నోవా టెల్ లో అరవింద సమేత ప్రీ రిలీజ్ ఈవెంట్

Aravindha Sametha Movie Updates, Aravindha Sametha Pre Release Event Highlights, Aravindha Sametha Telugu Movie Latest News, Aravindha Sametha Telugu Movie Pre Release Event Highlights, Jr NTR Aravindha Sametha Movie Pre Release Event Highlights, Latest Telugu Movies News, Telugu Film News 2018, Telugu Filmnagar, Tollywood Cinema Updates
Aravindha Sametha Pre Release Event Highlights

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో హారిక &హాసిని బ్యానర్ పై రాయలసీమ నేపధ్యం లో రూపొందిన అరవింద సమేత వీర రాఘవ సినిమా అక్టోబర్ 11 వ తేదీ దసరా కానుకగా రిలీజ్ కానుంది. ఇప్పటికే రిలీజయిన అరవింద సమేత సినిమా టీజర్, ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షక, అభిమానులను ఆకట్టుకుని సినిమాపై అంచనాలు పెంచేశాయి. పూజా హెగ్డే, ఈషా రెబ్బా హీరోయిన్స్ గా నటించారు. థమన్ ఎస్ ఎస్ సంగీతం అందించారు. అక్టోబర్ 2వ తేదీ అరవింద సమేత సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లోని నోవాటెల్ లో జరిగింది. చిత్ర యూనిట్ తో పాటు హీరో కళ్యాణ్ రామ్, నిర్మాతలు దిల్ రాజు, బివిఎస్ ఎన్ ప్రసాద్ పాల్గొన్నారు.సిరివెన్నెల సీతారామశాస్త్రి మాట్లాడుతూ .. రాయల సీమ ఆచార వ్యవహారాలపై రం రుధిరం మొదటి పాట గా సినిమాలో వస్తుందని,ఆపాటను పెంచల దాస్,త్రివిక్రమ్,తాను కలసి రచించినట్టుగా తెలిపారు.

ప్రముఖ నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ .. టెంపర్ సినిమానుండి హీరో ఎన్టీఆర్ రూట్ మార్చి నాన్నకు పేమతో, జనతా గ్యారేజ్, జై లవకుశ వంటి విభిన్నకధాంశ చిత్రాలను ఎంపిక చేసుకుంటున్నారని, అరవింద సమేత సినిమా కూడా ఘనవిజయం సాధిస్తుందని అన్నారు.నటుడు సునీల్ మాట్లాడుతూ .. ఎన్టీఆర్ గొప్ప మనసున్న మంచి వ్యక్తని,ఇతరుల కంఫర్ట్ చూసేమంచిమనిషని,త్రివిక్రమ్,ఎన్టీఆర్ కాంబినేషన్ లో మంచి సినిమా రావాలని కోరుకున్న వ్యక్తుల్లో నేనొకడిని అంటూ,ఈ సినిమా హిట్ అవుతుందని అన్నారు.డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ మాట్లాడుతూ .. .అరవింద సమేత సినిమాకు పనిచేసిన టీమ్ కు ధన్యవాదాలు తెలిపారు. హీరో కల్యాణ్ రామ్ మాట్లాడుతూ .. తమ తండ్రి హరికృష్ణ, తాతగారు నందమూరి తారక రామారావు తమ జీవితాలలో జరిగిన అనేక సంఘటనలకు అతీతంగా తమ వృత్తి ధర్మాన్ని నిర్వర్తించారని, తన తమ్ముడు ఎన్టీఆర్ విషాదం లో ఉన్నా కూడా తన వృత్తి ధర్మాన్ని పాటించి, ఈ సినిమా షూటింగ్ లో పాల్గొన్నారని తెలిపారు.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ .. అభిమానుల ప్రేమాభిమానాల వల్లే మనం ఈ స్థాయిలో ఉన్నామని తమ తండ్రి ఎల్లపుడూ చెప్పేవారన్నారు. తమ జీవితాలు అభిమానులకే అంకితం అని, తన తండ్రి ని గుర్తుచేసుకుని ఎన్టీఆర్ కన్నీటి పర్యంతమైనారు. అరవింద సమేత సినిమా ఒక ఎమోషనల్ జర్నీ అని, ఈ సినిమా క్యారెక్టర్ ద్వారా జీవితం గురించి చాలా తెలుసుకున్నానని, నేర్చుకున్నానని తెలిపారు. 12 సంవత్సరాలుగా త్రివిక్రమ్ తో పనిచేయాలనుకున్నానని, ఇన్నాళ్ళకు తన కల నెరవేరిందని, త్రివిక్రమ్ తనకు స్నేహితుడు, డైరెక్టర్ మాత్రమే కాదని, ఈ సినిమా పూర్తయ్యేసరికి ఆత్మ బంధువుగా మారారని ఎమోషనల్ గా మాట్లాడారు. మ్యూజిక్ డైరెక్టర్ థమన్ తన ప్రాణంపెట్టి ఈ సినిమాకు సంగీతం అందించారని, రైటర్స్ సిరివెన్నెల,రామ జోగయ్య గొప్ప పాటలు రచించారని అన్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్ సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.మ్యూజిక్ డైరెక్టర్ థమన్ తన బృందం తో అరవింద సమేత సినిమాలోని సాంగ్స్ ను స్టేజ్ మీద పెర్ఫార్మ్ చేశారు.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here