ప్రభాస్ కొత్త సినిమాకు ఇంట్రెస్టింగ్ టైటిల్..!

#Prabhas20, Latest Telugu Movies News, Prabhas New Movie Title, Prabhas Next Film Gets an Interesting Title, Prabhas Upcoming Movie Title, Telugu Film News 2018, Telugu Filmnagar, Tollywood Cinema Updates, Young Rebel Star Prabhas Next Film Title
Prabhas Next Film Gets an Interesting Title

ఒకపక్క సాహోతో బిజీగా ఉంటూనే మరోపక్క ప్రభాస్ కొత్త సినిమాతో కూడా బిజీ అయిపోయాడు. ప్రభాస్ జిల్ ఫేం రాధాకృష్ణ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. పీరియాడిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఈ సినిమా షూటింగ్ కూడా ప్రస్తుతం ఇటలీలో జరుపుకుంటుంది. ప్రభాస్ కూడా ఈ షూటింగ్ లో జాయిన్ అయ్యాడు. అంతేకాదు ఇటీవల ప్రభాస్ కొత్త లుక్ కూడా వైరల్ అయిన సంగతి తెలిసిందే.

ఇదిలా ఉండగా ఇప్పుడు ఈసినిమాపై ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి బయటకొచ్చింది. అదేంటంటే.. ఈ సినిమా టైటిల్ ను అప్పుడే ఫిక్స్ చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అమూర్ అనే టైటిల్ ను ఈ సినిమాకు పెట్టనున్నట్టు తెలుస్తోంది. అమూర్ అంటే ఫ్రెంచ్ లో ప్రేమ అనే అర్ధం వస్తుందట. ఈ టైటిల్ ను చిత్ర యూనిట్ పరిశీలిస్తున్నట్టు సమాచారం. అయితే దీనిపై క్లారిటీ రావాలంటే అధికారిక ప్రకటన వచ్చేంత వరకూ ఆగాల్సిందే.

కాగా రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను గోపీ కృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అమిత్ త్రివేది ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ప్రముఖ ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్ గా, రేసు గుర్రం-ఏ మాయ చేశావే ఫేం మనోజ్ పరమహంస కెమెరా మెన్ గా పనిచేస్తున్నారు. మూడు భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాను వచ్చే ఏడాది ద్వితియార్థంలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here