సూపర్ స్టార్ మహేష్ బాబు మెచ్చిన సినిమా

Chekka Chivantha Vaanam Impresses Mahesh Babu, Chekka Chivantha Vaanam Movie, Chekka Chivantha Vaanam Movie Latest News, Latest Telugu Movies News, Mahesh Babu can’t stop praising Mani Ratnam Chekka Chivantha Vaanam, Mahesh Babu heaps praise on Mani Ratnam film Chekka Chivantha Vaanam, Mahesh Babu praises Mani Ratnam Chekka Chivantha Vaanam, Mahesh full of Praise for Chekka Chivantha Vaanam, Telugu Cinema Updates 2018, Telugu Film News, Telugu Filmnagar
Chekka Chivantha Vaanam Impresses Mahesh Babu

సూపర్ స్టార్ మహేష్ బాబు పేరు వింటేనే లక్షలాది మంది అభిమానుల హృదయాలలో అలజడి కలుగుతుంది, ఉత్సాహం ఉప్పొంగుతుంది. అటువంటి మహేష్ బాబు కు అభిమాన దర్శకుడు ఒకరు ఉన్నారు. ఆయనెవరో కాదు దర్శకమణి మణిరత్నం. చలన చిత్ర చరిత్ర లో మాయ బజార్ ను సృష్టించిన దర్శకుడు కె వి రెడ్డి, శతాధిక చిత్రాలు రూపొందించిన దర్శకరత్న దాసరి, కమర్షియల్ చిత్రాల దర్శకేంద్రుడు కె రాఘవేంద్ర రావు, కళా చిత్రాల దర్శకుడు కళాతపస్వి కె విశ్వనాధ్, మరో చరిత్ర క్రియేట్ చేసిన దర్శకుడు కె బాలచందర్ కోవకు చెందిన వారే దర్శకుడు మణిరత్నం. ఆయన దర్శకత్వం వహించిన నాయకన్, దళపతి, రోజా, బాంబే, కణ్ణత్తిల్ ముత్త మిట్టాల్ వంటి తమిళ చిత్రాలు బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి.

దర్శకుడు మణిరత్నం తెలుగు లో దర్శకత్వం వహించిన ఏకైక చిత్రం కింగ్ నాగార్జున నటించిన గీతాంజలి. ఈ సినిమా బెస్ట్ పాపులర్ ఫిల్మ్ గా నేషనల్ అవార్డ్, 7నంది అవార్డ్స్, బెస్ట్ డైరెక్టర్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకుంది. మణిరత్నం దర్శకత్వంలో అరవింద్ స్వామి, విజయ్ సేతుపతి, శింబు, జ్యోతిక, ప్రకాష్ రాజ్ నటించిన చెక్కసివందవానం తమిళ సినిమా సెప్టెంబర్ 27 వ తేదీ రిలీజయి విజయవంతం గా ప్రదర్శించబడుతుంది. ఆ సినిమా తెలుగు వెర్షన్ నవాబ్. సూపర్ స్టార్ మహేష్ బాబు ట్విట్టర్ ద్వారా తన అభిమానాన్ని చాటుకున్నారు. దర్శకుడు మణిరత్నం కు అభిమానినని,చెన్నై లో థియేటర్స్ లో క్లాప్స్ కొడుతూ మణిరత్నం సినిమాలు చూసేవాడినని, తన హోమ్ థియేటర్ లో చెక్కసివంద వానం సినిమా చూసి క్లాప్స్ కొట్టి కాలర్ ఎగురవేశానని,నటీ నటుల నటన బాగుందని, మ్యూజిక్ డైరెక్టర్ రెహమాన్ కు ఎవరూ సాటిరారని, సంతోష్ శివన్ ప్యూర్ క్లాస్ అని ట్వీట్ చేశారు.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here