అరవింద సమేత వీర రాఘవ సెన్సార్ టాక్ సూపర్

First Ever Censor Talk Report of Aravindha Sametha,Telugu Filmnagar,Tollywood Cinema Latest News,Telugu film Updates,Latest Telugu Movies 2018,Aravindha Sametha Telugu Movie Censor Talk Report,Aravindha Sametha Movie Censor Report,Aravindha Sametha Censor Review
First ever Censor talk Report of Aravindha Sametha

నందమూరి యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ల తొలి కాంబినేషన్లో రూపొందిన “అరవింద సమేత వీర రాఘవ” సెన్సార్ కార్యక్రమాలు ఈరోజు(8th అక్టోబర్) పూర్తయ్యాయి.
“సినిమా సూపర్ గా ఉందని అటు ఎన్టీఆర్ మాస్ ఇమేజ్ – ఇటు దర్శకుడు త్రివిక్రమ్ క్లాస్ టచ్ రెండూ బ్యాలెన్స్ అయ్యాయని టాక్. సినిమా త్రూ అవుట్ ఒక అద్భుతమైన టెంపోతో నడుస్తుందని, పాటలు, ఫైట్స్ ఒక రేంజ్ లో ఉన్నాయని సెన్సార్ సభ్యులు అభినందించినట్లుగా టాక్ వచ్చింది.

ఇక ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ పతాక స్థాయిలో ఉందట. సినిమా మొత్తం మీద ఒకే ఒక సందర్భంలో ఒక చిన్న నవ్వు తప్ప త్రూ అవుట్ ద ఫిలిం ఎన్టీఆర్ క్యారెక్టర్ సీరియస్ గానే ఉంటుందట. కొన్ని సందర్భాల్లో ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ కళ్ళలో నీళ్లు తెప్పిచేంత గొప్పగా ఉందట. మిగతా క్యారెక్టర్స్ అన్ని చక్కగా కుదిరాయట. ఎన్టీఆర్ తండ్రిగా నాగబాబు నటన ఒక స్పెషల్ హైలైట్ అంటున్నారు. మొత్తం మీద “అరవింద సమేత వీర రాఘవ” సెన్సార్ రిపోర్ట్ చాలా పాజిటివ్ గా వచ్చింది.
ఇది ఎన్టీఆర్ అభిమానులకు నిజమైన శుభవార్త. అక్టోబర్ 11న విడుదలకు సర్వ సన్నద్ధమైన అరవింద సమేత వీర రాఘవ పర్టిక్యులర్ గాఎన్టీఆర్ అభిమానులనే కాకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే ఫీల్ గుడ్ యాక్షన్ ఎంటర్టైనర్ అవుతుందన్న అంచనాలను సెన్సార్ రిపోర్ట్ సూచిస్తుంది. ఆల్ ద బెస్ట్ టు” అరవింద సమేత వీర రాఘవ” యూనిట్

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here