దేవదాస్ తో ఫ్యాన్స్ హ్యాపీగా ఉన్నారు…. వాళ్లు హ్యాపీగా ఉంటే నేను హ్యాపీ :కింగ్ నాగర్జున

Nagarjuna Talks About Devadas Result,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2018,Tollywood Movie Updates,Devadas Movie Latest UPdates,Nagarjuna Movies Latest News,Hero Nagarjuna About Devadas Movie,Devadas Movie Press Meet Updates,Devadas Movie Result Talks About Nagarjuna
Nagarjuna Talks About Devadas Result

చారిత్రక విజయాల వైజయంతి మూవీస్ సంస్థ తాజాగా నిర్మించిన “దేవదాస్ ” చిత్రం మంచి కలెక్షన్స్ తో దూసుకుపోతున్న నేపథ్యంలో హీరో నాగార్జున, నిర్మాత అశ్వినీదత్, దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య మీడియాతో ఇంటరాక్ట్ అయ్యారు.

ఆ విశేషాలు:

ముందుగా నిర్మాత అశ్వినీదత్ మాట్లాడుతూ “నా బ్యానర్లో అత్యధిక చిత్రాలు చేసిన స్టార్ నాగార్జున. తెలుగు చిత్ర పరిశ్రమకు రెండు కళ్లు లాంటివాళ్ళు అయిన రామారావు గారు, నాగేశ్వర రావు గారు 14 సినిమాల్లో కలిసి నటించి మల్టీస్టారర్ సినిమాలకు గొప్ప ఆదర్శంగా నిలిచారు. నాగార్జున గారు కూడా మల్టీ స్టారర్ చెయ్యటానికి ఏమాత్రం వెనుకాడరు. అందుకే ఇప్పుడు దేవదాస్ అనే మల్టీ స్టారర్ తీయగలిగాను. ఈ చిత్రాన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు, ఈ విజయంలో భాగస్వాములైన మీడియాకు, ప్రత్యేకించి కర్ణాటక ప్రేక్షకులకు థాంక్స్. కర్ణాటకలో ఏడు రోజులకు గాను రెండు కోట్ల 37 లక్షల షేర్ రావటం చాలా ఆనందంగా ఉంది ” అన్నారు.

దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య మాట్లాడుతూ” నా మీద నమ్మకం ఉంచి ఇంత పెద్ద సినిమా చేసే అవకాశం నాకు ఇచ్చిన అశ్వినీ దత్ గారికి, నాగార్జున గారికి, నాని గారికి థాంక్స్. థియేటర్ లో ఈ సినిమా చూస్తున్నప్పుడు నాగార్జున గారి ఫ్యాన్స్ నుండి వచ్చిన అప్లాజ్, సోషల్ మీడియాలో వాళ్ళ నుండి వస్తున్న ఫీడ్ బ్యాక్ నాకు చాలా ఆనందాన్ని కలిగించింది” అన్నారు.

చివరిగా కింగ్ నాగార్జున మాట్లాడుతూ “ఈ సినిమాలో నాని తో నా కాంబినేషన్ కు “బ్రొమాన్స్” అనే కొత్త పదాన్ని కాయిన్ చేశారు. మల్టీ స్టారర్స్ చేసేటప్పుడు నీ క్యారెక్టర్ ఎక్కువ నా క్యారెక్టర్ తక్కువ అని కొలతలు వేసుకోకుండా ఒక అండర్స్టాండింగ్ లో చేస్తే మంచి సినిమాలు వస్తాయి. దేవదాస్ అలా రావటానికి బాగా కో ఆపరేట్ చేసిన నానికి థాంక్స్ చెప్పాలి. అలాగే చిన్న వాడు అయినప్పటికీ ఇంత పెద్ద సినిమాను బాగా హ్యాండిల్ చేసిన దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య కు థాంక్స్. నా ఫ్యాన్స్ నుండి మంచి ఫీడ్ బ్యాక్ వస్తుందని శ్రీరామ్ ఆదిత్య చెప్పాడు. నా ఫ్యాన్స్ హ్యాపీ గా ఉంటే నేను హ్యాపీగా ఉన్నట్టే.

ఇక అశ్వినీదత్ గారి గురించి చెప్పాలంటే ఆనాటి “ఆఖరిపోరాటం” రోజులు గుర్తుకు వస్తున్నాయి. ఎంత ఖర్చు అయినా పరవాలేదు… సినిమా ఇంకా రిచ్ గా తీయండి అంటూ రాఘవేంద్ర రావు గారి మీద పోట్లాడుతుండేవారు. దేవదాస్ ను ఆయన కం బ్యాక్ ఫిలిం అంటున్నారు. ఆయనకు కం బ్యాక్ ఏమిటి… మధ్యలో చిన్న రెస్టు తీసుకున్నారు… ఆయన స్థానంలో బంగారం లాంటి ఇద్దరు కూతుర్లు స్వప్న, ప్రియాంక ఆయన సక్సెస్ ను వందేళ్ళ దాకా కంటిన్యూ చేస్తారు… ఆయన వైజయంతి మూవీస్ బ్యానర్ లోగోలో ఎన్టీ రామారావు గారు ఆ శంఖాన్ని అలా ఊదుతూనే ఉంటారు… ఆయన సక్సెస్ అలాగ కొనసాగుతూనే ఉంటుంది. దేవదాస్ కు మంచి మ్యూజిక్ ఇచ్చిన మణిశర్మ గారికి, కెమెరామెన్ సామ్ దత్ కు నా ప్రత్యేక ధన్యవాదాలు. సెప్టెంబర్- అక్టోబర్ నెలలో నాకు చాలా ఇష్టమైన కలిసి వచ్చిన నెలలు. ఇదే టైం లో మా ఫ్యామిలీలో అందరికీ మంచి సక్సెస్ లు వచ్చాయి… అందరం చాలా హ్యాపీగా ఉన్నాం… అందుకే అందరం హాలిడే ట్రిప్ వెళ్లి వచ్చాం. మరొకమారు దత్తు గారికి, నానికి, శ్రీరామ్ ఆదిత్య కు థాంక్స్” అంటూ మీడియా మీట్ కు ముగింపు పలికారు కింగ్ నాగార్జున.

ఈ మీడియా మీట్ కు ముందు దాస్ పాత్రధారి నాని రికార్డ్ చేసి పంపిన వీడియో క్లిప్ ను ప్లే చేశారు. ఒక వైపు దేవదాసు- మరోవైపు బిగ్ బాస్ లతో విపరీతంగా స్ట్రెయిన్ అయిన నాని హాలిడే ట్రిప్ కోసం యూరప్ వెళ్లారట. అందుకే తన సెల్ఫీ మెసేజ్ ను పంపారు నాని. ఆ సెల్ఫీ క్లిప్ లో నాని నాగార్జునను అడ్రస్ చేస్తూ” నాగ్ సార్…. మన దేవదాస్ రిలీజ్ టైం లో మీరు లేరు…. అది హిట్టయి అందరం సెలబ్రేట్ చేసుకోవలసిన టైం లో నేను లేను. ఏది ఏమైనా this is a happy moment … మీతో పనిచేయటం గ్రేట్ ఎక్స్పీరియన్స్… థాంక్యు వెరీ మచ్… అలాగే ఎంటైర్ యూనిట్ కి థాంక్స్” అన్నారు.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here