సర్కార్ సినిమా హక్కులను సొంతం చేసుకున్న నవాబ్ నిర్మాత

Nawab Producer Owns Vijay Sarkar Rights,Nawab Presenter Acquires Another Blockbuster Movie to Back Up,Telugu Filmnagar,Tollywood Cinema Latest News,Telugu film Updates,Latest Telugu Movies 2018,Nawab Telugu Movie Latest News,Nawab Presenter Acquires Another Blockbuster Movie,Vijay Upcoming Movies,Sarkar Movie Updates,Nawab Producer Owns Vijay Movie Sarkar,Nawab Producer Owns Sarkar Telugu Movie Rights
Nawab Producer Owns Vijay Sarkar Rights

నాని‌ ‘సెగ’, గౌతమ్ మీనన్ ‘ఎర్ర గులాబీలు’ ఇలా ఎన్నో మంచి సినిమాలను తెలుగు ప్రేక్షకులకు అందించిన నిర్మాత వల్లభనేని అశోక్ ఇటీవల రిలీజైన నవాబ్ సినిమా హక్కులను కూడా సొంతం చేసుకొని తెలుగు ప్రేక్షకులకు అందించారు. మణిరత్నం డైరెక్షన్ లో వచ్చిన ఈసినిమా మంచి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇప్పుడు తాజాగా ఆయన మరో భారీ చిత్రం‌తో తెలుగు ప్రేక్షకుల ముందుకు త్వరలో రాబోతున్నారు. అదే ఇళయదళపతి విజయ్ నటిస్తున్న 62వ త‌మిళ చిత్రం ‘సర్కార్’.

ప్రముఖ దర్శకుడు మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇక ఈ మూవీని తెలుగులో అదే పేరుతో రిలీజ్ చేయనున్నారు. అయితే ఈ సినిమా తెలుగు థియేటిరికల్ హక్కులను కూడా నిర్మాత అశోక్ వల్లభనేని సొంతం చేసుకున్నారు. కాగా మురుగదాస్ దర్శకత్వంలో పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజయ్ కు జోడిగా కీర్తి సురేష్ నటిస్తుంది. విజయ్ ఈ సినిమాలో ముఖ్యమంత్రి పాత్రలో కనిపించనున్నాడు. వరలక్ష్మీ కీల‌క‌పాత్ర‌లో క‌నిపించ‌నుంది. భారీ బడ్జెట్ తో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం దీపావళి కానుకగా నవంబర్ 8వ తేదిన విడుదల కానుంది.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here