రామ్ చరణ్ సినిమా టైటిల్ ఇదే..!

Ram Charan Next Movie Title,Ram Charan New Project gets a Befitting Title,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2018,Tollywood Cinema Updates,RC12 Movie Updates,#RC12 Movie Latest News,Ram Charan Next Film Title Announced,Ram Charan RC12 titled as Vinaya Vidheya Rama,Ram Charan New Movie Title as Vinaya Vidheya Rama
Ram Charan Next Movie Title

మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే అజర్ బై జాన్ లో జరుపుకుంది. దాదాపు సినిమా మేజర్ పార్ట్ వరకూ షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇక ఈ సినిమా ఫస్ట్ లుక్ కూడా ఇప్పటి వరకూ విడుదల చేయలేదు చిత్ర టీమ్. ఆగ‌స్ట్ 22న చిరంజీవి పుట్టిన‌రోజు నాడు ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేస్తార‌న్నారు. కానీ విడుదల చేయలేదు. ఆ తరువాత సెప్టెంబ‌ర్ 2 పవన్ కళ్యాణ్ పుట్టినరోజున అన్నారు కానీ అప్పుడు కూడా కుద‌ర్లేదు.

ఇక టైటిల్ కూడా ఇప్పటి వరకూ ప్రకటించలేదు. కానీ కొద్ది రోజుల క్రితం చిరంజీవి సినిమా టైటిల్లో ఒకటైన స్టేట్ రౌడీ సినిమాను పెట్టే యోచనలో ఉన్నారని వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఆ వార్తలకు బ్రేక్ పడినట్టే తెలుస్తోంది. ఈ సినిమాకు ‘వినయ విధేయ రామ’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారట. అంతేకాదు నిర్మాత డీవీవీ దానయ్య ఈ టైటిల్‌ను ఫిలిం ఛాంబర్‌లో రిజిస్టర్‌ చేయించినట్టుగా తెలుస్తుంది. అయితే అధికారిక ప్రకటన వచ్చేంతవరకూ ఆగాల్సిందే. మరోవైపు దసరా సందర్భంగా ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను రిలీజ్‌ చేసే అవకాశం ఉందన్న టాక్స్ కూడా వినిపిస్తున్నాయి. అదే రోజు టైటిల్‌ విషయంలో కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్టు సమాచారం.

ఇదిలా ఉండగా అజార్ బైజాన్ షెడ్యూల్ ముగియ‌డంతో త‌ర్వాతి షెడ్యూల్ హైద‌రాబాద్‌లో జ‌ర‌గ‌నుంది. యూర‌ప్ షెడ్యూల్‌తో షూటింగ్ దాదాపు 70 శాతం పూర్త‌యింది. సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here