లక్ష లైకుల ట్రైలర్లు – ఏ ట్రైలర్ ఎంత టైమ్ లో?

Aravindha Sametha Trailer Gets Fastest 100K Likes,Agnyaathavaasi Trailer Latest Update, Aravindha Sametha Trailer Updates, Baahubali 2 Movie Trailer Latest News, Bharat Ane Nenu Trailer Latest News, Fastest 100K View Count Trailer Movies, Fastest 100K View Count Trailer Movies In Telugu, Fastest 100K View Count Trailer Movies In Tollywood, latest telugu movies news, Telugu Film News 2018, Telugu Filmnagar, Tollywood Movie Updates
Aravindha Sametha Trailer Gets Fastest 100K Likes

ఒకప్పుడు సినిమా తీశామా.. రిలీజ్ అయిందా… హిట్ కొట్టామా ఇలానే ఆలోచించేవారు. కానీ ఇప్పుడు మారుతున్న రోజులతో పాటు… టెక్నాలజీ కూడా మారిపోతుంది. ఇప్పుడు ఫస్ట్ లుక్ రిలీజ్ దగ్గర నుండి టీజర్, ట్రైలర్, సినిమా రిలీజ్ అయ్యేంతవరకూ అన్నీ కౌంటే. టీజర్ కానీ ట్రైలర్ కానీ రిలీజ్ అయిందంటే చాలు.. ఎన్ని వ్యూస్ వచ్చాయి… ఎన్ని లైక్స్ వచ్చాయి..?పలానా సినిమా కంటే ఎక్కువ లైక్స్ వచ్చాయా… తక్కువ లైక్స్ వచ్చాయా..? కొత్త రికార్ట్ సృష్టించిందా..? ఉన్న రికార్డులు బద్దలు కొట్టిందా లేదా..? గంటకు ఎన్ని వ్యూస్ వచ్చాయి, లైక్స్ వచ్చాయి.. 24 గంటల్లో ఎన్ని వ్యూ స్ వచ్చాయి లైక్స్ వచ్చాయి..అబ్బో ఇలా చెప్పుకుంటూ పోతే అన్నీ లెక్కలే. ఇప్పుడు మనం చూడబోతున్నది దేని గురించి అంటే.. ఫాస్టెస్ట్ 100కే లైక్ట్ ట్రైలర్స్ గురించి.. అంటే లక్ష లైకులు సొంత చేసుకున్న ట్రైలర్ల గురించి. ఏ సినిమా.. లక్ష లైక్స్ ఎంత టైంలో సొంతం చేసుకున్నాయో ఓ లుక్కేద్దాం..

అరవిందసమేత

త్రివిక్రమ్ దర్శకత్వం.. ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన సినిమా అరవింద సమేత. రాయలసీమ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా ట్రైలర్ నిన్న రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. నిన్న 8 గంటలకు విడుదలైన ఈట్రైలర్ 68 నిమిషాల్లో 100కే లైక్స్ సొంతం చేసుకొని రికార్డు సృష్టించింది. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో ఈషా రెబ్బ, జగపతిబాబు, నాగబాబు మరియు సునీల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈసినిమా అక్టోబర్ 11 న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి సినిమా ఏ రేంజ్లో ఉంటుందో చూద్దాం..

బాహుబలి

తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా చాటి చెప్పిన సినిమా బాహుబలి. దర్శక ధీరుడు రాజమౌళి (జక్కన్న) దర్శకత్వం వహించిన ఈ సినిమా సాధించిన రికార్డులు గురించి ఎంతె చెప్పినా తక్కువే అవుతుంది.మగధీరతో కొత్త రికార్డులు సృష్టించిన రాజమౌళి.. బాహుబలితో తన రికార్డులు తానే చెరిపేశాడు. ఇక ఈసినిమా 100కే వ్యూస్ ఎన్ని నిమిషాల్లో సాధించిందో తెలుసా.. 75 నిమిషాల్లో అంటే గంటా పదిహేను నిమిషాల్లో లక్ష లైక్స్ సొంతం చేసుకుంది.

అజ్ఞాతవాసి

త్రివిక్రమ్-పవన్ కాంబో అంటే అభిమానులకు పండగే. ఇక పవన్ కళ్యాణ్ క్రేజ్ గురించైతే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమా హిట్టయినా..ఫట్టయినా మొదటి రోజే రావాల్సిన కలెక్షన్స్ వచ్చేస్తాయి. అందుకే ప్రొడ్యూసర్లు పవన్ సినిమా అంటే తాము పెట్టిన డబ్బు ఎక్కడికి పోదు అన్న ధీమాతో ఉంటారు. ఇక వీరిద్దరి కాంబినేషన్ లో జల్సా సినిమా, అత్తారింటికి దారేది సినిమాలు రాగా… మూడోసారి అజ్ఞాతవాసి సినిమాతో ప్రేక్షకులను అలరించారు. ఇక ఈసినిమా 100కే లైక్స్ ఎన్ని నిమిషాల్లో సొంత చేసుకుందంటే… 5 గంటల 40 నిమిషాల్లో 100కే లైక్స్ సొంతం చేసుకుంది.

భరత్ అనే నేను

కొరటాల శివ- మహేష్ బాబు కాంబినేషల్ లో వచ్చిన రెండో సినిమా భరత్ అనే నేను. భారీ అంచనాల నేపథ్యంలో విడుదలైన ఈ సినిమా అంతే భారీగా హిట్టయింది. మహేష్ బాబు కెరీర్ లోనే ది బెస్ట్ సినిమాల్లో భరత్ అనే నేను సినిమా మొదటి స్థానంలో ఉంటుందని చెప్పొచ్చు. ఒక పొలిటీషియన్ గా మహేష్ చాలా బాగా నటించాడు. అంతేకాదు… నిజ జీవితంలో కూడా ఇలాంటి సీఎం ఉంటే సమాజం బాగుపడుతుందన్న ప్రశంసలు సైతం వచ్చాయి. ఇక ఈ సినిమా ట్రైలర్ కు ఎంత టైమ్ లో 100కే లైక్స్ వచ్చాయంటే… 10 గంటల్లో 100కే లైక్స్ వచ్చాయి.

మరి పాత రికార్డులు బద్దలవ్వడం..కొత్త రికార్డులు క్రియేట్ అవ్వడం కామనే. ముందు ముందు ఈ సినిమా రికార్డులు బద్దలుకొట్టే సినిమాలు ఇంకెన్ని వస్తాయో చూద్దాం.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

 

Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here