అరవింద సమేత థీమ్ గురించి చెప్పేసిన ఎన్టీఆర్..!

Jr NTR Reveals Aravindha Sametha Movie Theme, #AravindhaSametha, Aravindha Sametha Movie Story Revealed, Aravindha Sametha Movie Updates, Aravindha Sametha Telugu Movie Concept Revealed, Aravindha Sametha Telugu Movie Latest News, Aravindha Sametha Telugu Movie Theme Revealed, Aravindha Sametha Theme Revealed, Aravindha Sametha Veera Raghava Theme Revealed, Jr NTR Aravindha Sametha Movie Theme Revealed, latest telugu movies news, Telugu Film News 2018, Telugu Filmnagar, Tollywood Cinema Updates
Jr NTR Reveals Aravindha Sametha Movie Theme

త్రివిక్రమ్ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన అరవింద సమేత సినిమా కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయింది. మరో మూడు రోజుల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. క్షణం కూడా తీరక లేకుండా షూటింగ్ జరుపుకున్న ఈసినిమాపై భారీ అంచనాలు ఆది నుండే మొదలయ్యాయి. తన తండ్రి చనిపోయినా కూడా ఏ మాత్రం గ్యాప్ తీసుకోకుండా చాలా డెెడికేషన్ తో సినిమా షూటింగ్ లో పాల్గొన్నాడు తారక్. నిజానికి ఈ సినిమా అనుకున్న టైమ్ కి రిలీజ్ అవుతుందంటే ఓ రకంగా తాను కూడా కారణమని చెప్పొచ్చు.

ఇక సినిమా రిలీజ్ కు కొద్ది రోజులు మాత్రమే ఉండగా..త్రివిక్రమ్, ఎన్టీఆర్ ఇంటర్వ్యూలతో ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. ఓ పక్క ఇంటర్వ్యూలు ఇస్తూనే మరోపక్క మిగిలిన పనులు చూసుకుంటున్నారు త్రివిక్రమ్. ఇంటర్వ్యూల్లో సినిమా గురించి పలు విషయాల ఇప్పటికే చెప్పిన ఎన్టీఆర్ ఇప్పుడు తాజాగా విడుదలైన ఓ పోస్టర్ ను చూస్తుంటే ఈ సినిమా అసలు థీమ్ ఏంటో అర్ధమైపోతుంది. ఇంతకీ ఆపోస్టర్ లో ఏముందంటే.. అరవింద సమేత కథ టైటిల్ చుట్టూ తిరుగుతుంది…మహిళా సాధికరతను చెబుతుంది.. ఈ కథలో హింస ఉంటుంది..హింసను ఆపే అంశం.. సమాజంలో మహిళల ప్రాధాన్యత అనే అంశాలతో అరవింద సమేత కథ సాగుతుంటుంది.. సినిమాలో హింస ముఖ్యం కాదు…యుద్దం చేసే సత్తా లేని వాడికి శాంతి గురించి మాట్లాడే అర్హత లేదు..చేదు అనుభవం చవిచూడని వాడికి దాని గురించి మాట్లాడే అర్హత లేదు అని ఉంది. దీన్ని బట్టి కథ ఏ అంశం చుట్టూ తిరుగుతుంటుంది..అసలు థీమ్ ఏంటన్న విషయం అర్థమైపోయింది. మరి సినిమా మొత్తం ఎలా ఉంటుందో తెలియాలంటే ఇంకో మూడు రోజులు ఆగాల్సిందే.

కాగా త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. ఇంకా ఈషా రెబ్బా, నాగబాబు, జగపతి బాబు మరియు సునీల్ నటిస్తున్నారు. హారిక & హాసిని బ్యానర్ పై రూపొందిన ఈ సినిమాకు థమన్ ఎస్ సంగీతం అందించారు.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here