యంగ్ హీరోలకు బెస్ట్ ఛాయిస్ గా జగపతి బాబు

Jagapathi Babu Turns First Priority of Young Heroes,Telugu Filmnagar,Tollywood Cinema Latest News,Telugu film Updates,Latest Telugu Movies 2018,Jagapathi Babu Turns First Priority of Tollywood Heroes,Jagapathi Babu Turns First Priority of Telugu Heroes,Jagapathi Babu Movies Latest News,Jagapathi Babu Upcoming Movies Details,Actor Jagapathi Babu Latest Updates
Jagapathi Babu Turns First Priority of Young Heroes

ఒక్క ఛాన్స్ ఒకే ఒక్క ఛాన్స్ నేనేంటో చూపిస్తా అని రవితేజ ఖడ్గం సినిమాలో చెప్పే డైలాగ్ గుర్తుండే ఉంటుంది కదా అందరికీ. అలా ఒక్క ఛాన్స్ కోసం ఎదురుచూస్తున్న తరుణంలో విలన్ గా వచ్చిన క్యారెక్టర్ ను ఏ ముహూర్తాన సెలక్ట్ చేసుకున్నాడో అప్పటి నుండి ఈ హీరో రేంజే మారిపోయింది. ఇప్పటికే ఆ హీరో ఎవరో స్ట్రైక్ అయినట్టుంది కదా. ఇంకెవరూ… ఒకప్పుడు కుటుంబకథా చిత్రాలు కేరాఫ్ అడ్రస్ గా నిలిచి…ఇప్పుడు విలన్ గా, ఫాథర్ గా దూసుకుపోతున్న జగపతి బాబు.

గతంలో ఫ్యామిలీ సినిమాలంటే జగపతిబాబు సినిమాలే గుర్తొచ్చేవి. ఆ తరువాత యంగ్ హీరోలు రావడం… సినిమా ఛాన్స్ లు తగ్గడం.. దానికి తోడు ఆర్ధిక సమస్యలు కూడా రావడంతో సరైన బ్రేక్ కోసం ఎదురుచూశాడు జగ్గూభాయ్. అలా చూస్తున్న సమయంలోనే ఓ పిక్ జగపతిబాబు కెరీర్ నే మార్చేసింది. సాల్ట్ అండ్ పెప్పర్ అంటూ జగపతిబాబు ఓ ఫొటో షూట్ చేయడం…అది కాస్త బోయపాటి శ్రీను కంట్లో పడటం…దాంతో లెజెండ్ సినిమాలో విలన్ గా సెలక్ట్ అవ్వడం..అదీ కూడా హిట్టవ్వడంతో జగపతి బాబుకి వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. ఒకపక్క విలన్ పాత్రలు చేస్తూనే… మరోపక్క ఫాథర్ పాత్రలు కూడా చేస్తూ సెకండ్ ఇన్నింగ్స్ లో బెస్ట్ ఛాయిస్ గా మారిపోయాడు.

జగపతి బాబు – ఎన్టీఆర్- నాన్నకు ప్రేమతో

నాన్నకు ప్రేమతో సినిమాలో విలన్ గా చేసిన జగపతి బాబుకు విలన్ గా మరోసారి బెస్ట్ ఛాయిస్ అయ్యాడని చెప్పొచ్చు. విలన్ అంటే ఇలానే ఉండాలి అన్న క్యాలిక్యులేషన్స్ ను పక్కన పెట్టి స్టైలిష్ లుక్లో మైండ్ గేమ్ ఆడే బిజినెస్ మ్యాన్ గా ఆకట్టుకున్నాడు. ఎన్టీఆర్, జగపతిబాబు కాంబినేషన్ చాలా బాగా వర్కవుట్ అయింది.

జగపతి బాబు- మహేష్ బాబు- శ్రీమంతుడు

కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన శ్రీమంతుడు సినిమా ఎంత పెద్ద హిట్టయ్యిందో తెలిసిందే అందరికీ. ఈ సినిమాలో మహేష్ బాబు నటన తో పాటు..మహేష్ కు తండ్రిగా నటించిన జగపతి బాబు నటన కూడా ఈ సినిమాకు ప్లస్ అయింది. లోపల ఎంత ఎమోషనల్ గా ఉన్నా…పైకి మాత్రం వ్యాపారమే ముఖ్యం అనిపించే పాత్రలో నటించి… ఈ రోల్ కు అతనే న్యాయం చేయగలడు అన్న సెటిల్డ్ యాక్టింగ్ తో మెప్పించాడు.

జగపతి బాబు-రామ్ చరణ్- రంగస్థలం

సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన రంగస్థలం సినిమా జగపతి బాబు సెకండ్ ఇన్నింగ్స్ లోనే మరో మైలు రాయి. నిజానికి ఈ సినిమాలో జగపతి బాబు చాలా తక్కువ మాట్లాడుతాడు. కానీ తన బాడీ లాంగ్వేజ్ తోనే.. మాట్లాడకుండానే కోపం తెప్పించేస్తాడు. సినిమా చూసే ప్రేక్షకుడికి నిజంగా జగపతి బాబును చూస్తే అంతకోపం వస్తుంది. ఈ సినిమా అప్పుడే సెకండ్ ఇన్నింగ్స్ లో ఈ సినిమా సుకుమార్ ఇచ్చిన ఇంకో లైఫ్ అని జగపతి బాబే స్వయంగా అన్నాడంటే.. ఈ రోల్ అంతలా ఎక్కిందని చెప్పొచ్చు.

