తమిళ బిగ్ బాస్ లో అర్జున్ రెడ్డి సందడి

Vijay Deverakonda Graces Bigg Boss Tamil Show,Telugu Filmnagar,Tollywood Cinema Latest News,Telugu Film Updates,Latest Telugu Movies 2018,Vijay Deverakonda in Bigg Boss Tamil Show,Bigg Boss Tamil Show Latest Updates,Vijay Deverakonda Graces in Bigg Boss,Bigg Boss 2 Tamil Show Latest News
Vijay Deverakonda Graces Bigg Boss Tamil Show

పెళ్లి చూపులు సినిమా సూపర్ హిట్ట్ కొట్టడంతో విజయ్ దేవరకొండ అనే హీరో తెలుగు సినీ పరిశ్రమకు తెలిశాడు అని చెప్పొచ్చు. ఇక ఆ తరువాత వచ్చిన అర్జున్ రెడ్డితో ఒక్క సారిగా ఓవర్ నైట్ లో స్టార్ అయిపోయాడు. ఈ సినిమాతో విజయ్ కు యూత్ లో వచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు. ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమాలకు ఓ ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. ఆ సినిమా. ఇక అర్జున్ రెడ్డి రోల్ లో విజయ్ ని చూసిన తర్వాత… గీతగోవిందం సినిమా ఎలా ఉంటుందా అని అనుమానాలు వ్యక్తమయ్యాయి. కానీ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్టవ్వడంతో విజయ్ ఏ పాత్ర అయినా చేయగలడు అని పేరు తెచ్చుకోవడమే కాక…ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ హీరో అయ్యాడు.

ఇక విజయ్ ప్రస్తుతం నోటా సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాతో విజయ్ తమిళంలో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. నిజానికి అర్జున్ రెడ్డి పుణ్యమా అని తెలుగులోనే కాదు…తమిళ్ లో కూడా విజయ్ కు భారీ క్రేజ్ వచ్చింది. “గీత‌గోవిందం” తెలుగు వ‌ర్ష‌న్ త‌మిళ‌నాట 6 కోట్లు వ‌సూలు చేసింది. బాహుబ‌లి త‌ర్వాత అత్య‌ధిక వ‌సూళ్లు సాధించిన తెలుగు సినిమా ఇదేనంటే అర్దం చేసుకోవచ్చు. విజయ్ కు అక్కడ కూడా ఎంత క్రేజ్ ఉందో.

ఇక ఆసక్తికరమైన విషయం ఏంటంటే…ఈ సినిమా అక్టోబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో విజయ్ ప్రమోషన్లో భాగంగా…తెలుగు కంటే ఎక్కువగా తమిళ్ మీదే దృష్టి పెట్టాడు. దీనిలో భాగంగానే… అక్క‌డ బిగ్‌బాస్‌లోకి వెళ్లాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. క‌మ‌ల్ హాస‌న్‌తో.. బిగ్‌బాస్‌కు వెళ్లి.. అక్క‌డ స్టేజ్‌పై త‌న సినిమాను ప్ర‌మోట్ చేసుకున్నాడు. తొలిసారి విజయ్ దేవ‌ర‌కొండ‌కే ఈ అవ‌కాశం ద‌క్కింది. కాగా మెహ్రీన్ కౌర్ పిర్జాదా హీరోయిన్ గా నటించిన ఈ సినిమా లో నాజర్ – సత్యరాజ్ లు ఇతర కీలక పాత్రలలో నటించారు. ఆనంద్ శంకర్ ఈ సినిమాకు దర్శకుడు. స్టూడియో గ్రీన్ బ్యానర్ పై జ్ఞానవేల్ రాజా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here