దేశభక్తి -వినోదాల మేళవింపు “భలే మంచి చౌక బేరమ్”

Bhale Manchi Chowka Beram Movie Plus Points, Bhale Manchi Chowka Beram Movie Public Talk, Bhale Manchi Chowka Beram Movie Review, Bhale Manchi Chowka Beram Movie Review And Rating, Bhale Manchi Chowka Beram Movie Story, Bhale Manchi Chowka Beram Review, Bhale Manchi Chowka Beram Telugu Movie Live Updates, Bhale Manchi Chowka Beram Telugu Movie Public Response, Bhale Manchi Chowka Beram Telugu Movie Review, Latest Telugu Movie Reviews, Latest Telugu Movies News, Telugu Film News 2018, Telugu Filmnagar, Tollywood Cinema Updates
Bhale Manchi Chowka Beram Movie Review

హాస్య కరుణ వీర రౌద్ర భయానక బీభత్స శృంగారాది నవరసాల్లో ఏ రసం నుండైనా పిండుకోగలిగిన ఎస్సెన్స్ వినోదం. పండించగల వారు ఉంటే హాస్యంలోనే కాదు… విషాదంలో కూడా వినోదం ఉంటుంది. వినోదాన్ని అందించడమే లక్ష్యంగా తీసే సినిమాలలో హాస్యంతో పాటు దేశభక్తిని కూడా మేళవించవచ్చు అని గతంలో చాలా సినిమాలు నిరూపించా యి. తాజాగా హాస్యాన్ని దేశభక్తిని మేళవించి ప్రముఖ దర్శకుడు మారుతి ఇచ్చిన కాన్సెప్టుతో యువ దర్శకుడు మురళి కృష్ణ ముడిదాని దర్శకత్వంలో కె.కె.రాధామోహన్ సమర్పణలో ఆరోళ్ళ సతీష్ కుమార్ నిర్మించిన ” “భలే మంచి చౌక బేరం” ఈ రోజు విడుదలైంది. దర్శకుడు మారుతి కాన్సెప్ట్ అందించడం కె.కె.రాధామోహన్ లాంటి అభిరుచి గల నిర్మాత సమర్పకుడిగా వ్యవహరించడంతో భలే మంచి చౌక బేరం చిత్రానికి రిలీజ్ కు ముందే మంచి క్రేజ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఈ దేశభక్తి పూరిత హాస్య ప్రధాన చిత్రం ఎలా ఉందో చూద్దాం.

పార్ధు (నవీన్), సలీం (కేరింత నూకరాజు) దుబాయ్ లో ఉద్యోగాలు వెలగ పెడుతున్నట్టుగా బిల్డప్ ఇచ్చి ఏజెంట్ మోసం చేయడంతో హైదరాబాదులోనే పార్ధు టాక్సీ డ్రైవర్ గా, సలీం కొరియర్ బాయ్ గా పని చేస్తుంటారు. వీళ్ళు నిజంగానే దుబాయిలో ఉద్యోగం చేస్తున్నారనుకొని వీళ్ళ తల్లిదండ్రులు అప్పులు తీర్చడం కోసం డబ్బు పంపించమని అడుగుతుంటారు… మీరు ఏవో వంకలు చెప్పి తప్పించుకుంటూ ఉంటారు. ఒకరోజు ఆదర్శి( యామిని భాస్కర్) పార్ధు టాక్సీ లో ఎక్కడంతో ఆమెతో పరిచయం ఏర్పడుతుంది. ఆమె మంచితనం, జాలి హృదయం చూసి పార్ధు ఆమెకు కనెక్ట్ అవుతాడు. వారిద్దరి పరిచయం ప్రేమకు దారి తీస్తుంది. ఇదిలా ఉంటే మాజీ మిలటరీ మేజర్ ఆయుబ్ ఖాన్( రాజా రవీంద్ర) రాసిన “దేశ రహస్యాలు ” అనే ఫైలు పొరపాటున నవీన్ పార్ధులకు దొరుకుతుంది. అవి నిజంగానే దేశ రహస్యాన్ని కి సంబంధించిన ఫైల్ అనుకొని దాన్ని పాకిస్తానీ టెర్రరిస్టు ముఠాలకు అమ్మేందుకు 30 కోట్లకు బేరం సెటిల్ చేసుకుంటారు.

ఇంతలో ఒక ఆక్సిడెంట్ లో నవీను, సలీం లు ఆయుబ్ ఖాన్ కు తారసపడతారు. వాళ్ల దగ్గర ఉన్న ఫైలు తనదే అని మేజర్ ఘర్షణ పడతాడు. గొడవ ఎందుకు వచ్చే 30 కోట్లు ముగ్గురం పంచుకుందాం అని ఒప్పందానికి వచ్చి టెర్రరిస్ట్ హెడ్ అస్లామ్ డెన్ కి వెళ్తారు. అక్కడ కథ అడ్డం తిరుగుతుంది. అసలు మేజర్ అయూబ్ రాసిన ఫైల్ ఏమిటి? దాంట్లో నిజంగానే దేశ రక్షణకు సంబంధించిన రహస్యాలు ఉన్నాయా..? పాకిస్తాన్ టెర్రరిస్టులకు ఆ రహస్యాలు ఉపయోగపడ్డాయా? ఆ ఫైలు ద్వారా టెర్రరిస్టులు ఆశించింది ఏమిటి? అందులో ఉన్నది ఏమిటి? డబ్బు కోసం దేశ రక్షణ రహస్యాలనే అమ్మటానికి సిద్ధపడ్డ నవీన్ సలీమ్ లకు ఎలాంటి జ్ఞానోదయమైంది…. దేశభక్తుడైన మేజర్ ఆయుబ్ ఖాన్ అసలు కేరెక్టర్ ఏమిటి? ఇత్యాది విషయాల చుట్టూ పరిభ్రమించే ఈ కథలో హాస్యం- దేశభక్తి అనే రెండు విభిన్న విరుద్ధ అంశాలను చక్కగా ఫ్యూజ్ చేశాడు దర్శకుడు మురళీకృష్ణ.

అయితే కాన్సెప్టు ,కథ, డైలాగులు, స్క్రీన్ ప్లే అన్నీ బాగానే కుదిరిన, అమరిన ఈ సినిమాకు క్యాస్టింగ్ విషయంలో పొరపాట్లు జరిగాయి. ఆ విషయం గురించి ఎక్కువ చర్చించటం కూడా అనవసరం. టెక్నికల్ గా హరి బ్యాగ్రౌండ్ సాంగ్స్ అండ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగున్నాయి. ఉద్ధవ్ ఎడిటింగ్, రవి నంబూరి రచన, బాల్ రెడ్డి కెమెరా బాగున్నాయి.
మొత్తం మీద దేశభక్తి హాస్యం ఆనే రెండు విభిన్న అంశాలను మిళితం చేసి మురళీకృష్ణ చేసిన ప్రయత్నం బాగుంది… అతని టేకింగ్ లో స్పీడు, టైమింగ్, షాట్ కంపోజింగ్ అన్ని బాగున్నాయి… ఒక్క మెయిన్ క్యాస్టింగ్ తప్ప.

 

భలే మంచి చౌక బేరమ్ మూవీ రివ్యూ
  • Story
  • Screenplay
  • Direction
  • Performance
3
Sending
User Review
0 (0 votes)

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here