సైరా షూటింగ్ లో జాయిన్ అయిన చరణ్

Ram Charan Joins Sye Raa Shoot,Chiranjeevi Sye Raa Movie Shoot in Georgia, latest telugu movies 2018, Ram Charan in Sye Raa Shooting, Ram Charan Movie Latest Updates, Sye Raa Movie Producer Ram Charan in Georgia, Sye Raa Movie Shooting in Georgia, Sye Raa Movie Shooting Latest News, Sye Raa Producer Ram Charan Lands in Georgia, Sye Raa Team in Georgia, telugu film updates, Telugu Filmnagar, Tollywood Cinema Latest News
Ram Charan Joins Sye Raa Shoot

సైరా సినిమా షూటింగ్ జార్జియాలో జరుపుకుంటుంది. విశాలమైన వాతావరణంలో సినిమాకు కీలకమైన యుద్ద సన్నివేశాలు తీస్తున్నారు. దాదాపు 40 రోజుల పాటు అక్కడే ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. ఇక్కడ నుంది దాదాపు 150 మంది సిబ్బంది అక్కడికి వెళ్లగా.. అక్కడ 600 మంది లోకల్ నటులను ఈసినిమా కోసం తీసుకున్నారు. ఇదిలా ఉండగా ఇప్పుడు ఈ షూటింగ్ లో చరణ్ కూడా జాయిన్ అయ్యాడు. ఇన్ని రోజులు బోయపాటి దర్శకత్వంలో వస్తున్న కొత్త సినిమా షూటింగ్ లో భాగంగా అజర్ బైజాన్ లో ఉన్నాడు. ఇన్ని రోజులు షూటింగ్ లో బిజీగా ఉండగా.. ఇప్పుడు షూటింగ్ పూర్తవ్వడంతో సైరా షూటింగ్ లో ల్యాండ్ అయిపోయాడు. మరో నాలుగు రోజుల పాటు చరణ్ అక్కడే ఉంటాడు. అక్కడే నాలుగు రోజులుండి..యుద్ద సన్నివేశాలను మానిటరింగ్ చేయనున్నాడు.

ఈ సినిమాను చరణే నిర్మిస్తున్నాడు. దాదాపు 200 కోట్ల బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా… సినిమాను నిర్మిస్తున్నాడు. ఇప్పుడు షూటింగ్ జరుపుకుంటున్న యుద్ద సన్నివేశానికే దాదాపు 54 కోట్లు ఖర్చు చేస్తున్నాడంటేనే అర్దం చేసుకోవచ్చు. అంతేకాదు చిరు ఫుడ్ విషయంలో కూడా ఎలాంటి లోపం రాకుండా ..ఇక్కడి నుండి చెఫ్ లను అక్కడికి పంపి తన తండ్రి ఆరోగ్యం గురించి కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.

కాగా సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో చిరంజీవి సరసన నయనతార హీరోయిన్ గా నటిస్తుంది. ఇంకా ఈ సినిమాలో బాలీవుడు సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్, విజయసేతుపతి, కిచ్చా సుదీప్, జగపతిబాబు, తమన్నా పలువురు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అమిత్ త్రివేది ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here