17 సంవత్సరాల్లో 16 సినిమాల విజయ వినయ వినాయక్

17 Glorious Years of Dynamic Director VV Vinayak, Director VV Vinayak Movie Latest Updates, Director VV Vinayak Next Movie Details, Director VV Vinayak Upcoming Movies, Latest Telugu Movies 2018, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema Latest News, VV Vinayak Latest News, VV Vinayak New Film Updates
17 Glorious Years of Dynamic Director VV Vinayak

గండ్రోతు వీర వెంకట వినాయక్ అంటే ఎవరికి తట్టకపోవచ్చు…. పట్టకపోవచ్చు. కానీ “వివి వినాయక్“అనగానే తట్టిలేపినట్లుగా టక్కున గుర్తుకొస్తారు సంచలన విజయాల అగ్రశ్రేణి దర్శకుడు వివి వినాయక్. కేవలం వృత్తిపరమైన విజయాలు మాత్రమే వ్యక్తులకు విశిష్ట స్థానాన్ని, గౌరవాన్ని ఇస్తాయి అనుకుంటే పొరపాటు. ఆ విజయాలతో పాటు వినయాన్ని, విజ్ఞతను సంతరించుకున్న వ్యక్తులకు మాత్రమే విజయం శాశ్వతమౌతుంది. మధ్యలో ఒకటీ అరా అపజయాలు ఎదురైనప్పటికీ అతని మంచితనం, మర్యాద, వినయం, విజ్ఞతలే అతనికి బాసటగా నిలుస్తాయి. అలాంటి సత్ లక్షణాలతోపాటు ఎన్నెన్నో ఘన విజయాల పటిష్టమైన కెరీర్ ను సొంతం చేసుకున్న వివి వినాయక్ జన్మదినం ఈరోజు.

1974 అక్టోబర్ 9న వెస్ట్ గోదావరి జిల్లా చాగల్లు గ్రామంలో జన్మించిన వి.వి.వినాయక్ 2002లో నందమూరి యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా బెల్లంకొండ సురేష్, నాగలక్ష్మి లు నిర్మించిన “ ఆది” చిత్రంతో దర్శకుడిగా కెరీర్ ప్రారంభించారు.
తొలి చిత్రమే ఘన విజయాన్ని సాధించడంతో అతి తక్కువ కాలంలోనే అగ్రశ్రేణి దర్శకుడిగా ఎదిగారు వినాయక్.
ఆది తరువాత నందమూరి బాలకృష్ణ హీరోగా చెన్నకేశవరెడ్డి, నితిన్ హీరోగా దిల్, మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఠాగూర్, ఎన్టీఆర్ హీరోగా సాంబ, అల్లు అర్జున్ హీరోగా బన్నీ, విక్టరీ వెంకటేష్ హీరో గా లక్ష్మి, యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా యోగి, రవితేజ హీరోగా కృష్ణ, ఎన్టీఆర్ హీరోగా అదుర్స్, అల్లు అర్జున్ హీరోగా బద్రీనాథ్, రామ్ చరణ్ హీరోగా నాయక్, బెల్లంకొండ శీను హీరోగా అల్లుడు శీను, అక్కినేని అఖిల్ హీరోగా అఖిల్ , మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఖైదీ నెంబర్ 150, సాయిధరమ్ తేజ్ హీరోగా ఇంటలిజెంట్ చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఈ 16 చిత్రాలలో 80 శాతం పైగా చిత్రాలు ఘన విజయాన్ని సాధించాయి. ఒక దర్శకుడిగా వృత్తిపరమైన విజయాలను సాధించటంతో పాటు వ్యక్తిగా కూడా అందరి మన్ననలు అందుకున్న విజయ వినయ సంపన్నుడు వివి వినాయక్.

కాగా ఈ రోజు వివి వినాయక్ జన్మదిన సందర్భంగా ఆయన దర్శకత్వం వహించిన 16 చిత్రాలనుండి “the Top Ten of VV Vinaayak ” నుండి The Best of VV Vinayak ను ఎంపిక చేసే నిమిత్తం ఒక పోల్ గేమ్ నిర్వహిస్తూ మిమ్మల్ని ఆహ్వానిస్తోంది “ద తెలుగు ఫిలిం నగర్ డాట్ కాం” .Your voting is Your Greeting VV Vinayak…so… participate and make the poll game a big success.Thank You All.

 

వినాయక్ బెస్ట్ టెన్ లో బెస్ట్ ఏది?

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here