సకల కళా వల్లభుడు టీజర్ రిలీజ్

SakalaKala Vallabhudu Movie Teaser Out Now,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2018,Tollywood Cinema Updates,#SakalaKalaVallabhuduTeaser,SakalaKala Vallabhudu Movie Updates,SakalaKala Vallabhudu Telugu Movie Latest News,SakalaKala Vallabhudu Telugu Movie Teaser,SakalaKala Vallabhudu Official Teaser
SakalaKala Vallabhudu Movie Teaser Out Now

శివగణేష్ దర్శకత్వంలో తనిష్క్ రెడ్డి హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘సకల కళా వల్లభుడు’. కామెడీ జోనర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా ట్రైలర్ ఈ రోజు విడుదల చేశారు. కమెడియన్ 30ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ రాజ్ చేతుల మీదుగా ‘సకల కళా వల్లభుడు’ టీజర్ విడుదల చేశారు చిత్ర యూనిట్. ఈ సందర్భంగా పృథ్వీ మాట్లాడుతూ.. ‘‘యూత్‌కు కనెక్ట్ అయ్యే చిత్రం ఈ సకల కళా వల్లభుడు. తనిష్క్ మంచి నటుడే కాదు చాలా కళలు ఉన్నాయతనికి.. అది మీకు సినిమా చూస్తే తెలుస్తుంది. అతని లుక్ చూస్తే స్టేట్‌రౌడీలో చిరు గారి లుక్ కనిపిస్తుంది. ఇక నేను ఈ సినిమాలో బాబా పాత్రను పోషించాను. ఎక్కువగా ఎంటర్టైన్ చేస్తుంది నా పాత్ర. అందరికీ నచ్చే చిత్రం అవుతుంది..’’ అని అన్నారు.

డైరెక్టర్ శివగణేష్ మాట్లాడుతూ.. ‘‘యాక్షన్ కామెడీ జోనర్. నిర్మాతలు నా ఫ్రెండ్స్ కనుక చాలా సపోర్టివ్ గా నిలిచారు. వారి సహకారంతోనే సినిమా పూర్తి చేయగలిగాను. ఇక ఆర్టిస్టుల విషయానికి వస్తే… పృథ్వీ గారి కామెడీ హైలెట్ అవుతుంది. హీరో తనిష్క్ బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చారు. అక్టోబర్- నవంబర్ మధ్యలో సినిమా రిలీజ్ ఉంటుంది’’ అని చెప్పారు.

కాగా ఈసినిమలో తనిష్క్ రెడ్డి, మేఘల గుప్తా, జీవ, పృథ్వీ, సుమన్, చిన్నా, శృతి, అపూర్వ తదితరులు నటిస్తున్నారు. దీపాల ఆర్ట్స్ సమర్పణలో సింహ ఫిలిమ్స్ పతాకంపై అనిల్, త్రినాథ్, కిషోర్, శ్రీకాంత్ లు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. అజయ్ పట్నాయక్ ఈ సినిమాకు సంగీతం అందించారు.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here