ట్రెండ్ సెట్టర్ మూవీ శివ

Shiva a Trendsetter in Tollywood,Telugu Filmnagar,Tollywood Cinema Latest News,Telugu film Updates,Latest Telugu Movies 2018,Trendsetter Movies in Telugu,Siva Movie a Trendsetter in Tollywood,Nagarjuna Movie Shiva Trendsetter in Tollywood,Shiva a Trendsetter Movie,Shiva Telugu Movie Latest News,Akkineni Nagarjuna the Real Trendsetter in Tollywood
Shiva a Trendsetter in Tollywood

కింగ్ నాగార్జున హీరోగా, రామ్ గోపాల్ వర్మ ను డైరెక్టర్ గా పరిచయం చేస్తూ అన్నపూర్ణ స్టూడియోస్ రూపొందించిన శివ సినిమా 1989 సంవత్సరం అక్టోబర్ 5వ తేదీ రిలీజయి సెన్సేషనల్ హిట్ గా నిలిచింది. విజయవాడ సిద్ధార్ధ్ ఇంజనీరింగ్ కాలేజీ లో జరిగిన సంఘటనలు ఆధారంగా, కాలేజీ స్టూడెంట్ గ్యాంగ్ స్టర్ ఎలా మారాడనే నేపధ్యం లో శివ సినిమాను రామ్ గోపాల్ వర్మ రూపొందించారు. శివ సినిమా 5సెంటర్స్ లో 175 డేస్ ప్రదర్శించబడింది. శివ సినిమాకు రామ్ గోపాల్ వర్మ బెస్ట్ డైరెక్టర్,బెస్ట్ ఫస్ట్ ఫిల్మ్ డైరెక్టర్ గా నంది అవార్డ్స్ అందుకున్నారు.

ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఇళయ రాజా స్వరకల్పనలో “బోటనీ క్లాసు ఉంది” సాంగ్ ఎవర్ గ్రీన్ హిట్ సాంగ్. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కింగ్ నాగార్జున ను హిందీలో పరిచయం చేస్తూ శివ సినిమాను అదే పేరుతో రీమేక్ చేయగా ఘనవిజయం సాధించింది. శివ సినిమా తమిళ్ డబ్బింగ్ వెర్షన్ ఉదయం సినిమా విజయం సాధించింది. శివ సినిమా తరువాత రామ్ గోపాల్ వర్మ హిందీ లో నిర్మాత దర్శకుడిగా అనేక సూపర్ హిట్ సినిమాలను ప్రేక్షకులకు అందించారు. శివ సినిమా 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఎక్స్ ప్లోరింగ్ శివ పేరుతో డాక్యుమెంటరీ రిలీజయింది. ఒక తెలుగు సినిమా పై రూపొందిన ఫస్ట్ డాక్యుమెంటరీ గా శివ రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ రోజుతో శివ సినిమా 29 సంవత్సరాలు పూర్తి చేసుకుంది.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here