జగపతి బాబు- కళ్యాణ్ రామ్- ఇజం

ఇక కళ్యాణ్ రామ్ తో కలిసి జగ్గూభాయ్ ఇజం సినిమాలో కలిసి నటించారు. ఈ సినిమాలో హీరోయిన్ తండ్రిగా.. జావెద్ భాయ్ అనే డాన్ పాత్రలో నటించిన జగ్గూభాయ్ ఎప్పటిలాగే తన నటనతో మెప్పించాడు. ఇక పూరీ సినిమాల్లో హీరోతో పాటు విలన్ ను కూడా స్టైలిష్ గా చూపిస్తాడు కాబట్టి.. ఈ సినిమాలో జగపతి బాబు నటనతో పాటు లుక్ కు కూడా మంచి మార్కులు పడ్డాయి. హీరోయిన్ తండ్రిగా.. బిజినెస్ మ్యాన్ గా మంచి నటన కనబరిచాడు.

జగపతి బాబు- అడవి శేషు- గూఢచారి

ఈ సినిమాలో కూడా ప్రతినాయక పాత్రలోనే జగపతి బాబు నటించాడు. అసలు ఈ సినిమాలో జగపతి బాబు ఎంట్రీ నే ఆడియన్స్‌ కు షాక్‌ ఇస్తుంది. మరోసారి ప్రతినాయక పాత్రలో జగపతి బాబు మెప్పించాడు. కరుడుగట్టిన తీవ్రవాదిగా ఆయన నటన, లుక్స్‌ సినిమాకే ప్లస్‌ అయ్యాయి. ఆ రేంజ్ లో నటించాడు.

జగపతిబాబు- సాయిధరమ్ తేజ్- విన్నర్, పిల్లా నువ్వు లేని జీవితం

సాయిధరమ్ తేజ్– జగపతి బాబు కలిసి విన్నర్, పిల్లా నువ్వులేని జీవితం సినిమాల్లో నటించారు. పిల్లా నువ్వు లేని జీవితం సినిమాలో విలన్ పాత్రలో కనిపించినా… తేజ్ కు జగపతి బాబు మధ్య కామెడీ నవ్వులు తెప్పిస్తుంది. ఇక విన్నర్ సినిమాలో తేజ్ తండ్రిగా నటించి ఆ పాత్రలో కూడా ఒదిగిపోయారు.

జగపతి బాబు- ఎన్టీఆర్-అరవిందసమేత

ఇక ఇప్పటి వరకూ ఉన్న విలన్ లుక్ లు ఓ ఎత్తైతే ఇప్పుడు అరవింద సమేత లుక్ ఓ ఎత్తు అని చెప్పొచ్చు. త్రివిక్రమ్ దర్శకత్వంలో వస్తున్న అరవింద సమేత ట్రైలర్ ఇటీవల రిలీజ్ చేయగా..అందులో ముఖ్యంగా జగపతి బాబు లుక్కే హైలెట్ అయింది. ముఖం మీద ఘాటుతో నోట్లో బుల్లెట్ పెట్టుకొని బాబోయ్ చూడటానికి చాలా భయంకరంగా ఉన్నాడు. ఈ సినిమాకు జగ్గూభాయ్ లుక్ కూడా పెద్ద ప్లస్ పాయింట్ అయ్యేలా కనిపిస్తోంది. లుక్కే ఇలా ఉంటే సినిమా మొత్తం ఇంకెలా ఉంటాడో.

మరి పైన చెప్పిన సినిమాలే కాదు..ఇంకా ఇటీవల వచ్చిన ఆటగాళ్లు, నేల టికెట్, సాక్ష్యం ఇలా చాలా సినిమాల్లో జగపతి బాబు తండ్రిగా, విలన్ గా తన నటనతో మెప్పించాడు. ఇంకా పలు సినిమాలు లిస్ట్ లో ఉన్నాయి. నిజంగా సెకండ్ ఇన్నిం గ్స్..ద బెస్ట్ ఇన్నింగ్స్ అని చెప్పొచ్చు. సెకండ్ ఇన్నింగ్స్ లో ప్రస్తుతం ఉన్న యంగ్ హీరోలకు బెస్ట్ ఛాయిస్ అయ్యాడు. హీరో గా కంటే సెకండ్ ఇన్నింగ్స్ లోనే తాను హ్యాపీగా ఉన్నానని జగపతి బాబు చెప్పాడంటేనే అర్దంచేసుకోవచ్చు.. తాను ఈ రోల్స్ తో ఎంత ఎంజాయ్ చేస్తున్నాడో..ముందు ముందు కూడా జగ్గూభాయ్ కి ఇంకా మంచి రోల్స్… మంచి వైవిధ్యమైన పాత్రలు రావాలని.. ఇలానే తన నటనతో అలరించాలని కోరుకుందాం..

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here