కథానాయకుడిగా వచ్చేస్తున్న ఎన్టీఆర్-మరి రాజకీయం..?

Balakrishna NTR Biopic Turns Kathanayakudu,NTR Biopic Gears Up For a Big Surprise,Telugu Filmnagar,Tollywood Cinema Latest News,Telugu film Updates,Latest Telugu Movies 2018,NTR Biopic Movie Latest Updates,NTR Biopic Telugu Movie Gives Big Surprise,NTR biopic Movie Latest News,Tollywood Biopics Updates,NTR Biopic First Look Latest News,#Kathanayakudu,NTR Biopic First Part Title As Kathanayakudu
Balakrishna NTR Biopic Turns Kathanayakudu

నట సార్వభౌముడు ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా ఆయన బయోపిక్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్రలో ఆయన తనయుడు బాలకృష్ణనే నటిస్తుండటంతో సినిమాపై మొదటి నుండి మంచి క్రేజ్ ఏర్పడింది. దీనికి తోడు సినిమాలో పలువురు ప్రముఖ హీరోలు, హీరోయిన్లు నటిస్తుండటంతో భారీ అంచనాలే ఉన్నాయి. నిజానికి ఎన్టీఆర్ సినిమా కాబట్టి ప్రతి ఒక్కరూ సినిమా చూసి తీరతారు. కాకపోతే భారీ తారాగణం కాబట్టి ఇంకాస్త అంచనాలు పెరిగాయి అంతే.

ఇక ఈ సినిమా పై గత కొద్దిరోజులుగా ఓ వార్త చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. ఈ బయోపిక్ రెండు పార్ట్ లుగా ఉంటుందని వార్తలు వచ్చాయి. ఇప్పుడు తాాజాగా మరో సర్ ప్రైజ్ ఇస్తున్నట్టు చెప్పిన చిత్ర యూనిట్.. ఆ సినిమా టైటిల్ తో పాటు కథానాయకుడు అని ఓ క్యాప్షన్ ను పెట్టి విడుదల చేశారు. ఇక విడుదల చేసిన పోస్టర్ ను బట్టి చూస్తే… ఈ వార్తల్లో నిజమున్నట్టే తెలుస్తోంది. తొలి భాగంలో ఎన్టీఆర్‌ సినీ జీవితం రెండో భాగంలో ఎన్టీఆర్ రాజకీయ ప్రస్థానంలను తెరకెక్కించనున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 9న రిలీజ్ చేస్తున్నట్టుగా క్రిష్ తన ట్విట్టర్ ద్వారా స్వయంగా తెలిపారు. ‘ప్రతి కథకీ ఓ నాయకుడుంటాడు.. కానీ కథగా మారే నాయకుడొక్కడే వుంటాడు.. జనవరి 9న యన్.టి.ఆర్ కథనాయకుడు’ వస్తున్నాడని క్రిష్ ట్వీట్ చేశాడు.

అయితే మరో ప్రచారం కూడా జరుగుతుంది. ఈ సినిమా మొదటి భాగం జనవరి 9న రిలీజ్ చేసి..ఆ తరువాత ఓ రెండు మూడు నెలల తరువాత అంటే సమ్మర్ లో రెండో భాగం విడుదల చేసేలా ప్లాన్ చేసినట్టు టాక్స్ వినిపిస్తున్నాయి. మరి ఈ విషయంలో ఓ క్లారిటీ వచ్చేంత వరకూ ఏం చెప్పలేం. కాగా ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్రలో బాలకృష్ణ నటిస్తుండగా… ఆయన సతీమణి బసవతారకం పాత్రలో విద్యాబాలన్, చంద్రబాబు పాత్రలో రానా, అక్కినేని నాగేశ్వరరావు పాత్రలో సుమంత్, సావిత్రి పాత్రలో నిత్యామీనన్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం కృష్ణా జిల్లా హంసలదీవిలో ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here