వివాదంలో ఆర్ఎక్స్ 100…హీరో, డైరెక్టర్ క్లారిటీ

Karthikeya and Ajay Bhupathi Clarify on RX 100 Pillaa Raa Controversy,Telugu Filmnagar,Tollywood Cinema Latest News,Telugu film Updates,Latest Telugu Movies 2018,Karthikeya and Ajay Bhupathi Clarify on RX 100 Movie,Actor Karthikeya Reacts on RX 100 Pillaa Raa Controversy,RX 100 Movie Controversy Latest Updates, Director Ajay Bhupathi Reacts on RX 100 Controversy,RX 100 Movie Latest News
Karthikeya and Ajay Bhupathi Clarify on RX 100 Pillaa Raa Controversy

తక్కువ బడ్జెట్ తో చిన్న సినిమాగా విడుదలైన ఆర్ఎక్స్ 100 సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయిందో అందరికీ తెలుసు. ఈ సినిమాకు దర్శకుడు ఎవరో కాదు ఆర్జీవీ శిష్యుడు అజయ్ భూపతి. అజయ్‌ భూపతి దర్శకత్వంలో కార్తికేయ, పాయల్‌ రాజ్‌పుత్‌ హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన ఈ సినిమా భారీ వసూళ్లు సాధించి సూపర్ హిట్టయింది. దీంతో ఇప్పుడు ఈ సినిమా హీరో, అజయ్ భూపతికి ఫుల్ క్రేజ్ పెరిగింది. ఇక్కడి వరకూ బాగానే ఉంది. ఇప్పుడు తాజాగా ఈ సినిమా వివాదంలో చిక్కుకుంది.

జగిత్యాలలో ఇద్దరు విద్యార్ధులు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఇటీవల కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. వీరిద్దరి ఆత్మహత్యకు కారణం వారి ప్రేమ. ఇద్దరు యువకులు ఒకే అమ్మాయిని.. ప్రేమించడంతో ఆమె ఎవరినీ పట్టించుకోకపోవడం.. దాంతో తమ ప్రేమ సఫలం కాదన్న అనుమానంతో.. ఇద్దరూ పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నారు. దీంతో ఈ వార్త సంచలనం సృష్టించింది. అయితే ఉరుము ఉరిమి మంగలం మీద పడ్డట్టు అన్న సామెత లాగ..అటు పోయి ఇటు పోయి చివరికి వీరు ఆత్మహత్య చేసుకోవడానికి ఆర్ఎక్స్ 100 సినిమా ప్రేరణే కారణం అంటూ వార్తలు పుట్టుకొచ్చాయి. అంతేనా ఆత్మహత్యల వెనుక ఆర్ఎక్స్ 100 సినిమా ప్రభావం ఉందని విచారణలో తేలిందని… హీరోలానే తాము కుడా సూసైడ్ చేసుకోవాలని ఇద్దరు విద్యార్ధులు ప్రయత్నించారని పోలీసులు తేల్చారు. అంతేనా…న్యూస్ లల్లో.. ఇక సోషల్ మీడియా సంగతైతే చెప్పనక్కర్లేదు. ఆర్ఎక్స్ 100 ప్రభావంతో ఆత్మహత్యలు అంటూ ఒకటే కామెంట్లు.

దీంతో ఈ వివాదంపై ఈ సినిమా హీరో కార్తికేయ, డైరెక్టర్ ఘాటుగా స్పందించారు. తమ సినిమాలో హీరో ఆత్మహత్య చేసుకునే సన్నివేశం అసలు లేదు.. సినిమా దర్శకులు ఎప్పుడు తమ సినిమా చూపి చెడిపోండి అని సినిమా తీయరు. విద్యార్థులు ఆలోచన లేకుండా ఇలాంటి నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించాడు. అంతేకాదు.. మేము నటులం..తీవ్ర వాదులం కాదని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇక డైరెక్టర్ అజయ్ భూపతి స్పందిస్తూ… ”చనిపోయిన ఇద్దరు విద్యార్ధులకు ఇంకా పద్దెనిమిది సంవత్సరాలు నిండలేదు. నేను తీసిన సినిమా A స‌ర్టిఫికెట్ సినిమా.. అలాంటి సినిమాను వారు చూడటానికి లేదు.. వాళ్ల‌ని అస్స‌లు చూడకుండా ఆపాల్సింది అంటూ లాజికల్ గా ఆన్సర్ ఇచ్చాడు. మరి ఈ రోజుల్లో థియేటర్లో చూడలేకపోయినా..టీవీలోనో.. ఇంకా పలు మార్గాలు ఉన్నాయి సినిమా చూడటానికి. ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే.. ఎక్కడో జరిగిన ఆత్మహత్యను సినిమాకు ఆపాదించడమే. సినిమాల్లో ఎన్నో మంచి అంశాలు కూడా ఉంటాయి నేర్చుకోవడానికి…చాలా మంచి పనులు చేస్తుంటారు హీరోలు సినిమాల్లో. కానీ ఏదైనా చెడు జరిగినప్పుడు మాత్రమే సినిమాలను వేలెత్తి చూపించడం దురదృష్టకరం. ఇది ఇప్పుడు కొత్తేం కాదులెండి…పాపం సినీ పరిశ్రమ గత కొన్నేళ్లుగా ఎదుర్కొంటున్న సమస్యే.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here