతో అల్లు అర్జున్ కు సంబంధించి ఓ వార్త వచ్చిన వెంటనే అలా సోషల్ మీడియాలో వెంటనే వైరల్ అయిపోతది. ట్రెండింగ్ లో టాప్ లో ఉంటుంది. దానికి కారణం బన్నీకి ఉన్న ఫాలోవర్సే. దాంతో బన్నీ ని సోషల్ మీడియా కింగ్ అని పిలుచుకుంటారు బన్నీ ఫ్యాన్స్.

ఇదిలా ఉండగా…ఇప్పటికే సోషల్ మీడియాలో కింగ్ గా అల్లు అర్జున్ ను పిలుచుకుంటుంటే..ఆయన భార్య.. బెటర్ హాఫ్ స్నేహా రెడ్డి ని క్వీన్ ఆఫ్ సోషల్ మీడియా అని పిలుచుకుంటున్నారు. హోమ్ మేకర్ మరియు ఎంటర్ ప్రెన్యుయర్ అయిన స్నేహా రెడ్డి సోషల్ మీడియాలో యాక్టింగ్ గా ఉంటారు. అల్లు అర్జున్ గురించి, పొలిటీషియన్ అయిన నాన్న గురించి.. తన ఫ్యామిలీ గురించి.. తన పిల్లలి గురించి ఎప్పటికప్పుడు అప్ డేట్ ఇస్తూ.. ఫొటోస్ షేర్ చేస్తూ యాక్టివ్ గా ఉంటారు. దీంతో ఆమెను ఫాలో అయ్యేవాళ్లు చాలా మంది ఉన్నారు. అంతేకాదు త్వరలో ఆమె 1 మిలియన్ ఫాలోవర్స్ ను చేరుకోనున్నారు. దీంతో ఆమెను సోషల్ మీడియా క్విన్ గా పిలుచుకుంటున్నారు. ఇప్పటివరకూ షాహిద్ కపూర్ భార్య మీరా రాజ్ పుత్ కపూర్ కు మాత్రమే 1మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. ఇప్పుటు స్నేహా రెడ్డి ఆ లిస్ట్ లో చేరారు.

ఇంకేముంది తమ హీరో సోషల్ మీడియా కింగ్ అయితే.. ఆయన భార్య సోషల్ మీడియా క్విన్ గా లిస్ట్ లో చేరినందుకు ఫ్యాన్స్ హ్యాపీగా ఫీలవుతున్నారు. మరి నిజంగానే…ఇంత మంది సెలబ్రిటీలు.. స్టార్స్, హీరోయిన్స్ గా ఉండగా…స్నేహరెడ్డికి అంత మంది ఫాలోవర్స్ ఉండటం…ఆమె నచ్చి ఆమె ను అంతమంది ఫాలో అవ్వడం నిజంగా గ్రేట్ థింగే..

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here