అరవింద సమేత సినిమా- 4 ఆటలు కాదు

Jr NTR Aravindha Sametha Gets a Bumper Offer,Telugu Filmnagar,Tollywood Cinema Latest News,Telugu film Updates,Latest Telugu Movies 2018,Aravindha Sametha Movie Updates,Aravindha Sametha Telugu Movie Latest News,Special Shows Permissions Granted for Aravindha Sametha Movie,Special Shows Permissions for Aravindha Sametha In AP,Special Shows Permissions for Jr NTR Aravindha Sametha Movie In Andhra Pradesh
Jr NTR Aravindha Sametha Gets a Bumper Offer

త్రివిక్రమ్ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన అరవింద సమేత సినిమా మరో మూడు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. దసరా పండుగ కానుకగా ఈ సినిమాను ప్రేక్షకులకు అందిచనున్నారు చిత్ర యూనిట్. ఈ సినిమా రిలీజ్ కూడా దగ్గర పడుతుండటంతో త్రివిక్రమ్, ఎన్టీఆర్ ఇంటర్వ్యూలతో ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. ఇక ఫస్ట్ లుక్ దగ్గర నుండి, ట్రైలర్ వరకూ మంచి రెస్పాన్స్ రావడం… దానికి తోడు త్రివిక్రమ్ లాంటి స్టార్ డైరెక్టర్, ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరో కాంబో లో వస్తున్న తొలి చిత్రం కావడం సినిమాపై భారీ అంచనాలు ఏర్పడేలా చేశాయి.

ఇదిలా ఉండగా ఇప్పుడు దసరా పండుగ సందర్భంగా అభిమానులకు ఓ బంపరాఫర్ వచ్చింది. సాధారణంగా ఓ మూవీ కి ఉదయం 11 గంటల నుండి నైట్ వరకూ నాలుగు షో లు ఉంటాయి. కానీ అరవింద సమేతకు రోజుకు 6షోస్ వేయడానికి ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దసరా పండుగ కావడం… వారం రోజులు సెలవులు..అందులో పెద్ద సినిమా ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని చిత్రయూనిట్ ఏపీ ప్రభుత్వాన్ని అనుమతి కోరగా.. ఏపీ ప్రభుత్వం కూడా దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఉదయం 5 గంటల నుండి 11 గంటల వరకూ మరో రెండు షోలు యాడ్ చేసింది. అయితే ఈ అవకాశం వారం రోజుల పాటు అంటే 11-10-2018 నుండి 18-10-2018 వరకూ ఇచ్చింది. అంతేకాదు దీనివల్ల టికెట్స్ కోసం గందరగోళం, కొట్లాటలు కూడా తగ్గే అవకాశం ఉందని… ఏపీ ప్రభుత్వం ఈ ప్రతిపాదనకు ఒప్పుకున్నట్టు తెలుస్తోంది.

కాగా త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. ఇంకా ఈషా రెబ్బా, నాగబాబు, జగపతి బాబు మరియు సునీల్ నటిస్తున్నారు. హారిక & హాసిని బ్యానర్ పై రూపొందిన ఈ సినిమాకు థమన్ ఎస్ సంగీతం అందించాడు.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here