రామ్ చరణ్ చిత్రానికి ఈ మూడింటిలో బెస్ట్ టైటిల్ ఏది?

#RC12 Movie Latest News, #RC12 Movie Updates, 3 Title Options for Ram Charan New Film, Latest Telugu Movies News, Ram Charan New Movie Title as Vinaya Vidheya Rama, Ram Charan New Project gets a Befitting Title, Ram Charan Next Film Title Announced, Ram Charan Next Movie Title, Ram Charan RC12 titled as Vinaya Vidheya Rama, Telugu Film News 2018, Telugu Filmnagar, Tollywood Cinema Updates
3 Title Options for Ram Charan New Film

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా సంచలన దర్శకుడు బోయపాటి శీను దర్శకత్వంలో నిర్మితమవుతున్న ” హై ఎక్స్పెక్టెడ్ అండ్ హై బడ్జెట్” మూవీకి టైటిల్ ఖరారు చేశారా లేదా…? చేస్తే ఆ టైటిల్ ఏమిటి? దర్శక నిర్మాతల నుండి ఆ పరంగా ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోయినప్పటికీ సోషల్ మీడియా ఇప్పటికే 3 టైటిల్స్ ప్రకటించేసింది.
ఒకప్పటి మెగాస్టార్ చిరంజీవి సెన్సేషనల్ హిట్ “స్టేట్ రౌడీ ” టైటిల్ ను ఖరారు చేసినట్లుగా సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. అందరూ దాదాపుగా అదే ఖాయం చేస్తారని అనుకున్నారు.

అయితే ఈరోజు మరో రెండు టైటిల్స్ వెలుగులోకి వచ్చాయి. అవి “వినయ విధేయ రామ” -“రౌడీ తమ్ముడు”. ఇందులో హీరో కు ముగ్గురు అన్నయ్యలు ఉంటారుట. ఆ ముగ్గురి యోగ క్షేమాల కోసం తపనపడే తమ్ముడు పాత్రను ఇందులో రామ్ చరణ్ పోషిస్తున్నారు. ఇప్పటివరకు “RC12” అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా షూటింగ్ కార్యక్రమాలు జరిగిపోతున్నాయి. ఇక ఇప్పుడు టైటిల్ అనౌన్స్మెంట్ చేయవలసిన సమయం దగ్గరపడుతోంది. రానున్న దసరాకు టైటిల్ ఎనౌన్స్ చేస్తే రిలీజ్ టైంకు బాగా జనానికి రీచ్ అవుతుంది.

అందుకే కాబోలు చిత్ర నిర్మాత డివివి దానయ్య ముందుగా “వినయ విధేయత రామ” అనే టైటిల్ ను ఫిలిం చాంబర్ లో రిజిస్టర్ చేయించారని తెలిసింది. ఈ నేపథ్యంలో రామ్ చరణ్ చిత్రానికి ఈ మూడింటిలో ఏ టైటిల్ బాగుంటుందో సూచించే బాధ్యతను మీ ముందు ఉంచుతుంది “ద తెలుగు ఫిలిం నగర్ డాట్ కాం”. ఈ మూడు టైటిల్స్ మీద మేము నిర్వహిస్తున్న “ద బెస్ట్ ఆఫ్ ద త్రీ” ఆనే పోల్ గేమ్ లో పాల్గొని మీ విలువైన ఓటు ద్వారా రామ్ చరణ్ పన్నెండవ చిత్రానికి ‘ద బెస్ట్ టైటిల్’ ను సూచించండి.

థాంక్యూ ఆల్ ఫర్ పార్టిసిపేటింగ్….

 

రామ్ చరణ్ చిత్రానికి ఈ మూడింటిలో బెస్ట్ టైటిల్ ఏది?

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here