సైరా సిబ్బంది కోసం రాం చరణ్ ఏం చేశాడో తెలుసా..?

Ram Charan Kind Gesture Towards Sye Raa Team,Ram Charan Generosity Knows no Bounds,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2018,Tollywood Movie Updates,Sye Raa Movie Updates,Sye Raa Telugu Movie Latest News,Ram Charan Noble Gesture For Sye Raa Team,Ram Charan Latest Updates,Ram Charan Latest News for Sye Raa Team
Ram Charan Kind Gesture Towards Sye Raa Team

ప్రస్తుతం రామ్ చరణ్ బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే అజర్ బైజాన్ లో జరుపుకుంది. అక్కడ ఈ సినిమాలో ప్రతి నాయకుడి పాత్రలో నటిస్తున్న వివేక్ ఒబెరాయ్ కు, రామ్ చరణ్ కు మధ్య భారీ యాక్షన్ సన్నివేశాలు చీత్రీకరించారు. ఇక అక్కడ షూటింగ్ ముగిసిన వెంటనే రామ్ చరణ్ తాను నిర్మాతగా వ్యవహరిస్తున్న సైరా షూటింగ్ లో పాల్గొన్నారు.

రామ్ చరణ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా సైరా సినిమాను తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జార్జియాలో జరుపుకుంటుండగా… రామ్ చరణ్ కూడా అక్కడికి వెళ్లారు. సైరా సినిమాలో కీలకమైన యుద్ద సన్నివేశాన్ని అక్కడ చిత్రీకరిస్తున్నారు చిత్రయూనిట్. కేవలం ఈ సీన్ కోసం..సెట్ కోసం దాదాపు 54 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నట్టు ఇప్పటికే వార్తలు వచ్చాయి. దీంతో రామ్ చరణ్ ఏ విషయంలోనూ కాంప్రమైజ్ అవ్వడంలేదని తెలుస్తోంది.

ఇదిలా ఉండగా…ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి బయటకొచ్చింది. సైరా షూటింగ్ కోసం ఇక్కడి నుండి దాదాపు 150 మందికి పైగా సిబ్బంది అక్కడికి వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే ఈ సిబ్బందికి రామ్ చరణ్ ఓ బంపరాఫర్ ఇచ్చినట్టు తెలుస్తోంది. సైరా చిత్రానికి పనిచేస్తున్న సిబ్బంది అందరికి రామ్ చరణ్ షాపింగ్ కోసం కొంత మొత్తం వెచ్చించినట్లు తెలుస్తోంది. సైరా షూటింగ్ కోసం అక్కడికి వెళ్లిన సిబ్బంది తీరిక లేకుండా గడుపుతుండటంతో వారి కోసం ఏదైనా చేయాలని భావించిన రామ్ చరణ్ తన అసిస్టెంట్స్ ని పంపి సైరా సిబ్బంది చేత జార్జియాలో షాపింగ్ చేయించాడట. దీంతో సిబ్బంది రామ్ చరణ్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. అంతేకాదు..సెట్ లో ఏదైనా పొరపాటు జరిగినా కూడా కోప్పడకుండా.. అందరితో ప్రేమగా ఉంటున్నారని ప్రశంసిస్తున్నారు. మొత్తానికి మిస్టర్ కూల్ గా మారిపోయిన రామ్ చరణ్ మరోసారి తన వ్యక్తిత్వాన్ని నిరూపించాడు.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here