పందెంకోడి 2 ట్రైలర్ రిలీజ్.. పులి ముందు వేషాలేయకూడదు..!

Pandem Kodi 2 Trailer Out Now,Telugu Filmnagar,Latest Telugu Moviews News,Telugu Film News 2018,Tollywood Movie Updates,Latest Telugu Movie Trailers 2018,Pandem Kodi 2 Theatrical Trailer,Pandem Kodi 2 Movie Trailer,Pandem Kodi 2 Telugu Movie Trailer,Pandem Kodi 2 Official Trailer
Pandem Kodi 2 Trailer Out Now

2006 సంవత్సరం లో ఎన్ . లింగుసామి దర్శకత్వంలో విశాల్ హీరోగా వచ్చిన పందెం కోడి సినిమా ఎంత ఘన విజయం సాధించిందో అందరికీ తెలుసు. ఆ సినిమా తో విశాల్ తమిళ ప్రేక్షకులకే కాదు.. తెలుగు ప్రేక్షకులకు మాస్ హీరో గా పరిచయమయ్యారు. ఇక 12 సంవత్సరాల తరువాత మళ్లీ పందెం కోడి సినిమాకు సీక్వెల్ పందెంకోడి 2 సినిమా తెరకెక్కుతుంది. ఇప్పటికే విడుదలైన టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు చిత్ర యూనిట్.

ఇక ట్రైలర్ ను చూస్తే పందెంకోడి సినిమాకు ఎక్కడా తగ్గకుండా..దానికి మించిపోయేలాగనే యాక్షన్ సన్నివేశాలు తెరకెక్కించినట్టు తెలుస్తోంది. కత్తిన చూసి భయపడటానికి పొట్టేలును కాదరా..పులివెందుల బిడ్డను అనే డైలాగ్ తో ట్రైలర్ స్టార్ట్ అవుతుంది. జాతరలో పులి వేషాలు వేయొచ్చు..కానీ పులి ముందు వేషాలు వేయకూడదు అని విశాల్ చెప్పే డైలాగ్.. మగాడు నరికితేనే కత్తి నరుకుద్దనుకున్నా.. ఆడది నరికినా నరుకుద్ది అని వరలక్ష్మీ శరత్ కుమార్ చెప్పే డైలాగ్.. ఇలా ఈ ఒక్క డైలాగే కాదు… ట్రైలర్ లో వచ్చిన ప్రతి డైలాగ్ అదిరిపోయింది. ఇక కీర్తి సురేష్ కూడా చాలా ఈజ్ గా.. పందెంకోడి సినిమాలో మీరా జాస్మిన్ పాత్ర లాగే.. రౌడీ అమ్మాయిగా నటించింది. ముఖ్యంగా వరలక్ష్మీ శరత్ కుమార్ కు ఈ రోల్ ప్లస్ పాయింట్ అవుతుందని చెప్పొచ్చు. ట్రైలర్ అయితే సూపర్ ఉంది..మరి సినిమా ఎలా ఉంటుందో చూద్దాం.

కాగా విశాల్ హీరోగా కీర్తి సురేష్, వరలక్ష్మి శరత్ కుమార్ హీరోయిన్స్ గా లింగుసామి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను ఠాగూర్ మధు నిర్మిస్తున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. తమిళ, తెలుగు భాషల్లో ఈసినిమా ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 18 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here